స‌జ్జ‌ల‌పై నిజాలు మాట్లాడినోళ్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డ‌మా?

వైసీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి కె.ర‌విచంద్రారెడ్డిని పార్టీ ప‌క్క‌న పెట్ట‌డంపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. వైసీపీ శ్రేయ‌స్సు కోరి నిజాలు మాట్లాడితే శిక్ష విధిస్తారా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ప్ర‌భుత్వ మాజీ స‌ల‌హాదారుడు, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి…

వైసీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి కె.ర‌విచంద్రారెడ్డిని పార్టీ ప‌క్క‌న పెట్ట‌డంపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. వైసీపీ శ్రేయ‌స్సు కోరి నిజాలు మాట్లాడితే శిక్ష విధిస్తారా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ప్ర‌భుత్వ మాజీ స‌ల‌హాదారుడు, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కోట‌రీలో కీల‌క వ్య‌క్తి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై సాక్షి చాన‌ల్ వేదిక‌గా ర‌విచంద్రారెడ్డి ఘాటు కామెంట్స్ చేశారు.

కోట‌రీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ, స‌క‌ల‌శాఖ మంత్రిగా పేరుగాంచిన నాయ‌కుడి తీరు వ‌ల్లే వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంద‌ని ర‌విచంద్రారెడ్డి ప‌రోక్షంగా స‌జ్జ‌ల‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్ర‌జ‌ల గుండెల్లో జ‌గ‌న్ ఉన్నార‌ని, ఆయ‌న ఓడిపోలేద‌న్నారు. స‌జ్జ‌ల వ‌ల్లే ఓడిపోయామ‌ని ర‌విచంద్రారెడ్డి అన‌డం వైసీపీ పెద్ద‌ల‌కు కోపం తెప్పించింది.

ఈ నేప‌థ్యంలో ర‌విచంద్రారెడ్డిని వైసీపీ అధిష్టానం ప‌క్క‌న పెట్టింది. ఇక‌పై ర‌విచంద్రారెడ్డిని డిబేట్స్‌కు పిల‌వొద్ద‌ని ఎడిట‌ర్ల‌కు ప‌రోక్షంగా వైసీపీ అధిష్టానం లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైసీపీ పెద్ద‌ల అభిప్రాయం ఎలా వున్నా, స‌జ్జ‌ల‌పై ర‌విచంద్రారెడ్డి కామెంట్స్‌పై ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో సానుకూల‌త ఏర్ప‌డింది.

ఔను, ర‌విచంద్రారెడ్డి మాట్లాడింది నిజ‌మే క‌దా, ఆయ‌న్ను ఎందుకు ప‌క్క‌న పెట్టార‌నే నిల‌దీత వైసీపీ శ్రేణుల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌క్క‌న పెట్టాల్సింది స‌జ్జ‌ల‌ను క‌దా? అని పార్టీ నాయ‌కులు అంటున్నారు. వైసీపీ శ్రేయస్సు కోరి ర‌విచంద్రారెడ్డి పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని బ‌య‌ట పెడితే, ఆత్మ ప‌రిశీల‌న చేసుకోకుండా వేటు వేస్తారా? అనే ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

15 Replies to “స‌జ్జ‌ల‌పై నిజాలు మాట్లాడినోళ్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డ‌మా?”

  1. మీ అత్రం అర్థం అవుతోంది..కానీ జగన్ కి చెప్పే ధైర్యం మీకు లేదుగా..ఇంకేం లాభం ఇవ్వన్నీ రాసి..నిజమైన వైసిపి అభిమానులు ఎప్పుడో సైలెంట్ ఐపోయారు..మీ సైట్ కు కూడా రావట్లేదు..అర్థం అవుతోందా ..

  2. మీరు మాత్రం మంచి చెప్పే కామెంట్స్ డిలీట్ చేస్తారు..అంతే కదా..బేసిగ్గా మనకి మంచి అంటే పడదు..మరేం చేద్దాం

  3. ఒకరిని మంచిగా చూపించాలని అంటే మరొకరి ని చెడ్డగా చూపించాలి.

    బిజ్జల- దేవుడు మిగతా కార్యకర్తల లాంటివాడు మాత్రమే.

    గత ఐదేళ్లలో మీడియా ముందు తాను మాట్లాడడం ద్వారా పార్టీ ప్రతిష్ట పెంచారు.

    అదే అసలు వాడు మాట్లాడితే – డొల్ల- తనం- అంత- బయటపడి- కంపు-కంపు -అయ్యేది.

    తప్పు కో-టరీది- కాదు.ఆ కో–టరీ- వెనుక- ఉన్నవాడిది.

  4. Naku okati ardham ayindhi. GA Venkat Reddy ki last time emi post dhakkaledhu… Manodiki ee salahadarula Valla dhakkaledhemo ani doubt tho 3 months ninchi vallani chavagoduthunnadu.

  5. సకల శాకలు జగనె చూసుకుందాం అనుకున్నారు. అందుకు తాన నమ్మిన బంటు ని పెట్టరు. జగన్ అనుమతి లెకుండా అయన అన్ని శాకల మీద పెత్తనం చెయగలడా?

    జగన్ కి వదిలెసి సజ్జల మీద పడి ఎడిస్తె ఎమి వస్తుంది?

  6. ఎంతసేపూ, వాడి వల్ల ఓడిపోయింది, వీడి వల్ల ఓడిపోయింది అనడమే తప్ప మన అసలు “బంగారం” గురించి మాత్రం మాట్లాడవు కదా.

  7. ఇద్దరినీ చర్చకు కూర్చోబెడితే పడిపోయిన సాక్షి TRP రేటింగ్ పెరుగు/ ద్దేమో ఆలోచించారా?

  8. జగన్ కి కావలసిన ఏర్పాట్లు సజ్జలు చేస్తున్నట్టున్నాడు, అరికట్ల వెంకటరెడ్డి కూడా ఆ సేవలు అంతకంటే ఎక్కువ చేయాలి. అవి ఏవైనా కావచ్చు.

Comments are closed.