విజయవాడలోని మాచవరంలో కొండచరియలు విరిగిపడి ఇజ్జాడ రాము (55) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు కూలీలు గాయాలపాలయ్యారు. విజయవాడలో వరద తగ్గుముఖం పట్టినా ఆ బాధలు తప్పడం లేదు. విజయవాడలో తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ తేమకు కొండ రాళ్లు జారి కిందపడుతున్నాయి.
ఇవాళ కొండ చరియలు విరిగిపడడంతో ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. దీంతో విజయవాడలో విషాదచాయలు అలుముకున్నాయి. విజయవాడలో వరద తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతోంది. బియ్యం బస్తాలు, ఇతరత్రా నిత్యావసర సరుకుల్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
మరోవైపు తాగునీటిని ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. అయితే తగినన్ని ట్యాంకులతో సరఫరా చేయలేదనే విమర్శ వుంది. జనాలు క్యూలో గంటల తరబడి నిలబడినా ఐదారు బిందెల నీళ్లు కూడా దొరకడం లేదనే విమర్శ వుంది.
ప్రభుత్వం ఆదుకునే పనిలో వుండగా కొండచరియలు ఒకర్ని బలిగొనడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ యంత్రాంగం కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలో యుద్ధప్రాతిపదికన తొలగింపు పనులు చేపట్టింది. దేవినేనినగర్కు చెందిన కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
vc available 9380537747
vc estanu 9380537747