విజయ్ హోమ్ డిపార్ట్ మెంట్ లో అపోజిషన్?

విజయ్ కు తండ్రి ఎస్. ఎ. చంద్రశేఖర్ కి సరిపడదని గతంలోనే పలు సంఘటనలు బయటకు వెల్లడించాయి. లేటెస్ట్ భార్య, కొడుకు వ్యవహారం వినిపిస్తోంది.

తమిళ సూపర్ స్టార్ విజయ్ ఇంట ఏం జ‌రుగుతోంది? రాజకీయాల్లో అడుగుపెడుతున్న విజయ్ కు ఫ్యామిలీ నుంచి తలనొప్పి ఎదురయ్యేలా వుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

చిరకాలంగా విజయ్ తన ఫ్యామిలీ కి దూరంగా వుంటున్నారనే గ్యాసిప్ లు వున్నాయి. దీనికి కారణం, విజయ్ ను అతని మేనేజ‌ర్ పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానంతో కొడుకు సంజయ్ వెళ్లి కొట్టాడని టాక్ వుంది. ఈ వ్యవహారం వెనుక ఇద్దరు హీరోయిన్ల వ్యవహారం కూడా వుందనే గ్యాసిప్ వుంది. అప్పటి నుంచి విజయ్ భార్య, కొడుకు దూరంగా వుంటున్నారని అంటారు.

ఈ కారణంతోనే స్వంత కొడుకు తప్పుడు మాటలు విని పెడదోవ పట్టినట్లు, విలన్ గా మారినట్లు, తనే కొడుకును చంపినట్లు గోట్ సినిమా కథ అల్లించారని ఇప్పుడు వినిపిస్తోంది.

విజయ్ కు తండ్రి ఎస్. ఎ. చంద్రశేఖర్ (దర్శకుడు)కి సరిపడదని గతంలోనే పలు సంఘటనలు బయటకు వెల్లడించాయి. లేటెస్ట్ భార్య, కొడుకు వ్యవహారం వినిపిస్తోంది. విజయ్ భార్య ఎలాగైనా తన కొడుకును దర్శకుడిని చేయాలని పట్టుదలగా ప్రయత్నించి లైకా సంస్థలో సందీప్ కిషన్ తో ప్రాజెక్ట్ సెట్ చేయించారని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.

మొత్తం మీద ఈ గుసగుసలు అన్నీ ఎంత వరకు వెళ్తాయి అన్నది ప్రశ్న? విజయ్ ఎన్నికల బరిలోకి దిగినపుడు ఇవన్నీ పక్కాగా బయటకు వస్తాయని, ఫ్యామిలీ ఎదురుగా నిలుస్తుందని చెన్నై వర్గాల బోగట్టా. అప్పుడు ఏకంగా మీడియా ముందుకు వచ్చినా అశ్చర్యం లేదని తెలుస్తోంది.

18 Replies to “విజయ్ హోమ్ డిపార్ట్ మెంట్ లో అపోజిషన్?”

  1. తాను ప్రజలకు నిస్వార్థమైన సేవ చెయ్యాలనుకుంటే , ఎటువంటి తాటాకు చప్పుళ్ళు ఆపలేవు. అతను ఎటువంటి తప్పు చెయ్యకుండా ఉంటే ఏమి కాదు.

    తల్లి కోరుకునేది కొడుకు ని డైరెక్టర్ చెయ్యమని , అది చేస్తే పోలా?

  2. తాను ప్రజలకు నిస్వార్థమైన సేవ చెయ్యాలనుకుంటే , ఎటువంటి తాటాకు చప్పుళ్ళు ఆపలేవు. అతను ఎటువంటి తప్పు చెయ్యకుండా ఉంటే ఏమి కాదు.

Comments are closed.