ఉత్తరాంధ్రకు కూడా ఇదే మాదిరి సాయం

వరదలు ఎక్కడైనా వరదలే. నష్టం ఎక్కడైనా నష్టమే. అందువల్ల సాయం కూడా అలాగే సమానంగా వుండాలి. విజ‌యవాడ వరదల విషయంలో ప్రభుత్వం ఎంత చేయాలో అంతా చేస్తోంది. అందులో సందేహం లేేదు. తప్పు పట్టడానికి…

వరదలు ఎక్కడైనా వరదలే. నష్టం ఎక్కడైనా నష్టమే. అందువల్ల సాయం కూడా అలాగే సమానంగా వుండాలి. విజ‌యవాడ వరదల విషయంలో ప్రభుత్వం ఎంత చేయాలో అంతా చేస్తోంది. అందులో సందేహం లేేదు. తప్పు పట్టడానికి లేదు. ముందుగా చూసుకోలేదు. చెప్పలేదు. చేయలేదు అనేది వేరే వాదన. కానీ వన్స్ డ్యామేజీ జ‌రిగిన తరువాత మాత్రం ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోంది. ఇప్పుడు ఇదే మాదిరిగా ఉత్తరాంధ్రకు కూడా చేస్తుందా అన్నదే చూడాలి.

పవన్ కళ్యాణ్ మట్టిలో కాలు పెట్టినా, నీళ్లలో నడిచినా అది కేవలం ఈస్ట్ గోదావరి, పిఠాపురం వరకే పరిమితం అయినట్లు కనిపిస్తోంది. ఈస్ట్ లో నీళ్లలో నడిచిన పవన్ కాళ్లు విజ‌యవాడ నీళ్లలో అడుగు పెట్టలేకపోయాయి. ఎందుకో చంద్రబాబుకు పవన్ కు తెలియాలి. దక్షిణ కోస్తా క్రెడిట్ అంతా తెలుగుదేశం తీసుకోవాలి. తూర్పు క్రెడిట్ పవన్ తేవాలి అన్నట్లు ప్లాన్ ఏమైనా వుందేమో..

సరే మరి ఇప్పుడు ఉత్తరాంధ్రకు ఎవరు వెళ్తారు? పవన్ నా? చంద్రబాబు నా? లోకేష్ నా? రోజుల తరబడి అక్కడ బస్ లో ఎవరు కూర్చుంటారు? నిత్యం జ‌నాల్లో ఎవరు తిరుగుతారు? మొత్తం ఫోకస్ అంతా విజ‌యవాడ మీద పెట్టారు. దీని వెనుక రియల్ ఎస్టేట్ లెక్కలు, రాజ‌ధాని లెక్కలు వుంటే అది వేరే సంగతి. కానీ ఉత్తరాంధ్ర జ‌నాలను కూడా పరామర్శించాలి. బియ్యం, పప్పు దినుసులు ఇవ్వాలి. ఇక్కడ నియమించినట్లే మూడు కిలో మీటర్లకు ఓ ఎమ్మెల్యేను, ఊరికి ఓ మంత్రిని పెట్టాలి కదా.

అప్పుడు ఉత్తరాంధ్ర మీద కూడా కృష్ణా జిల్లా మీద వున్నంత ప్రేమే చంద్రబాబుకు వుంది అని తెలుస్తుంది. హుద్ హుద్ కు విశాఖలో వుండి చేసారు  అని కౌంటర్ వేయక్కరలేదు. విశాఖ సిటీ, దాని పరిసర ప్రాంతాలు మొత్తం స్ధానికేతరుల చేతిలోకి వెళ్లిపోయి దశాబ్దాలు దాటుతోంది.

16 Replies to “ఉత్తరాంధ్రకు కూడా ఇదే మాదిరి సాయం”

  1. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నావు అని నీ మీద దేశ ద్రోహం కేసు పెట్టీ లోపల ఎందుకు వెయ్యకూడదు GA .. show cause notice

  2. ///ప్రభుతం ఎంత చయాలొ అంతా చెస్తుంది///

    .

    మరి నిన్నటి దాకా ఎమి చెయటం లెదు అన్నావ్. చంద్రబాబు image కొల్పొతున్నాడు అని ఎవెవొ రాసావ్!

  3. అసలు ముందు అక్కడ జరిగిన నష్టం గురించి రాయి, మీ గ్రేట్ ఆంధ్ర ఛానల్ కనీసం వరద ప్రాంతాలకు వెళ్లి ప్రజలు కష్ట నష్టాలు అడిగి తెలుసుకున్నాయా? లేక USA లో కూర్చుని గాలి వార్తలు వార్చి వడ్డించటమేనా?

  4. “వి” అనే అక్షరం జ గ్గ డి కి కలిసి రావట్లా !

    విశాఖ పట్నం .. పర్మినెంట్ గా ఊసేశారు.

    విజయవాడ ..ఎగేసి తన్నేశారు..

    దరిద్రపు వరద రాజకీయం దెబ్బకి ఇక మళ్ళీ ముఖం చూడరు.

    వివేకా .. బాబాయ్ .. భేతాళుడిలా పట్టాడు.

    విజయ .. కన్నతల్లి .. ఛీ కొట్టి పోయింది.

    విజయ సాయి రెడ్డి .. ఎప్పుడైనా లాగి తన్నే అవకాశాలు ఉన్నాయ్ !

Comments are closed.