ఎమోష‌న్లు ప్ర‌మోష‌న్లు లాంటివే.. ఒక ప‌ట్టాన రాలేదు!

ఎమోష‌న్లు ప్ర‌మోష‌న్ల‌లాంటివి బాబూ.. అవి ఒక ప‌ట్టాన రావు, వ‌చ్చిన‌ప్పుడు ఒడిసిప‌ట్టేయ‌డ‌మే.. అంటూ ఒక సినిమాలో క‌మేడియ‌న్ గుండూ హ‌నుమంత‌రావు డైలాగ్ చెబుతాడు. ఆ సినిమాలో కామెడీ ట్రూప్ అంతా పాత సినిమాల్లో న‌టీన‌టుల్లా…

ఎమోష‌న్లు ప్ర‌మోష‌న్ల‌లాంటివి బాబూ.. అవి ఒక ప‌ట్టాన రావు, వ‌చ్చిన‌ప్పుడు ఒడిసిప‌ట్టేయ‌డ‌మే.. అంటూ ఒక సినిమాలో క‌మేడియ‌న్ గుండూ హ‌నుమంత‌రావు డైలాగ్ చెబుతాడు. ఆ సినిమాలో కామెడీ ట్రూప్ అంతా పాత సినిమాల్లో న‌టీన‌టుల్లా స్పందిస్తూ ఉంటుంది. ప్ర‌తిదానికీ ఓవ‌ర్ రియ‌క్ష‌న్ ఇచ్చే కామెడీ ఎపిసోడ్ ఉంటుంది అందులో! ఎమోష‌న్లు ప్ర‌మోష‌న్ల‌లాంటివి అంటూ కామెడీనే చెప్పినా.. ప‌రిణామ క్ర‌మంలో ఎమోష‌న్ల గురించి ప‌రిశోధిస్తే అదే నిజ‌మ‌ని తేలుతుంద‌ట‌! మ‌నిషికి ఇప్పుడు ఉన్న ఎమోష‌న్లు చాలా మ‌టుకు గ‌తంలో ఉండేవి కావు, మ‌నిషికి వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ ర‌క‌ర‌కాల ఎమోష‌న్లు అల‌వ‌డ‌ట‌మే కాదు, ప‌రిణామ‌క్ర‌మంలో కూడా కొన్ని ఎమోష‌న్లు పుట్టుకు వ‌చ్చాయ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి!

ఒక ఏడాది ప‌సి వ‌య‌సులో ఉన్న‌ప్పుడు మ‌నిషికి చాలా త‌క్కువ ఎమోష‌న్లు ఉంటాయి! కేవ‌లం బాధ‌, ఆనందం, చిరాకు, ఆశ్చ‌ర్యం.. ఇవి మ‌నిషికి ఏడాది వ‌య‌సు వ‌ర‌కూ ఉన్న ఎమోష‌న్లు. వీటికి స్పంద‌న‌లుగా ఏడ‌వ‌డం, న‌వ్వ‌డం, మొహం అదోలా పెట్ట‌డం.. ఇవ‌న్నీ ఎక్స్ ప్రెష‌న్లు! పెరిగే కొద్దీ మ‌నిషికి ర‌క‌ర‌కాల ఎమోష‌న్లు అల‌వాటు అవుతాయి. అందులో జ‌ల‌సీ, యాంగ్జైటీ వంటికి ముఖ్య‌మైన‌వి.

ప‌రిణామ క్ర‌మంలో కూడా ఎమోష‌న్లు మ‌నిషికి క్ర‌మ‌క్ర‌మంగా అల‌వాటు అయ్యాయ‌ట‌! అందులో ముఖ్య‌మైన‌ది ప్రేమ‌! ల‌వ్ కూడా ఒక ఎమోష‌నే క‌దా! అయితే ఇది మ‌నిషికి ఆదిలో ఉండేది కాద‌నో, ఉండే అవ‌కాశం లేద‌నో అంటున్నాయి ప‌రిశోధ‌న‌లు. అత‌డి రిప్రొడ‌క్టివ్ సిస్ట‌మ్ ఈ ప్రేమ అనే ఎమోష‌న్ ను నాటింది. అలాగే ప్ర‌మాదం ఎదుర‌వుతున్న‌ప్పుడు భ‌యం అనే ఎమోష‌న్ మొద‌లైంది.
మ‌నిషి ఎమోష‌న్స్ పూర్తిగా మెద‌డు నియంత్ర‌ణ‌లో ఉంటాయ‌ట‌! మ‌న‌సు అనుకుంటాం కానీ, మెద‌డే పూర్తిగా ఎమోష‌న్ల‌ను నియంత్రిస్తుంద‌ట‌! మెద‌డులో కొన్ని భాగాలు ఈ ప‌నిలోనే బిజీగా ఉంటాయ‌ట‌. ఇవే మూడ్ మేనేజ్ మెంట్ కూడా చేస్తాయ‌ట‌!

మెద‌డులో ఆల్మంట్ సైజులో అమిగ్డ‌లా భ‌యం అనే ఎమోష‌న్ ను నియంత్రిస్తుంద‌ట‌! ముందున్న డేంజ‌ర్ల‌ను ఇది విశ్లేషిస్తుంద‌ట‌, ఆ విశ్లేష‌ణ‌ల‌ను శ‌రీరానికి పంపుతుంది. నెర్వెస్ సిస్ట‌మ్ ను ట్యూన్ చ‌స్తుంది. దాంతో పాటు శ‌రీరంలో అడ్రెన‌లిన్ ను జ‌నింప‌జేసి ఫైట్ చేయ‌డానికి అయినా పారిపోవ‌డానికి అయినా రెడీ చేస్తుంద‌ట‌!

మెద‌డులోని న్యూరో ట్రాన్స్ మీట‌ర్లు ఎమోష‌న్స్ ను నియంత్రిస్తాయి. నొర‌డ్రెన‌లైన్ ఒత్తిడిని- యాంగ్జైనిటీని, డోప‌మైన్ ప్ల‌జ‌ర్ హార్మోన్ ను, సెరోటోనిన్ మెమోరీ-మూడ్ స్టెబిలైజ‌ష‌న్ ను ప్ర‌భావితం చేస్తాయి. శారీర‌క యాక్టివిటీ కూడా ఎమోష‌న‌ల్ బ్యాలెన్స్ లో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ఫిజిక‌ల్ యాక్టివిటీ బాగా ఉంటే.. ఇది సెరోటోనిన్, ఎండార్ఫిన్ ను ప్ర‌మోట్ చేస్తుంద‌ట‌. ఇవి హ్యాపీనెస్ హార్మోన్స్. ఇవి పుష్క‌లంగా జ‌నిపించిన‌ప్పుడు సంతృప్తి, రిలాక్సేష‌న్ ఫీలింగ్ బాడీలో క‌లుగుతాయ‌ట‌!

మ‌నిషి ఒక్క‌డే ఉన్న‌ప్పుడు జ‌ల‌సీ అనే ఎమోష‌న్ లేదంటారు. త‌న‌తో పాటు చెల్లో, త‌మ్ముడో ఉన్న‌ప్పుడు మ‌నిషికి జ‌ల‌సీ మొద‌ల‌వ్వొచ్చు! చిన్న వ‌య‌సులో పేరెంట్స్ అటెన్ష‌న్ విష‌యంలో అది మొద‌ల‌వుతుంది. ఇక యుక్త వ‌య‌సుకు వ‌చ్చే స‌రికి జ‌ల‌సీ క‌ల‌గ‌డానికి బోలెడు కార‌ణాలు! మ‌నిషి సంఘ‌జీవి అయ్యాకే.. జ‌ల‌సీ అనే ఎమోష‌న్ అత‌డిని వెన్నాడుతూ ఉంది. అలాగే మొహ‌మాటం, న‌లుగురి మ‌ధ్య‌న నిలబ‌డ‌టానికే ఇబ్బంది ప‌డ‌టం, ఎవ‌రో ఏదో అనుకుంటూ ఉంటార‌నుకోవ‌డం.. వంటివి కూడా మ‌నిషి సంఘ‌జీవిగా మారాకా మొద‌లైన ఎమోష‌న్లే!

మ‌నిషిలో ఎమోష‌న్ల‌ను పురికొల్పే శ‌క్తి సువాస‌న‌ల‌కు కూడా ఉంటుంది. ఇది కూడా శాస్త్రీయంగా నిరూపిత‌మైన అంశ‌మే, స్టార్ హోటల్స్ లో వెద‌జ‌ల్లే రూమ్ ఫ్రెష‌నర్లు అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని అందంగా ఉంద‌నే భావ‌న‌ను క‌లిగిస్తాయి. అయితే దీర్ఘ‌కాలం పాటు వాటికి అల‌వాటు ప‌డితే స్పందించ‌డం ఆగిపోతుంది కూడా!

-హిమ‌

6 Replies to “ఎమోష‌న్లు ప్ర‌మోష‌న్లు లాంటివే.. ఒక ప‌ట్టాన రాలేదు!”

  1. ఒరిజినల్ రైటర్ కి క్రెడిట్ ఇవ్వండి.

    అసలు ఎటువంటి ఎమోషన్ లేకుండా, శవం దగ్గర కూడా చిరునవ్వు నవ్వే వాళ్ళ సంగతేంటి? వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి?

  2. హిమ ( ఆ మాట అర్థం తెలిస్తే) భావోద్వేగాలు గురించి రాయడం ఫ్రీజింగ్ ఎఫక్ట్

Comments are closed.