నీళ్ల ట్యాంక్ లో రోజంతా ఎన్టీఆర్..!

ఓ షాట్ కోసం హీరోలు ఎంత కష్టపడతారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దేవర సినిమాలో ఓ సీక్వెన్స్ కోసం తన కష్టాన్ని బయటపెట్టాడు హీరో ఎన్టీఆర్. ఒక రోజంతా పీకల్లోతు నీళ్లలో అలా ఉండిపోయాడు.…

ఓ షాట్ కోసం హీరోలు ఎంత కష్టపడతారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దేవర సినిమాలో ఓ సీక్వెన్స్ కోసం తన కష్టాన్ని బయటపెట్టాడు హీరో ఎన్టీఆర్. ఒక రోజంతా పీకల్లోతు నీళ్లలో అలా ఉండిపోయాడు.

దేవర-1 ట్రయిలర్ రిలీజైంది. పూర్తిగా మాస్-యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కిందనే విషయం ట్రయిలర్ తో స్పష్టమైంది. ట్రయిలర్ లో సన్నివేశాలన్నీ ఒకెత్తయితే, చివర్లో వచ్చిన ఒకే ఒక్క షాట్ మరో ఎత్తు. షార్క్ తో ఫైట్ అది. ఆ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించాడు తారక్.

“ఆ షాట్ తీయడానికి చాలా కష్టమైంది. మా సినిమాలో చాలా టైమ్ తీసుకున్న సీక్వెన్సెస్ లో అదొకటి. ఆ షాట్ కోసం 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, ఐదున్నర అడుగుల ఎత్తు ఉన్న నీళ్ల ట్యాంక్ లో దిగాను. ఆ షాట్ కోసం దాదాపు ఒక రోజంతా ఆ ట్యాంక్ లోనే ఉన్నాను. ఫైనల్ గా షాట్ ఓకే అయింది.”

‘షార్క్ ఫైట్’ దేవర సినిమాకు హైలెట్ అవుతుందంటున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర-1 సినిమా 27న థియేటర్లలోకి వస్తోంది.

అడ్వాన్స్ బుకింగ్స్ లో భాగంగా ఈ సినిమా ఓవర్సీస్ లో ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయింది. ట్రయిలర్ కూడా రిలీజ్ అవ్వకముందే సినిమా ఈ ఘనత సాధించడం విశేషం. దానిపై ఎన్టీఆర్ స్పందించాడు. ఓవర్సీస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.

8 Replies to “నీళ్ల ట్యాంక్ లో రోజంతా ఎన్టీఆర్..!”

  1. కోట్లకు కోట్లు సొమ్ము ఇస్తుంటే.. మురిగి కాలవలో కూడ ఉంటారు. ఏ నీకు అన్ని కోట్లిస్తే నువ్వు నిలబడవా?

Comments are closed.