అప్పుడు తాళి కట్టాడు.. ఇప్పుడు తాళి కొట్టేశాడు

రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తన రాజ్ పై లావణ్య మరో కొత్త కేసు పెట్టింది. ఈసారి చోరీ కేసు. Advertisement అవును.. తన ఇంట్లో బంగారాన్ని రాజ్ తరుణ్…

రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తన రాజ్ పై లావణ్య మరో కొత్త కేసు పెట్టింది. ఈసారి చోరీ కేసు.

అవును.. తన ఇంట్లో బంగారాన్ని రాజ్ తరుణ్ దోచుకున్నాడని ఆరోపిస్తోంది లావణ్య. ఈ మేరకు మరోసారి పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. 12 లక్షల రూపాయల విలువైన బంగారంతో పాటు, హార్డ్ డిస్క్ కొట్టేశాడని కేసుపెట్టింది లావణ్య.

“4 నెలల కిందట నేను డ్రగ్స్ కేసులో ఇరుక్కొని జైల్లో ఉన్నప్పుడు రాజ్-మాల్వి మల్హోత్రా నా ఇంటికొచ్చారు. 3 రోజులున్నారు. ఇంట్లో నుంచి రాజ్ తరుణ్, మాల్వీ వెళ్లిపోయారు. అలా వెళ్తూ బంగారం తీసుకెళ్లిపోయారు. నా బంగారం రాజ్ తీశాడా లేక మాల్వీ తీసిందా లేక ఇద్దరూ కలిసి దొంగతనం చేశారా అనేది తెలియదు. అందులో నా తాళి కూడా ఉంది. నా ఇంటి బీరువా తాళాలు చాలా నెలలుగా రాజ్ దగ్గరే ఉన్నాయి. మొన్న ముంబయి వెళ్లినప్పుడు తెచ్చుకున్నాను.”

రీసెంట్ గా తండ్రితో కలిసి ముంబయి వెళ్లిన లావణ్య, అక్కడ రాజ్ తరుణ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మాల్వి మల్హోత్రా కలిసి అతడు గదిలో ఉన్నాడు. దానికి సంబంధించిన వీడియోను కూడా లావణ్య విడుదల చేసింది. అదే వీడియోను పోలీసులకు కూడా అందించింది.

అదే టైమ్ లో బీరువా తాళాల గురించి అడిగితే తెలియదని రాజ్ బుకాయించాడని.. గట్టిగా అడగడంతో మాల్వి మల్హోత్రా తన ప్యాంట్ జేబు నుంచి బీరువా తాళాలు తీసి ఇచ్చిందని చెబుతోంది లావణ్య.

13 Replies to “అప్పుడు తాళి కట్టాడు.. ఇప్పుడు తాళి కొట్టేశాడు”

  1. “గట్టిగా అడగడంతో మాల్వి మల్హోత్రా తన ప్యాంట్ జేబు నుంచి బీరువా తాళాలు తీసి ఇచ్చిందని”

    అతని pants జేబులో చేయు పెట్టి ఆవిడ తీసిందా? అతని తీసుకోలేడా?

    1. మీకు ఆలా అర్ధం అయ్యిందా? మాల్వి ప్యాంటు లు వేసుకోదు అనే నిర్ణయానికి వచ్చేసారా?

  2. థాంక్ యు లావణ్య.. ఆ దిక్కుమాలిన బిగ్ బాస్ కన్నా ఎక్కువ టైమ్ పాస్ దొరికింది జనాలకి…

  3. గ్రేట్ ఆంధ్ర లావణ్య కోసం ఇంత చెమట ఓడ్చడం ప్రపంచపు నాల్గవ వింతే. కమ్మ వాళ్ళ మీద విషాన్ని చిమ్మే ఈయనకి లావణ్య లో ఎదో కోణం నచ్చినట్టుంది.

    1. ఒక్క రాయితో రెండు పిట్టలు.. లావణ్య.. రాజ్.. ఇద్దరినీ వెధవలుగా చూపించే ప్రయత్నం..

  4. గీత దాటాక ఎవరికైనా మిగిలేది ఇలాంటి కష్టాలే. తాళి పోయిన యవ్వన పుతావి పోయిన తిరిగి రాదు.

Comments are closed.