బాలినేని వైసీపీని వీడే వేళైందా?

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి వైసీపీని వీడే వేళ అయ్యిందా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. బాలినేని పార్టీ వీడ‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే…

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి వైసీపీని వీడే వేళ అయ్యిందా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. బాలినేని పార్టీ వీడ‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే వైసీపీ పెద్ద‌లు మాత్రం బాలినేని ఎక్క‌డికీ వెళ్ల‌ర‌ని తేల్చి చెబుతున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను తాడేప‌ల్లిలో బాలినేని క‌లిశార‌ని ఆ పార్టీ నాయ‌కులు తెలిపారు.

వైసీపీలో చాలా కాలంగా బాలినేని తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈవీఎంల‌పై పోరాడుతుంటే పార్టీ నుంచి క‌నీసం త‌న‌కు నైతిక మ‌ద్ద‌తు కూడా లేద‌ని ఇటీవ‌ల ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైసీపీలో త‌న‌కు ప్రాధాన్యం లేద‌ని ఆయ‌న గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా జ‌గ‌న్ రెండో కేబినెట్ విస్త‌ర‌ణ‌లో భాగంగా త‌న‌ను తొల‌గించ‌డంపై ఆయ‌న మండిప‌డుతున్నారు.

త‌న జిల్లాకే చెందిన ఆదిమూలం సురేష్‌ను కొన‌సాగించ‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోయారు. బాలినేనిలో అసంతృప్తికి అక్క‌డే బీజం ప‌డింది. అది అంత‌కంత‌కూ పెరుగుతూ పార్టీ వీడాల‌ని వ‌ర‌కూ వెళ్లింది. వైసీపీలో బాలినేని కీల‌క నాయ‌కుడు. వైఎస్ జ‌గ‌న్‌కు స‌మీప బంధువు కూడా.

బాలినేనికి జ‌గ‌న్ ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇస్తున్నార‌ని పార్టీలో కొంద‌రు అసంతృప్తిగా ఉన్నారు. అయితే జ‌గ‌న్ వాటిని ప‌ట్టించుకోలేదు. మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డాన్ని అవ‌మానంగా భావించిన బాలినేని, అప్ప‌టి నుంచి అధినేత‌పై స‌న్నిహితుల వ‌ద్ద విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. అందుకే ఆయ‌న పార్టీ వీడుతార‌నే ప్ర‌చారం తెర‌పైకి రావ‌డం. జ‌న‌సేన‌లోకి వెళ్తార‌నే ప్ర‌చారంలో నిజ‌మెంతో బాలినేని చెప్పాల్సి వుంది.

9 Replies to “బాలినేని వైసీపీని వీడే వేళైందా?”

  1. still jagan has not lesrned from his past bungles and never helped balineni in fighting against EVM, that type of monarchism from jagan would sure bury him again , he is not realizing and put a deaf ear to honest advice

  2. వెళ్లకుండా ఆగిపోతే శీనన్న దేవుడు, మహా నేత అని..ఆగకుండా వెళ్లిపోతే శీను గాడు లుచ్చా, లఫంగి అని..ఆర్టికల్స్ రెడీ చెయ్యి ఎంకటి..

Comments are closed.