ప్రమాదం వచ్చిన ప్రతీసారీ ఒక ‘యేచూరి’!

ఒక పక్క మండల్‌ సిఫారసుల అమలుకు ఉద్యమం, మరొక పక్క మందిర్‌ నిర్మాణం కోసం ఉద్యమం.

పార్టీలు పార్టీలు అంటారు కానీ, అన్ని పార్టీలు అన్ని కాలాల్లో వెలగవు. కొన్ని వెలిగి ఆరిపోతాయ. కొన్ని ఆరిపోయి వెలుగుతాయ. మొత్తానికి నిలుస్తాయి. వీటిలో ‘లెఫ్ట్‌’ పార్టీలూ వుంటాయి. ‘రైట్‌’ పార్టీలూ వుంటాయి. మనుషుల్లో ‘కుడి’‘ఎడమ’ల తేడాలు పాటించటం తప్పు. కానీ పార్టీల్లో పాటించకపోవటం తప్పవతుంది.

మనుషుల్లో వ్యత్యాసాల చూడటానికి కులం, జాతి` ఎలాంటివి తెస్తారు. కానీ పార్టీల విషయంలో ఈ తేడాలకు ‘సిధ్ధాంతాలు’ కారణాలవుతాయి. అలా చూస్తే, దేశంలో ‘లెఫ్ట్‌’ (కమ్యూనిస్టు) పార్టీలు 2014 వరకూ దేశంలో బాగానే వెలిగాయి. తర్వాత ఆరిపోయాయి. అంతవరకూ ఆరిపోయినట్లు ‘రైట్‌’ పార్టీలు (బీజేపీ వగైరా) కనిపించి, 2014 తర్వాత బాగా ప్రకాశించాయి. ‘మధ్యే’ వాదులమని (సెంట్రిస్టుల) మని కొన్ని పార్టీలు పుట్టుకొస్తాయి కానీ, అవి పూర్తిగా మధ్యన వుండవు. వీలును బట్టి కొన్ని ‘ఎడమ’కు ఒరుగుతాయిÑ మరి కొన్ని ‘కుడి’కి వాలుతాయి. ఈ పాత్రను కాంగ్రెస్‌ లాంటి పార్టీలు చాలా సమర్ధవంతంగా పోషిస్తుంటాయి.

అలాంటి లెఫ్ట్‌ పార్టీల్లో అరుదయిన దేశంలో ఆవర్భివించారు. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో పుచ్చలపల్లి సుందరయ్య పేరును స్మరిస్తూనే వుంటారు. అయితే ప్రపంచంలోనే కమ్యూనిస్టులంటే రక్తసహిత విప్లవం ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారని ప్రపంచమంతటా నమ్ముతూ వచ్చారు. రష్యా, చైనాల్లో అలాగే వచ్చాయని ఉదాహరణలుగా చూపిస్తూ వచ్చేవారు. కానీ రక్తరహితంగా, ఎన్నికల ద్వారా కూడా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్వవచ్చని ఒక భారతీయుడే ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయనే కేరళకు చెందిన నంబూద్రిపాద్‌. ఆయనే కేరళలో (1957లో) ముఖ్యమంత్రి తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.

చిత్రమేమిటంటే, దేశంలో ఇతర రాష్ట్రాలలో ఎక్కడా కమ్యూనిస్టులకు ఉనికి లేకుండా పోయినా, ఇప్పటికీ అదే రాష్ట్రంలో కమ్యూనిస్టులే (లెఫ్ట్‌ ప్రంట్‌) సర్కారును నడుపుతున్నారు. అంటే ‘బాలట్‌’ ద్వారా వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా సుస్థిరంగా వుండగలదని లోకానికి చాటి చెప్పారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌. అక్కడ ఏకంగా ఒక్కనేతే (జ్యోతిబసే) 23యేళ్ళ పాటు ఏకబిగిన(1977`2000) పశ్చిమబెంగాల్‌ను ఏకబిగిన పాలించాడు. ఆ తర్వాత ఆ స్థానాన్ని బుద్ధదేవ్‌ భట్టాచార్య భర్తీ చేశారు. వీరు జాతీయోద్యమ కాలంలో రాజకీయాల్లోకి ఆకర్షితులయిన వారు.

వీరి తర్వాత తరం ఒకటి వున్నది. వీరు ఎమర్జన్సీకి వ్యతిరేకంగా జరిగిన మానవహక్కుల ఉద్యమ స్ఫూర్తిలోంచి వచ్చిన వారు. దోపిడీ అంటే ధనిక` పేద తారతమ్యం అంత చిన్నది కాదు అని గ్రహించిన వాళ్లు వీళ్ళు. వీళ్ళలో ముఖ్యులు సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కారత్‌. సీతారాం యేచూరి (12 సెప్టెంబరు 2024)న ఢల్లీిలో కన్ను మూశారు. సీతారం ఏచూరి తెలుగు వాడు. వారి పూర్వికులది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ. మద్రాసులో పుట్టి, పెరిగారు. కానీ ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది. మాత్రం ఢల్లీిలోని జవహర్‌ లాల్‌ యూనివర్శిటీ (జె.ఎన్‌.యు) క్యాంపస్‌. ఈ యూనివర్శిటీలో చదివిన వారు ఇటీవలి కాలం వరకూ వామపక్ష సిధ్ధాంతాలకు ఆకర్షితులయ్యే వారు.

అసలే యేచూరి అక్కడ పీహెచ్‌డీ చేసింది అర్ధశాస్త్రంలో. కార్ల్‌ మార్క్స్‌ ‘పెట్టుబడి’ ప్రభావం ఆయన మీద బాగానే పడివుంటుంది. దానికి తోడు ఆయన ఈ క్యాంపస్‌లో వుండగానే, ఇందిరాగాంధీ ఎమర్జన్సీని ప్రకటించారు. అప్పటికే ఆయన సీపిఐ(ఎం)కు అనుబంధంగా వున్న స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌.ఎఫ్‌.ఐ)లో చేరివున్నాడు. విద్యార్ధి సంఘాన్ని నిషేధించటాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. యూనివర్శిటీలో విద్యార్థులకు ప్రవేశించటానికి చూడాల్సిందేమిటీ? వారి విద్యార్హతలా? లేక వారి రాజకీయ అభిప్రాయాలా? అని ప్రశించాడు. ఇలా ప్రశ్నించినందుకే ఆయన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన జెఎస్‌యూ విద్యార్ధి సంఘానికి మూడు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

అప్పట్లో జె.ఎన్‌.యూకి వైస్‌ ఛాన్సలర్‌ ఎవరున్నా, ఛాన్సలర్‌గా మాత్రం ప్రధాని ఇందిరాగాంధీ. ఇది కుదరదని 500 మంది విద్యార్థులను వెంటబెట్టుకుని, ఆయన ఇందిరమ్మ ఇంటి ముందు భైటాయించారు. రెండు రోజుల తర్వాత ఆమె జెఎన్‌యూ ఛాన్సలర్‌ పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఆయన నేరుగా సీపీఐ (ఎం) పార్టీ పదవుల్నే చేపట్టారు. ముందు కేంద్ర కమిటీలోకి, తర్వాత పాలిట్‌ బ్యూరోలోకి వెళ్ళారు. అక్కడే ప్రకాష్‌ కారత్‌ ఆయనకు సమవుజ్జీగా వుండేవారు.

జ్యోతిబసు, బుధ్దదేవ్‌ లలాగా, యేచూరి, ప్రకాశ్‌ లద్వయం పార్టీకి కొత్త చూపునిచ్చింది. అంతేకాదు. నంబూద్రిపాద్‌ ఎన్నికల రాజకీయాల్లోకి కమ్యూనిజాన్ని ప్రవేశపెడితే, యేచూరి ప్రకాశ్‌లు, సంకీర్ణ రాజకీయాలకు సరిపడేలా కమ్యూనిస్టుల వ్వూహాలను మార్చరు. మరీ ముఖ్యంగా 1990ల తర్వా భారత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఒక పక్క మండల్‌ సిఫారసుల అమలుకు ఉద్యమం, మరొక పక్క మందిర్‌ నిర్మాణం కోసం ఉద్యమం. అంతే కాదు.

కమ్యూనిస్టులు ప్రతిపాదించే ప్రభుత్వ రంగ ప్రమేయాన్ని పూర్తిగా తగ్గిస్తూ ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. మందిర్‌ను, గ్లోబలైజేషన్‌ను నిలువరించాలంటే, ఎవరిని కలుపుకోవాలీ అన్న అంశం మీద యేచూరి కసరత్తు చేశారు. అలాగని సంకీర్ణ రాజకీయాల్లో అధికారం కోసం ఎగబడలేదు. అలా ఎగబడితే ఎంత నష్టం వుంటుందో ముందుగానే యేచూరి అంచనా కట్టారు. అందుకనే, ‘ప్రంట్‌’ సర్కారులో జ్యోతిబసుకు ‘ప్రధాని పదవి’ ఇస్తానన్నా, యేచూరి, కారత్‌లు బసు చేతనే తిరస్కరించేటట్టు చేశారు.

కడకు 2004లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీయే సర్కారులో 60 సీట్లతో సీపిఎం కూడా అంతర్భాగమయ్యంది. అయనా అణుఒప్పందంవ విషయంలో మన్‌ మోహన్‌ సింగ్‌ అమెరికా మాట విన్నందుకు నిరసనగా వైదొలగారు. అలాగే పెద్దగా సీట్లు రాక పోయినా, మోడీ రాజకీయాలను ‘మత విద్వేషరాజకీయాలని’ బాహాటంగా హెచ్చరించాడు యేచూరి. ఇప్పుడు మళ్ళీ కొత్త నాయకత్వం అవసరం కమ్యూనిస్టు పార్టీలకు వుంది. ఆ లోటును ఎవరు పూరిస్తారో మరి!?

39 Replies to “ప్రమాదం వచ్చిన ప్రతీసారీ ఒక ‘యేచూరి’!”

  1. కంపునిస్ట్ లు అధికారంలో ఉన్న కేరళ ఒక్కటి కూడా కాలగర్భంలో కలిసిపోనుంది రాసిపెట్టుకోండి. కంపునిస్ట్ లు అనేది దేశంలో ముగిసిన అధ్యాయం

    1. Steps of Making Kerala into Islamic Republic.

      Step 1: It’s not really happening

      Step 2: Yeah, it’s happening, but it’s not a big deal

      Step 3: It’s a good thing, actually.

      Step 4: People freaking out about it are the real problem

      1. కింద సారీ చెప్పాను, చీఫ్ సెక్రటరీ గా పని చేసిన కందా మోహన్ గారి మేనల్లుడు అని వేరే వారు రాస్తే గుర్తుకు వచ్చింది!

  2. Communists RUINED West Bengal. Kerala is full of faction murders by CPM. They are against development. Even in Orissa they tried to block Mission Shakthi scheme which helped many rural women.

  3. SOVIET RASHYA SOCIALIJM ,, 15 MUKKALU ,,CHAINA VISTHAARA VAADAM (HINDI CHEENI BHAAIE BHAIEE) AXAAIE CHAINA KHABJAA ,,, BHARATH LO CONGRES THO POTTHU ( (CHAARITHRAKA THAPPIDAM) THO COMUNIST MUGISINA CHARITHRA ,,, EPPUDO CONGRES LO 16 PAARTYS THO KALSI POIEE PRAJALA DRISHTI LO LEDERS BUT NO CADER PAARTYS GAA MAARI POIENDI . MAATRU DESHAALO ( RASHYA , CHAINA )PAARTY NIYATHRUTVA DHORANI PRAJAASWAAMYAM ANNANDU KE YUDDHA TANKLATHO ANACHIVETHA THO INKAA DEENA STHITHI LOKI POIEENDI ,,, CONGRES , COMUNIST ,, CORREPTION,, CONVERTION , KENDRA BHINDUVULUGAA KANAPADU CHUNNAAIEE ,, PRAJALU PAKKANA PETTADAANIKI MUKYA KAARANAALUUUUUU .

  4. కాలానుగుణంగా మారకపోతే కాలగర్భంలో కలిసిపోవలసిందే అని మనకు ప్రత్యక్షంగా చూపించినవాళ్లు కమ్మునిస్టులు …పేదవాడు ఆస్తిపరుడిని చూసి అసూయతో వాడిసొమ్ము లాక్కుందాం అంటే సై అంటాడు … లాక్కున్నాక వీడు కొంత ఆస్తిపరుడు అయ్యాడు కనుక వీడికన్నా పేదవాడికి పంచిపెట్టు అంటే వాడే ఈ కమ్మునిస్టులని చె ప్పు తో కొడతాను అంటాడు.. అది మానవనైజం

  5. ఒక తెలుగు వాడు దేశం లో ఉన్నత స్థాయి లో చలామణి అయ్యాడు అనే ఆనందం తప్ప ఈయన భావజాలాన్ని సమర్ధించలేము. బ్రాహ్మణుల్లో చాలామంది కమ్యూనిజానికి ఆకర్షితులై అట్టడుగు వర్గాలకి పట్టం కట్టారు. ఇది కార్ల్ మార్క్స్ సిద్ధాంతం కాకపోయినా , దళితుల స్థితి గతులకు రూపాంతరం చెందేలా చెయ్యడం ద్వారా, ప్రపంచం లో కనుమరుగయినా ఇంకా ఇండియా లో బ్రతికి బట్ట కడుతుంది. మార్క్సిజం కు ఫౌండేషన్ పారిశ్రామీకరణ, కూలివాడు ఎప్పటికీ కూలివాడుగా వుండే సిద్ధాంతం అది, దానికి ఎల్లకాలం మనుగడ ఉండదు. గ్లోబలైజషన్ లో కమ్యూనిజం అనేది ఒక అవుట్ డేటెడ్ ఫిలాసఫీ. వాళ్ళు ఇంకా తట్ట బుట్ట సర్దుకోవడమే మిగిలి వుంది. అది గమనించి దళితులని ,ముస్లిమ్స్ ని ఎగదోసే దుశ్చర్యలకు వీళ్ళు పాలుపడుతుండటం ఆందోళనకరం. నీళ్లు నూనె లాగా వుండే ముస్లిమ్స్ కూడా ఈ కమ్యూనిస్ట్స్ ల వలలో చిక్కుకోవడం వీళ్ళ నేర్పరితనానికి నిదర్శనం.

    ఏచూరి గొప్పతనమేంటంటే అధికారం కోసం అడ్డదారులు తొక్కలేదు, అదే అయన ఆత్మకి శాంతి.

    1. ముస్లిం లు వీళ్ళ ని ఉపయోగించుకుని అవసరం తీరాక పక్కన పడేస్తారు!

  6. ఆత్మ న్యూనతా భావం.. ఆత్మ వంచన.. ఆత్మ ద్రోహం.. ఆత్మ ద్వేషం.. ఇలాంటి భ్రష్టు మొత్తం మూటగట్టుకున్న బ్రాహ్మణ తరం అది.. మరి దేశం దిక్కుమాలిన స్థితి లో ఉండదా మరి…

  7. ఒక బూర్జువావిప్లవసింహమూ

    ఒక నిబద్దత కలిగిన విదేశీభక్తుడూ

    ఒక 5 స్టార్ కమ్యూనిస్టూ

    మన మధ్యనుండి వెళ్ళిపోవటం బాధాకరం

    చైనా నాయకత్వానికి నేపాల్ కమ్యూనిస్టు పార్టీకీ నా ప్రగాఢ సానుభూతి

  8. పాపం మార్క్సిస్టులు

    35 ఏళ్ళు ఏకధాటీగా పాలించిన బెంగాల్ లో ఇవాళ ఒక్క రాజ్యసభ సభ్యుడిని కూడా గెలిపించుకోలేని దుర్గతిలో పడిందంటే, కడుపు తరుక్కుపోతుంది

    దేశం మొత్తం మీద చచ్చీచెడీ అయిదారుస్థానాలు కూడా గెలవలేని హీనస్థితిని చూస్తే ఉసూరుమనిపిస్తున్నది

    ఒంటికన్ను సెక్యులరిజాన్ని నిష్టగా పాటించారు

    హిందువులను ఊచకోత కోస్తున్నా కిమ్మనలేదు

    మైనారిటీల నెత్తి మీద వెంట్రుక కదిలినా అల్లరల్లరల్లరి చేసారు

    గోద్రా రైలు దహనంలో 70 మందిని నిర్ధాక్షిణ్యంగా సజీవదహనం చేసినా దానిని ఎలా బయటకు రాకుండా నొక్కేసారో తెలుసుగా

    బంగ్లాదేశీలు బెంగాల్లో అల్లరల్లర్లు చేస్తూ హిందువులమీద మారణకాండకు తెగబడ్డా మీడియా సాయంతో ఎలా తొక్కిపట్టారో చూడాలేదా

    దశాబ్దాలుగా కాశ్మీర్లో హిందువులను ఊచకోత కోస్తున్నా బయటకు రానిచ్చారా

    హిందువులు పొరపాటున ఎదురు తిరిగితే ఎలా కాకిగోల చేసి నోళ్ళు మూయించారో చూడలేదా

    చైనా కోసం జైలుకెళ్ళారు

    పాకిస్తాన్ కోసం ఉగ్రవాదుల తరఫున పోరాడారు

    దేశశ్రేయస్సు కన్నా అధికారమే ముఖ్యమనుకుని బంగ్లాదేశ్ అక్రమ వలసదారులని ప్రోత్సహించారు. వాళ్ళకు సకలసౌకర్యాలు కలిగించారు. కంటికి రెప్పలా కాపాడారు. వాళ్ళు అల్లర్లు అలజడులు హింసాకాండ సృష్టించినా లాలించారు. అయినా పాపం వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు.

    వీళ్లకన్నా ఎక్కువ బులిపించటానికి దీదీ దొరికింది. కమ్మీల బొచ్చెలో రాయి పడేసి అటేపు జంపయిపొయారు. మైనారిటీ యక్షగానం గుండుగుడిసి పోయింది. హిందువులు ముక్కుతో చీది విసిరిపారేసారు. దిక్కు తోచక కులపార్టీల బూర్జువాపార్టీల అవినీతి సమ్రాట్టుల వీపు గోకటంలో స్పీడు పెంచారు. అయినా ఫలితం దక్కలేదు.

    పెట్టుబడిదారులు ఎప్పుడూ వ్యతిరేకమే

    మధ్యతరగతి ప్రజలు ఎన్నడూ నమ్మలేదు

    చివరాఖరుకు పేదప్రజలు కూడా దూరంగా పెట్టారు.

  9. రంజాన్ నాడు టోపీ పెట్టాము.

    క్రిస్మస్ నాడు చెలరేగి పోయాము

    రామనవమినాడు తిట్టిపోసాము

    అయినా మాకు సీట్ల కోసం బూర్జువా పార్టీలను కులగజ్జి పార్టీలను అవినీతి సింహాలను ముష్టెత్తుకోవాల్సిన పరిస్థితి ఎందుకు కల్పించారు

    యా అల్లా నా దువా నిష్టగా లేదా

    ఓ ప్రభువా నా ప్రార్ధన సక్రమంగా లేదా

    ఈ హైందవజాతిని నాశనం చేయటానికి మా ప్రాణాలైనా అర్పిస్తాము

    ఈ హిందుస్థాన్ ను బద్నాం చేయటానికి దేనికైనా సిద్దమే

    ఎందుకంటె మేము కుహనా ప్రగతిశీల అభ్యుదయవాద లౌకిక శక్తులం

    ఎందుకంటే మేము కమ్మీలము, చైనాకు డమ్మీలము

  10. oka neechudi maranam tho Bharata bhoomi ki bharam thaggindi. General ga okari chaavu jarigina tharuvtha vaadi gurinchi maatlada kudadu. But veedu maathram neechathi neechudu. bharatha bhoomi ki pattina peeda viragada ayyindi. Daridrudu

Comments are closed.