ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలనాలకు మారుపేరు. మరోసారి ఆయన సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం ఆయన తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.
ఇవాళ ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్‌లో నిర్దోషిగా నిరూపణ అయ్యే వరకూ సీఎం పదవి చేపట్టనని ఆయన తేల్చి చెప్పారు. నవంబర్‌లో మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ కోరారు. తాను అగ్ని పరీక్షకు సిద్ధమైనట్టు ఆయన ప్రకటించారు. తన భవిష్యత్‌ను ఓటర్లే తేలుస్తారని ఆయన తెలిపారు.
తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని నమ్మితేనే ఓట్లు వేయాలని ఆయన అభ్యర్థించారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకే ఇంత కాలం సీఎం పదవికి రాజీనామా చేయలేదని కేజ్రీవాల్ ప్రకటించడం విశేషం.
తాను, సిసోడియా సీఎం పదవిలో వుండమని ఆయన అన్నారు. కొత్త సీఎం అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. ఆప్‌ను చీల్చే కుట్రలో భాగంగానే తనను బీజేపీ జైలుకు పంపినట్టు కేజ్రీవాల్ ఆరోపించారు.
vc estanu 9380537747
vc available 9380537747
The AAP party is risen against to the Corruption. The regret thing is Kegriwal was in jail On corruption charges. Regrets