చంద్రబాబు సర్కార్ వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందని నరసారావుపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేశారన్నారు. 17 కాలేజీలను ఒకే సారి నిర్మాణం చేపట్టినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
గత ఏడాది ఐదు వైద్య కళాశాల్లో అడ్మిషన్లు కూడా చేశారన్నారు. అన్నీ సవ్యంగా జరిగి వుంటే ఈ దఫా కూడా ఐదు కాలేజీల్లో వైద్య విద్యకు అడ్మిషన్లు జరిగేవని ఆయన అన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల అవి ప్రారంభం కాలేదన్నారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పులివెందులకు ఇచ్చిన 50 సీట్లు కూడా పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి ప్రభుత్వం లేఖ రాయడం దుర్మార్గమన్నారు.
కొత్తగా మెడికల్ సీట్లు వస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ఒక డాక్టర్‌గా అడుగుతున్నట్టు గోపిరెడ్డి తెలిపారు. మెడికల్ సీటు సంపాదించడం ఆశామాషీ కాదన్నారు. వైద్య విద్య ఎంతో కష్టమన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కామెంట్స్ తనకు విస్మయం కలిగించినట్టు గోపిరెడ్డి తెలిపారు.
40 ఏళ్లుగా ఏపీలో కనీసం ఒక కొత్త వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయలేదని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, పోస్టులన్నీ భర్తీ చేశారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ బహిరంగ చర్చకు రావాలని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు ఆయన తెలిపారు. చర్చకు ఎక్కడికైనా వస్తానని ఆయన పేర్కొన్నారు.
vc estanu 9380537747
Call boy jobs available 9989793850