దేవరలో ‘ఆయుధ పూజ’

దేవర సినిమా ట్రయిలర్ చూసిన తర్వాత చాలామంది చాలా ఊహించుకున్నారు. అయితే ఆ ఊహాలకు అందని మరింత మేటర్ సినిమాలో ఉందంటున్నాడు ఎన్టీఆర్. మరీ ముఖ్యంగా సినిమాలో హీరో, విలన్ వాడే ఆయుధాలకు ప్రత్యేకమైన…

దేవర సినిమా ట్రయిలర్ చూసిన తర్వాత చాలామంది చాలా ఊహించుకున్నారు. అయితే ఆ ఊహాలకు అందని మరింత మేటర్ సినిమాలో ఉందంటున్నాడు ఎన్టీఆర్. మరీ ముఖ్యంగా సినిమాలో హీరో, విలన్ వాడే ఆయుధాలకు ప్రత్యేకమైన కథ ఉందని చెబుతున్నాడు.

“దేవతల్ని పూజించని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు ఉక్కు, ఆయుధాల్ని మాత్రమే నమ్ముతారు. వాటినే పూజిస్తారు. 80-90వ దశకాల్లో సాగరతీరంలో ఉన్న ఓ మారుమూల గ్రామం. ఇప్పటికీ చాలా గ్రామాల్లో దేవుడి రూపాన్ని పూజించరు. అక్కడ దేవుళ్లు గ్రామ దేవతల రూపంలో కొలువై ఉంటారు. ఉత్తరాదిలోనైనా, దక్షిణ భారతదేశంలోనైనా ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి. వాళ్లు తమ ఆయుధాల్ని పూజిస్తారు. ఆ ఆయుధాలే వాళ్ల మనుగడను, జాతిని సూచిస్తాయి. వాటిని వాళ్లు గౌరవంగా, గొప్పగా చూస్తారు. ఆ ఆయుధాల కోసం వాళ్లు ఎంతకైనా తెగిస్తారు.”

ఇలా దేవరలో ఆయుధాలకు, సినిమా స్టోరీకి ఓ బలమైన సంబందం ఉందని వెల్లడించాడు ఎన్టీఆర్. చాలా సినిమాల్లో చూపించినట్టు డిఫరెంట్ గా ఆయుధాల్ని డిజైన్ చేసి వాడడం కాకుండా, వాటికి ఓ కథను కూడా డిజైన్ చేసినట్టు తెలిపాడు.

ఇక దేవర కోసం ఓ ఫిక్షన్ ప్రపంచాన్ని సృష్టించాడు కొరటాల. మొదటి 15 నిమిషాలు సినిమా గడిచేసరికి దేవర ప్రపంచంలోకి ప్రేక్షకుడు వెళ్లిపోతాడని, ఇక సినిమా పూర్తయ్యేంతవరకు ఆ ప్రపంచం నుంచి వెనక్కురాడని నమ్మకంగా చెబుతున్నాడు తారక్.

6 Replies to “దేవరలో ‘ఆయుధ పూజ’”

  1. మరీ ఎక్కువ చెప్పి అనవసరమైన హైప్ క్రియేట్ చేసుకోవద్దు జూనియర్…….. All the best

Comments are closed.