డిజె సిద్దూ ఆగయా

కృష్ణ అండ్ హిస్ లీల సినిమాతో యూత్ ను కనెక్ట్ చేసుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. మలి సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు చేస్తున్నాడు. ఈ సినిమాకు కథ, కథనాలను సమకూర్చుకుని హీరోగా…

కృష్ణ అండ్ హిస్ లీల సినిమాతో యూత్ ను కనెక్ట్ చేసుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. మలి సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు చేస్తున్నాడు. ఈ సినిమాకు కథ, కథనాలను సమకూర్చుకుని హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో డిస్కో జాకీలా నటిస్తున్న సిద్దు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ను పరిచయం చేస్తూ చిన్న విడియో వదిలారు. సిద్దు బర్త్ డే సందర్భంగా వదిలిన ఈ విడియో యూత్ ఫుల్ గా, వెరైటీగా వుంది.

విమలకృష్ణ తొలి సారి దర్శకుడు అవుతున్నారు ఈ సినిమాతో. నేహాశెట్టి కథానాయిక. నరుడి బతుకు నటన అనే ఫిలాసిఫికల్ టైటిల్ పెట్టి హీరోను డిస్కో జాకీగా చూపిస్తూ, యూత్ ఫుల్ సినిమాను ఎలా తయారు చేస్తున్నారో అన్నది కాస్త ఆసక్తికరమే. 

ఈ సినిమాకు నిర్మాత నాగవంశీ.  కరోనా టైమ్ లో ప్లాన్ చేసిన సినిమా ఇది. ఓటిటికి వెళ్లిపోతుంది అనుకుంటే థియేటర్ల పరిస్థితి బాగుంది కాబట్టి ఇక నేరుగా ఓటిటికి వెళ్తుందనే ఆలోచన ఇక అక్కరలేదు.