సమంత స్కిన్ టోన్ ను చాలామంది మెచ్చుకుంటారు. ఒకానొక టైమ్ లో లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు కూడా సమంత స్కిన్ ను మెచ్చుకున్నారు. సావిత్రి తర్వాత అంత నిగారింపును మళ్లీ సమంతలోనే చూశానంటూ చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు.
మరి ఇలా మెరిసే చర్మం కోసం సమంత ఏం చేస్తుంది? తన స్కిన్ సీక్రెట్ ను ఆమె బయటపెట్టింది. ఎక్కువగా రసాయనాల జోలికి వెళ్లకుండా, చిన్న చిన్న పనులతో అందమైన మెరుపును సొంతం చేసుకోవచ్చని చెబుతోంది.
“ప్రస్తుతం నేను పికో లేజర్ థెరపీ, రెడ్ లైట్ థెరపీ తీసుకుంటున్నాను. కెమికల్స్ పెద్దగా వాడని ఫేసియల్స్ చేయించుకుంటున్నాను. దీనివల్ల నా చర్మం మరింత నిగారిస్తుంది.”
ఒకప్పుడు సమంత, స్కిన్ ను పెద్దగా పట్టించుకునేది కాదంట. పుట్టుకతోనే తనకు అందమైన చర్మం వచ్చిందని, ఎప్పుడైతే మయొసైటిస్ బారిన పడ్డానో, ఆ సైడ్ ఎఫెక్టులన్నీ చర్మంపై చూపించడం మొదలయ్యాయని తెలిపింది. అప్పట్నుంచి స్కిన్ కేర్ పై మరింత శ్రద్ధ పెడుతున్నట్టు తెలిపింది.
కేవలం అందం కోసం మాత్రమే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ శరీర ఆరోగ్యానికి కూడా చర్మం చాలా అవసరమని చెబుతోంది సమంత. చర్మ సౌందర్యం కోసం అందరూ చికిత్స విధానాల వైపు వెళ్లాల్సిన అవసరం లేదని, సూర్యరశ్మి తగలకుండా, పొడిబారకుండా చర్మాన్ని కాపాడుకుంటే చాలని చెబుతోంది.
ఆరోగ్యకరమైన చర్మానికి లోపల నుంచి పోషణ అవసరమని, చర్మ సంరక్షణ కోసం పైపైన రాసే క్రీముల కంటే.. తినే ఆహారంపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది.
Good
vc available 9380537747
Call boy jobs available 9989793850
8k per sqyds at shadnager
For details 6303134248
నిన్నటి దాకా స్కిన్ కాన్సర్ లాంటి దేదో ఉందన్నారు..ఈ రోజేమైంది?