చిన్న సినిమా బ్రేక్ ఈవెన్

చిన్న సినిమాగా వచ్చిన మత్తు వదలరా 2 మూవీ మంచి వసూళ్లు రాబడుతోంది. థియేటర్లలో మరో సినిమా పోటీలో లేకపోవడం, లాంగ్ వీకెండ్ కలిసి రావడం, సత్య కామెడీ బాగుందనే మౌత్ టాక్ గట్టిగా…

చిన్న సినిమాగా వచ్చిన మత్తు వదలరా 2 మూవీ మంచి వసూళ్లు రాబడుతోంది. థియేటర్లలో మరో సినిమా పోటీలో లేకపోవడం, లాంగ్ వీకెండ్ కలిసి రావడం, సత్య కామెడీ బాగుందనే మౌత్ టాక్ గట్టిగా వ్యాపించడంతో.. మత్తువదలరా 2 సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది.

రిలీజైన ఈ 2 రోజుల్లో మత్తు వదలరా 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లు పెరగడం విశేషం. ఈరోజు కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

ఇక సోమవారం కూడా శెలవు కలిసిరావడం ఈ సినిమాకు అనుకోని వరంగా మారింది. హైదరాబాద్ లో మంగళవారం కూడా చాలా మందికి శెలవు కలిసొచ్చింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది.

రితేష్ రానా డైరక్ట్ చేసిన ఈ సినిమాకు సత్య కామెడీ వెన్నెముకగా నిలిచింది. దీనికి వెన్నెల కిషోర్ కూడా యాడ్ అవ్వడం కలిసొచ్చింది. సోమవారం వసూళ్లతో ఈ సినిమా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఉన్నంతలో ఈ సినిమాకు పెద్ద గండం ఏదైనా ఉందంటే అది పైరసీ మాత్రమే.

3 Replies to “చిన్న సినిమా బ్రేక్ ఈవెన్”

Comments are closed.