నొప్పి లేకుండా పెంపు సాధ్యమేనా?

ప్రస్తుతం ప్రభుత్వంలో వున్న పెద్దలతో ఓవర్ డిస్కషన్లు జ‌రుగుతున్నాయి. ఈ వారం దరఖాస్తు చేసిన తరువాత ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైన స్పందన వస్తుందో చూడాలి.

సినిమా యావరేజ్ అయినా నైజాంలో కలెక్షన్లు కనిపిస్తున్నాయి. అంధ్ర, సీడెడ్ ల్లో మాత్రం కాదు. కారణం మరేం కాదు. నైజాంలో మల్టీ ఫ్లెక్స్ లు ఎక్కువ వుండడం, సినిమా టికెట్ రేట్ల పెంపు అనేది నిర్మాతల ఇష్టానికి మారిపోవడం. దాంతో చిన్న సినిమాలు నడవడం లేదు. ఓ మాదిరి క్రేజ్‌ వున్న సినిమాలు గట్టేక్కేస్తున్నాయి. కానీ ఏపిలో అలా కాదు. ఒక్క విశాఖ మినహా మిగిలిన ఏరియాలు పడుకుంటున్నాయి.

జ‌గన్ పుణ్యమా అని తగ్గించిన రేట్లే చలామణీలో వున్నాయి. ప్రతి సినిమాకు టికెట్ రేట్లు పెంచమని అడగడం లేదు. పెంచినా అన్నిటికి వర్కవుట్ కావడం లేదు. కల్కి సినిమాకు భారీ రేట్లు పెట్టేసారు. జ‌నం కాస్త ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వానికి ఈ విషయమై ఫిర్యాదులు కూడా వెళ్లాయి.

తరువాత మళ్లీ పెంపు అన్నది డిస్కషన్ లోకి వస్తోంది దేవర సినిమా తోనే. ఇప్పుడు మళ్లీ ఎలాగూ నైఙాంలో రేట్లు కుమ్మేస్తారు. దాదాపు 100 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాల్సి వుంది నైజాంలో. అందువల్ల రేట్లకు అడ్డు అదుపు వుండదు. మరి ఏపి సంగతి ఏమిటి? సీడెడ్ తో సహా ఏపి లో దాదాపు 140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి వుంది. ఇంత మొత్తం రాబట్టాలి అంటే సరైన టికెట్ రేట్లు వుండాలి.

దేవర సినిమా మేకర్లు సింగిల్ స్క్రీన్ లు 60 మల్టీ ఫ్లెక్స్ లు 90 వంతున పెంపు అడుగుతున్నారు. ఈ మేరకు ఇస్తే ప్రఙలు ఇబ్బంది పడతారాని ప్రభుత్వం కిందా మీదా అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి మధ్యే మార్గంగా కేవలం నగరాలు, పట్టణాల్లో పెంచుతామని, సి సెంటర్లలో పెంచమని, అలాగే థియేటర్లో కిందన వుండే అయిదారు వరసల రేట్లు పెంచమని ఓ ప్రతిపాదనను నిర్మాతలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కావాలంటే ఈ మేరకు రూల్స్ ను టికెట్ ల పెంపు ఙీవోలోనే చేర్చండి అని కోరే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

వీళ్లు అడగడం బాగానే వుంది. వాళ్లు చేర్చినా బాగానే వుంటుంది. కానీ అలా అమలు సాధ్యమేనా? సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే, సి సెంటర్లు మాత్రం మడికట్టుకుని ఎందుకు కూర్చుంటాయి. అసలే పండగ టైమ్ లో రెవెన్యూ ఙనాలకు మామూళ్లు ఇచ్చి రేట్లు పెంచుకునే సంస్కృతి మనది. అందువల్ల ఇప్పుడు మాత్రం ఎందుకు ఊరుకుంటాయి. అలాగే థియేటర్లలో కొన్ని సీట్లు ఇలా, కొన్ని సీట్లు అలా అమ్మడం అంటే అది కూడా సాధ్యం అయ్యే పని కాదనే అనుకోవాలి.

ప్రస్తుతం ప్రభుత్వంలో వున్న పెద్దలతో ఓవర్ డిస్కషన్లు ఙరుగుతున్నాయి. ఈ వారం దరఖాస్తు చేసిన తరువాత ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైన స్పందన వస్తుందో చూడాలి.

5 Replies to “నొప్పి లేకుండా పెంపు సాధ్యమేనా?”

  1. రేట్లు పెంచితే మామూలు జనాలు వెళ్ళరు.

    ఎవరు కూడా తల మీద గన్ పెట్టీ సినిమా చూడమని ఆర్డర్ వేయడం లేదు కదా.

    ఫ్యాన్స్ అనే వాళ్ళు యే హీరో కైన , వీక్షకుల్లో 2 నుండి 5 శాతం మాత్రమే వుంటారు. అదికూడా మొదటి 3, 4 రోజుల్లోనే చూసేస్తారు.

    మామూలు జనాలు తర్వాతే వెళతారు.

Comments are closed.