మేఘా ఆకాష్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టడం.. ఆ వెంటనే ఎంగేజ్ మెంట్ చేసుకోవడం.. కొన్ని రోజులకే పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. అవును.. ఈరోజు ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితంలోకి ఎంటరైంది.
హీరోయిన్ మేఘా ఆకాష్, ఆమె బాయ్ ఫ్రెండ్ సాయి విష్ణుల వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈరోజు ఉదయం జరిగిన ఈ వేడుకకు పలువురు కోలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. నిన్న రాత్రి రిసెప్షన్ నిర్వహించగా.. తమిళనాడు ముఖ్యమంత్రి హాజరై జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈరోజు ఉదయం నుంచే మేఘా ఆకాష్ పెళ్లి తంతు మొదలైంది. తమిళ సంప్రదాయపద్ధతిలో వీళ్లిద్దరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మేఘా ఆకాష్ పెళ్లిపై వచ్చిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఒక దశలో తమిళ మీడియా ఆమెకు పెళ్లి కూడా చేసేసింది. ఎప్పటికప్పుడు తన పెళ్లిపై వస్తున్న పుకార్లను ఖండిస్తూ వచ్చిన ఆమె.. ఎట్టకేలకు తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
vc estanu 9380537747
Call boy works 9989793850
8k per sqyds at shadnager
For below details 6303134248
హీరోయిన్ అంటే ఆ చిత్ర కధానాయిక అనే అర్ధంలో రాస్తారు కదా.ఇక్కడ మూవీ లేకుండా హీరోయిన్ ఎట్టా?నటిమణి అంటే సరిపోదా?