వరద ముప్పు కొట్టిన దెబ్బ నుంచి విజయవాడ, పరిసర ప్రాంతాల జనజీవితం తిరిగి గాడిలో పడుతున్న ప్రస్తుత సమయంలో మంత్రి నారాయణ.. రేపటి గురించిన భయాలను దూరం చేసే మాట చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైడ్రా తరహాలో ఒక సరికొత్త వ్యవస్థను తీసుకువస్తామని ప్రకటిస్తున్నారు.
చెరువులు, కాలువలపై అక్రమ నిర్మాణాల తొలగింపునకు ప్రత్యేకంగా ఒక చట్టం తెస్తామని అంటున్నారు. నిజానికి బుడమేరు కారణంగా జరిగిన నష్టం పరిశీలించిన తర్వాత.. బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి చెబుతున్న ఇలాంటి మాటలు ప్రజలకు కాస్త ధైర్యం అందిస్తాయి. కానీ.. కేవలం మాటలకు పరిమితం అయితే సరిపోదు. అలాంటి పని చేయడంలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
కృష్ణా నది గట్టుపై ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లీజుకు నివాసం ఉంటున్నంత వరకు ఈ ప్రభుత్వానికి హైడ్రా వంటి వ్యవస్థను అమలు చేసే విషయంలో చిత్తశుద్ధి ఉన్నదని ప్రజలు నమ్మలేరు.
చంద్రబాబు నాయుడు వేరే నివాసానికి గతిలేని వ్యక్తి కాదు. నదులు, చెరువులు, కాలువల ఆక్రమణల కూల్చివేతకు ఏపీ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునే లోగానే.. చంద్రబాబునాయుడు, తాను నివాసం ఉంటున్న లింగమనేని అక్రమ కట్టడం నుంచి ఖాళీచేసి.. మరో ఇంటికి మారితే.. ప్రజలు ఈ ప్రభుత్వ చిత్తశుద్ధికి నీరాజనం పడతారు.
హైడ్రా వ్యవస్థ అనేది తెలంగాణలో సామాన్యులు కూడా శ్లాఘిస్తున్న వ్యవస్థగా అక్కడి రేవంత్ సర్కారుకు మంచి పేరు తెస్తున్నది గనుక.. ఆ పేరును కాపీ కొట్టి కొత్త నాటకం ఆడడానికి ఏపీలో తెరతీస్తున్నట్టుగా కనిపిస్తోంది.
బుడమేరు ఆక్రమణల కూల్చివేత విషయంలో ఇప్పటికీ చర్యలు తీసుకోకుండా.. ఇరవై రోజులు గడుస్తుండగా కూడా.. ఇంకా వైసీపీ ప్రభుత్వం కారణంగానే.. బుడమేరు గండ్లు పడి ముప్పు వచ్చిందని పాచిపోయిన ఆరోపణలతో కాలం గడపడం అనేది మంత్రి నారాయణ చవకబారుతనానికి నిదర్శనం. అలాంటి పసలేని సంగతులు కట్టిపెట్టి.. నిర్దిష్టమైన చర్యలతో ఆక్రమణల కూల్చివేతకు చర్యలు తీసుకోవాలి. పైగా.. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఇంటిని కూల్చి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
8k per sqyd ar shadnager
Above details 6303134248
Lot of influential people that are vote bank for TDP have enchroached Budameru and built their properties. Can TDP dare touch these people and destroy their vote bank? Thus is nothing but a publicity stunt to divert the negligence that happened during floods.
ap lo hydra laandi drama kudaradu.
Call boy works 9989793850
ఆ పేరు పెట్టాలంటే మనకూ ఓ హైదరాబాద్ కావాలి..లేకపోతే అమరావతి ఆమడ్రా కావాలి..
Amaravathi lo kuda hydra akrama kataddam ni tholginchaalni public korukuntunnaru