మహిళా హోం మంత్రి వుండగా..

ఏపీ హోం మంత్రిత్వ శాఖ ఓ మహిళ సారథ్యంలో వుంది. అదే ఏపీలో వైకాపా పార్టీ అధికార ప్రతినిధిగా ఓ మహిళను నియమించారు. అప్పటి నుంచి సదరు మహిళ తన సరదా కోసం చేసిన‌…

ఏపీ హోం మంత్రిత్వ శాఖ ఓ మహిళ సారథ్యంలో వుంది. అదే ఏపీలో వైకాపా పార్టీ అధికార ప్రతినిధిగా ఓ మహిళను నియమించారు. అప్పటి నుంచి సదరు మహిళ తన సరదా కోసం చేసిన‌ వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తూ, నానా గత్తర చేస్తున్నారు కిట్టని పార్టీ జ‌నాలు. ఇది కరెక్టేనా? ఇది సరైన పనేనా అన్నది అలోచించాల్సి వుంది.

యాంకర్ శ్యామలను వైకాపా అధికార ప్రతినిధిగా నియమించిన దగ్గర నుంచి నానా బూతులు వాడుతూ, తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఇక్కడ శ్యామల చేసిన తప్పేం లేదు. జ‌స్ట్ అమెను అధికార ప్రతినిధిగా నియమించినట్లు వార్త వచ్చింది. అంతే. అంతకు మించి జ‌రిగింది ఏమి లేదు. శ్యామల ఓ ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశాన్ని దుయ్యబట్టింది లేదు.

శ్యామల చాలా అంటే చాలా మందిలా ఎప్పడో చేసుకున్న రీల్స్ అన్నీ ఇప్పుడు పోస్ట్ చేస్తూ అసభ్యమైన వాఖ్యానాలు జోడిస్తున్నారు. ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేను అంతర్లీనంగా ప్రస్తావిస్తూ, అక్రమసంబంధాలు జోడిస్తున్నారు. సెక్స్ రాకెట్ తో సంబంధాలు అంటగడుతున్నారు. ఇలా ఒకటి కాదు. రెండు కాదు.

అంటే శ్యామల ఇంకా అధికారప్రతినిధిగా చార్జ్ తీసుకోలేదు. ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అప్పుడే పగబట్టినట్లు దాడులు చేస్తున్నారు. విమర్శలు చేయచ్చు. సిద్దాంత పరంగా వుండాలి. మాటకు మాట అన్నట్లు వుండాలి. అంతే తప్ప ఓ మహిళ క్యారెక్టర్ ను ఇంత దారుణంగా చిత్రీకరించే ప్రయత్నం ఖండిచాలి. మరి మహిళా కమిషన్లు సూమోటోగా ఇలాంటివి ఎందుకు స్వీకరించవో.

ఏపీ హోం మంత్రి అనిత తోటి మహిళ మీద జ‌రుగుతున్న ఈ డిజిటల్ దాడి మీద దృష్టి పెట్టాల్సి వుంది.

20 Replies to “మహిళా హోం మంత్రి వుండగా..”

  1. When Bhuvaneswari garu was commented entire world must react but when Shyamala or other YCP supporting women gets trolled even law and order should not react. This is called visionary government which is the name for double standards.

  2. భలే గుర్తు చేశావు బాస్..అప్పుడెప్పుడో మా హోమ్ మినిస్టర్ పేరు పెట్టి ఓ ప్రైవేట్ సాంగ్ బాగా పాపులర్ చేశారు..గుర్తుకొచ్చిందా?దాని మాటేమిటి?ఇక్కడ దాని ఆంటే ఆ పాట రాసి,,పాడిన వైనం అని భావించగలవు.

  3. దేవుడు నోరిచ్చాడు కదా అని.. నోటికొచ్చింది ఇష్టానుసారం వాగితే.. ఇలానే సత్కారాలు జరుగుతాయి..

    ముసలి నక్క కథలు చెప్పుకుని… జగన్ రెడ్డి పడేసే ముష్టి తినే ఈ వైసీపీ అధికార ప్రతినిధులను భరించలేకే జనాలు జగన్ రెడ్డి కి 11 సీట్లు ఇచ్చారు..

    అయినా పాఠం నేర్చుకోకపోతే ఎలా..? ఇంకా అదే నోటికి పని చెప్పే కుక్కలను వైసీపీ లో చేర్చుకొంటున్నారంటే.. ఇక ఎప్పటికి ఆ పార్టీ బతికి బట్ట కట్టదు ..

  4. జగన్ హయాం లో ఇద్దరు మహిళా హోం మంత్రులు, ఐయినా ’24 ఎలక్షన్స్ మహిళల ఓట్లు ఎటు వెళ్లాయి, న్యాయం జరిగితే? జగన్ తల రాత ఐయితే మారదు శ్రీ రెడ్డి, రోజా, శ్యామల లను తీసుకొచ్చినా.

  5. Sucess will only be coming after facing such Trolls. Good Choice by YCP to have her as spokes person a refreshing alternative, it will influence neutral voters especially women voter as her Voice modulation is superb and will also reach masses.

  6. అసెంబ్లి లొ రంకులు కట్టిన మంత్రులు చూసము స్వామి.. అప్పుడు నీకు తప్పు కనిపించలేదు.. 11 కూడా మీకు ఎక్కువే

  7. అప్పట్లో adavllani నోటి కి వచ్చినట్టు బూతులు తిట్టారు. సోషల్ మీడియా లో అయితే ఎంత hares చెయ్యాలో అంత hares చేసారు.. అప్పుడు నీ నోరు ..పడిపోయిందా…GA ga

  8. శ్యామల సింహం, తోడేలు, నక్క, కుక్క అని పిట్టకథలు చెప్పకుండా ఉంటే ఆమె జోలికి ఎవరూ వెళ్లేవారు కారు.

  9. శ్యామల సింహం, తోడేలు, నక్క అని పిట్టకథలు చెప్పకుండా ఉంటే ఆమె జోలికి ఎవరూ వెళ్లేవారు కారు.

Comments are closed.