టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉంది

“ఆడ పిల్లల్ని ఇష్టమొచ్చినట్టు వాడుకోవడం అనేది టాలీవుడ్ లో జరుగుతోంది. అలా జరగకుండా ఉండాలంటే ఓ ధైర్యం కావాలి. అలా కావాలంటే ఓ కమిటీ కావాలి. ఉన్న కేసుల్ని సరిగ్గా పరిష్కరించే ప్రయత్నం చేయాలి.…

“ఆడ పిల్లల్ని ఇష్టమొచ్చినట్టు వాడుకోవడం అనేది టాలీవుడ్ లో జరుగుతోంది. అలా జరగకుండా ఉండాలంటే ఓ ధైర్యం కావాలి. అలా కావాలంటే ఓ కమిటీ కావాలి. ఉన్న కేసుల్ని సరిగ్గా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఇండస్ట్రీలో మహిళలు సేఫ్ గా ఉంటారని చెప్పడానికి, ఓ ప్యానల్ ఉందని మరోసారి గుర్తుచేయడం కోసం ప్రెస్ మీట్ పెట్టాం. జానీ మాస్టర్ కేసుకు 90 రోజుల్లో పరిష్కారం చూపిస్తాం.” – లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ మెంబర్ తమ్మారెడ్డి భరధ్వాజ

“ఇతర సినీ పరిశ్రమల్లో ఉన్న లైంగిక వేధింపులు టాలీవుడ్ లో కూడా ఉన్నాయి. దీన్ని మేం అంగీకరిస్తున్నాం. అయితే మిగతా పరిశ్రమల్లో ఉన్నలాంటి కఠినమైన మెకానిజమ్స్, టాలీవుడ్ లో సరిపోయినన్ని, తగినన్ని లేవు. ” – లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ ఛైర్ పర్సన్ ఝాన్సీ

జానీ మాస్టర్ వ్యవహారంతో టాలీవుడ్ లో కూడా లైంగిక వేధింపులకు సంబందించి ఓ కమిటీ ఉందనే విషయం చాలామందికి తెలిసొచ్చింది. ఈ విషయాన్ని మరింత బలంగా చెప్పేందుకు.. ఫిలింఛాంబర్ కు అనుబంధంగా ఏర్పాటైన లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

టాలీవుడ్ లో లైంగిక వేధింపులకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే నేరుగా ఫిర్యాదు చేయొచ్చంటూ ఈ ప్యానెల్ ప్రకటించింది. వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది.

ఫిలింఛాంబర్ బయట ఓ డబ్బా ఉంచుతారు. ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు ఆ డబ్బా ఉంటుంది. ఏ మహిళైనా తమకు ఎదురైన లైంగిక వేధింపుల్ని ఆ కంప్లయింట్ బాక్సులో వేయొచ్చు. పోస్ట్ లేదా కొరియర్ ద్వారా కూడా కంప్లయింట్ చేయొచ్చు. 9849972280 అనే నంబర్ కు వాట్సాప్ కూడా చేయొచ్చు. 2018 నుంచే ఈ ప్యానెల్ ఉందంట, ఇండస్ట్రీలో పనిచేసే మహిళలంతా తమకు ఏమైనా కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురైతే ఫిర్యాదు చేయొచ్చని చెబుతున్నారు.

ఆమె మేజర్ కాదు.. మైనర్..

మరోవైపు జానీ మాస్టర్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి మైనర్ అనే విషయాన్ని ప్యానెల్ కూడా అంగీకరించింది. ఆమె ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు మైనర్ అనే విషయాన్ని గుర్తించామని తెలిపింది. మరి.. టాలీవుడ్ లో మైనర్లు కూడా పనిచేయొచ్చా..? దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఉన్నాయంటున్నారు మెంబర్ వివేక్ కూచిబొట్ల. తల్లిదండ్రుల అనుమతితో మైనర్లు కూడా కొన్ని క్రాఫ్టుల్లో పనిచేయొచ్చని చెబుతున్నారు.

జానీపై వేటు..

ఇప్పటికే జనసేనకు దూరమైన జానీ మాస్టర్.. ఇప్పుడు తన వృత్తికి కూడా దూరమయ్యేలా ఉన్నాడు. డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ ను తొలిగించాలని ఫెడరేషన్ ను ఫిలింఛాంబర్ ఆదేశించింది. దీంతో పాటు, పరిశ్రమలోని మరికొన్ని సంఘాలు కూడా జానీ మాస్టర్ పై సస్పెన్షన్ వేటు వేయబోతున్నాయి.

ఈ సంగతి పక్కనపెడితే.. ఇతడికి సినిమా అవకాశాలు కూడా తగ్గడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. తీవ్రమైన ఆరోపణలతో పోలీస్ కేసు వరకు వెళ్లిన జానీ మాస్టర్ కు అవకాశమివ్వడానికి పెద్ద హీరోలు ఇప్పట్లో ముందుకురాకపోవచ్చు.

16 Replies to “టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉంది”

  1. ఆమె మైనర్ ఐతే అంత కన్నా దారుణం లేదు. కోసి కారం పెట్టి ఉరి తీయాలి. వీడికి సపోర్ట్ చేసిన వాడి పెళ్ళానికి (నిజం గ సపోర్ట్ చేసి ఉంటె) కూడా ఉరి వెయ్యాలి

  2. ఆమె మైనర్ ఐతే అంత కన్నా దారుణం లేదు. కోసి కారం పెట్టి ఉరి తీయాలి. వీడికి సపోర్ట్ చేసిన వాడి పెళ్ళానికి (నిజం గ సపోర్ట్ చేసి ఉంటె) కూడా ఉరి వెయ్యాలి

  3. విశాల్ గున్ని అప్రవర్ గా మారాడని tension పడుతున్నారా GA….😂😂… పూనమ్ కౌర్, జానీ మాస్టర్ సరిపోవట్లేద GA…

  4. ఆమె మైనర్ ఐతే అంత కన్నా దారుణం లేదు. కోసి కారం పెట్టి ఉరి తీయాలి. వీడికి సపోర్ట్ చేసిన వాడి పెళ్ళానికి (నిజం గ సపోర్ట్ చేసి ఉంటె) కూడా ఉరి వెయ్యాలి

  5. మొగుడ్ని సంక నాకించి మొగసాల ఎక్కిన ఝాన్సి ..నువ్వు కూడా నితులు చెప్పుచున్నావా ?

    థూ నా బతుకు చెడా

Comments are closed.