సోషల్ మీడియా వేదికగా సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేశ్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య తీవ్రస్థాయిలో తిట్ల పురాణానికి తెరలేపారు. Be first .Be best .Be different, అలాగే కింద భూమి ఉందనే వాస్తవంలో బతుకుతా అనే నినాదాలను తన ట్విటర్ ఖాతాపై అలంకరించుకున్న బండ్ల గణేశ్, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం.
టీడీపీని కమ్మ కులపార్టీగా విజయసాయిరెడ్డి అభివర్ణించడాన్ని బండ్ల గణేష్ జీర్ణించుకోలేకపోయారు. టీడీపీతో ఏ మాత్రం సంబంధం లేని ఆయనకు అర్థరాత్రి వేళ కట్టలు తెంచుకునేంతగా కోపం ఎందుకొచ్చిందో తెలియదు. కానీ విజయసాయిరెడ్డిపై వరుస ట్వీట్లతో చెలరేగిపోయారు. ఆ ట్వీట్లన్నింటికి విజయసాయిరెడ్డి ఒకే ఒక్క ట్వీట్‌తో గట్టి కౌంటర్ ఇచ్చారు.
….కమ్మ వారిని తిట్టాడాన్ని తట్టుకోలేక పోతున్న నీకు నచ్చని వారిని పేరు పెట్టి తిట్టు … దయచేసి కులాన్ని తిట్టకు… ఇదేనా నీ సంస్కారం ?
నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు…ఎంపీ గా ఉన్నావని, అధికారంలో ఉన్నానని కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావంటూ బండ్ల గణేశ్ తన మార్క్ ట్వీట్లతో చెలరేగిపోయారు. ఇంకా ఘోరంగా విజయసాయిరెడ్డిపై బండ్ల ట్వీట్ పారేసుకున్నారు. మరి విజయసాయిరెడ్డి ఊరుకుంటారా? అబ్బే, తగ్గేదేలే అంటూ ఆయన ట్వీట్‌తోనే చెడుగుడు ఆడుకున్నారు.
“ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో…గణేశా!” అంటూ వెటకరించారు. ఈ ట్వీట్ల కాలుష్యానికి చివరికి ఏ విధంగా ముగింపు పలుకుతారో చూడాలి.