రామ్ చరణ్ తో చేయబోయే సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు టాప్ లెవెల్ టెక్నీషియన్స్ ను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఏకాంబరం అనే వ్యక్తిని ఎంపిక చేశాడు.
తెలుగులో ఏకాంబరంకు ఇదే తొలి సినిమా. ఇంతకుముందు ఇతడు తంగలాన్ సినిమాకు వర్క్ చేశాడు. విక్రమ్ హీరోగా నటించిన ఆ పీరియాడిక్ మూవీకి ఏకాంబరం అందించిన కాస్ట్యూమ్స్ హైలెట్ గా నిలిచాయి. పూర్తిగా సహజసిద్ధమైన రంగులు, మెటీరియల్ వాడి తెరపై కనిపించిన ప్రతి ఒక్కరికి దుస్తులు డిజైన్ చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఏకాంబరం.
ఈ వర్క్ బుచ్చిబాబుకు బాగా నచ్చింది. అందుకే రామ్ చరణ్ తో తను తీయబోయే రూరల్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామాకు ఏకాంబరంను కాస్ట్యూమ్ డిజైనర్ గా తీసుకున్నాడు. ఈ సందర్భంగా తన కల నెరవేరినట్టు ప్రకటించాడు ఏకాంబరం.
ఈ క్షణం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూశానని, తొలి సినిమాకే రామ్ చరణ్ లాంటి స్టార్ కు పనిచేయడం తన అదృష్టం అన్నాడు. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి, టాలీవుడ్ కు తన పనిని చూపించడానికి దీన్నొక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు ప్రకటించాడు.
ఈ సినిమా కోసం ఏఆర్ రెహ్మాన్ ఇప్పటికే కొన్ని పాటలు అందించాడు. అటు రామ్ చరణ్ పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టిపెట్టాడు. మేకోవర్ పనిలో బిజీగా ఉన్నాడు. దేవర సినిమా రిలీజైన వెంటనే జాన్వి కపూర్ కూడా ఈ సినిమాపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఆ రెహ్మాన్ ని ఎందుకు పెట్టుకుంటారో నాకు అర్ధం కాదు….. మహానుభావుడు మ్యూజిక్ ఇచ్చిన ఏ ఒక్క తెలుగు సినిమా హిట్ అయినట్టు నాకు గుర్తు లేదు….. అతగాడిలో సరుకు అయిపోయింది అని తమిళ తంబీలు గ్రహించారు, మన వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో మరి 🤔
ఎలాగూ పోయే మూవీ కి ఎవరుంటే ఎం లాభం 😂😂😂😂😂😂😂
అయినా థియేటర్లో చూడం