బాబు వంద రోజుల పాల‌న‌కు మార్కులెన్ని?

వైసీపీ నాయ‌కుల‌పై ర‌క‌ర‌కాల కేసుల‌ను న‌మోదు చేస్తూ, ఆ విష‌యాలే వార్త‌లుగా ఉండేలా చూడ‌డం వెనుక బాబు వ్యూహం

మ‌రో రెండు రోజులు గ‌డిస్తే చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న సెంచ‌రీ కొడుతుంది. కూట‌మి వంద రోజుల పాల‌న‌కు ఎన్ని మార్కులు వేయొచ్చ‌నే చ‌ర్చ విస్తృతంగా సాగుతోంది. ఎందుకోగాని చంద్ర‌బాబులో ఒక‌ప్ప‌టి అడ్మినిస్ట్రేట‌ర్ క‌నిపించ‌డం లేద‌నే మాట ఎక్కువ‌గా వినిపిస్తోంది. బ‌హుశా రెండు అధికార కేంద్రాలుండ‌డం వ‌ల్ల ఇలాంటి నిట్టూర్పులకు దారి తీసి ఉండొచ్చు. చంద్ర‌బాబుతో స‌మానంగా ఆయ‌న కుమారుడైన మంత్రి నారా లోకేశ్ అధికారాన్ని చెలాయిస్తున్నార‌నేది ప‌చ్చి నిజం. అంతెందుకు చంద్ర‌బాబు కేబినెట్‌లో ముగ్గురు న‌లుగురు సీనియ‌ర్లు మిన‌హాయిస్తే, మిగిలిన వారంతా లోకేశ్ టీమ్ అని తెలిసిందే. అంతా కొత్త వారిని తీసుకోవ‌డం వెనుక లోకేశ్ భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని చేసిందే అనే చ‌ర్చ లేక‌పోలేదు.

మంత్రిగా లోకేశ్ త‌న శాఖ‌ల వ‌ర‌కే ప‌రిమితం కావ‌డం లేదు. ఒక‌వేళ ఆయ‌న గిరి గీసుకుని ఉన్నా, కొంద‌రు నేత‌లు ఉండ‌నివ్వ‌ని ప‌రిస్థితి. ఈ వంద రోజుల్లో ఎక్కువ‌గా వినిపించిన ప‌దం రెడ్‌బుక్‌. రాజ‌కీయంగా త‌మ ప్ర‌త్య‌ర్థులైన వైసీపీ నాయ‌కుల‌ను భ‌య‌పెట్టాల‌ని టీడీపీ నేత‌లు అనుకోవ‌చ్చు. కానీ పాల‌న గాడి త‌ప్పిందంటే, అంతిమంగా మూల్యం చెల్లించుకోవాల్సింది తామే అని చంద్ర‌బాబు, లోకేశ్ గ్ర‌హించాల్సి వుంది.

ఇక పాల‌నలో మంచీ చెడుల గురించి మాట్లాడుకుందాం. ఎన్నిక‌లకు ముందు ముఖ్యంగా చంద్ర‌బాబు ఎన్నో హామీలిచ్చారు. ఆకాశ‌మే హ‌ద్దుగా ప్ర‌జ‌ల‌కు ఆశ చూపారు. మ‌హాభారతంలో క‌ర్ణుడి చావుకు అనేక కార‌ణాలున్న‌ట్టుగానే, ఎన్నిక‌ల్లో వైసీపీ దారుణ ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకోడానికి ఎన్నెన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అలాగే కూట‌మి హామీలు జ‌గ‌న్ ఓటు బ్యాంక్‌ను దెబ్బ‌కొట్టాయి.

కూట‌మి అధికారంలోకి రాగానే రూ.4 వేల‌కు పింఛ‌న్ పెంచుతామ‌నే హామీని నిల‌బెట్టుకున్నారు. అలాగే వాలంటీర్లు లేక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌తి నెలా ఒక‌టో తేదీనే పింఛ‌న్ల‌ను ఇళ్ల వ‌ద్దే అంద‌జేస్తున్నారు. ఒక‌వేళ ఒక‌టో తేదీ సెల‌వు దిన‌మైతే, ముందే రోజే పంపిణీ చేసేలా ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం విశేషం. పింఛ‌న్‌దారుల మ‌న‌సు చంద్ర‌బాబు స‌ర్కార్ చూర‌గొంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అలాగే మెగా డీఎస్సీని నిర్వ‌హిస్తామ‌ని ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీని కూడా నిల‌బెట్టుకునే ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. 16 వేల పోస్టుల‌తో మెగా డీఎస్సీ విడుద‌లైంది. ప‌రీక్ష నిర్వ‌హించాల్సి వుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేసి రైతుల‌కు భూముల‌పై భ‌యాన్ని పోగొట్టారు. ఈ చ‌ట్ట‌మే జ‌గ‌న్ ప‌రిపాల‌న పాలిట య‌మ‌పాశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ అస్త్రాన్ని ఎన్నిక‌ల్లో కూట‌మి జ‌గ‌న్‌పై ప్ర‌యోగించి, రాజ‌కీయంగా అద్భుతంగా ల‌బ్ధి పొందింది. అందుకే ఆర్థిక భారం కాని చ‌ట్టాన్ని కూట‌మి ర‌ద్దు చేయ‌డం విశేషం.

రాష్ట్ర వ్యాప్తంగా మొద‌టి విడ‌త‌లో 100 అన్నా క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఐదు రూపాయిల‌కే టిఫెన్‌, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం పెడుతున్నారు. అయితే చెప్పుకోద‌గ్గ స్థాయిలో పాజిటివ్ ప్ర‌చారం మాత్రం రాక‌పోయిన‌ప్ప‌టికీ, ప‌థ‌కాన్ని అమ‌లు చేశామ‌న్న సంతృప్తి చంద్ర‌బాబుకు మిగిలింది. అలాగే కార్య‌క‌ర్త‌ల‌కు 2014-19 మ‌ధ్య కాలంలో రావాల్సిన నీరు-చెట్లు బిల్లుల్ని క్లియ‌ర్ చేయ‌డానికి మొద‌టి విడ‌త‌లో రూ.290 కోట్లు విడుద‌ల చేయ‌డం విశేషం. కార్య‌క‌ర్త‌ల్ని సంతోష‌పెట్టింది.

అలాగే కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో వుండ‌డానికి అప్పుడ‌ప్పుడు తానే టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి వెళ్ల‌డం విశేషం. కార్య‌క‌ర్త‌లే త‌న‌కు ప్రాణ‌మ‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెప్ప‌డం, వారితో క‌ల‌వ‌డం ఆక‌ట్టుకుంటోంది. పార్టీ కోణంలో ఇది ఎంతో గొప్ప‌ది.

అమరావ‌తిలో రాజ‌ధాని ప‌నుల్ని శ‌ర‌వేగంగా చేస్తున్నారు. ఇది బాబు స‌ర్కార్‌కు అత్యంత ప్రాధాన్య‌మైన అంశ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందుకోసం కేంద్ర ప్ర‌భుత్వం రూ.15 వేల కోట్ల రుణాన్ని ఇప్పించేందుకు ముందుకొచ్చింది. దీంతో రానున్న రోజుల్లో అమ‌రావ‌తిని త‌మ‌కు కావాల్సిన విధంగా అభివృద్ధి చేసుకోనున్నారు. ఇవ‌న్నీ చంద్ర‌బాబు పాల‌న‌లో పాజిటివ్ అంశాలు.

అయితే చంద్ర‌బాబు పాల‌న‌లో ఎక్కువ‌గా నెగెటివ్ అంశాలే క‌నిపిస్తున్నాయి. ఉచితంగా ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ … ఉత్తుత్తిదే అని తేలిపోయింది. పేరుకే ఉచితం, జ‌గ‌న్ పాల‌న‌లో ఎంత ఖ‌ర్చు అయ్యేదో, ఇప్పుడు కూడా అంతే అవుతోంద‌ని ఇసుక వినియోగ‌దారులు ల‌బోదిబోమంటున్నారు. వైసీపీ పాల‌న‌లో క‌నీసం ఇసుక సొమ్ము ప్ర‌భుత్వానికి చేరేద‌ని, ఇప్పుడు కూట‌మి నేత‌ల జేబులు నింపుతోంద‌నే విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది. ఉచిత ఇసుక ఫెయిల్ అయ్యింద‌ని చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్ల‌గా, ఏం ఇళ్ల ద‌గ్గ‌రికి మేమే తీసుకెళ్లాలా? అని ఆయ‌న మండిప‌డ‌డం చూశాం.

ఉద్యోగ‌, ఉపాధ్యాయుల విష‌యంలోనూ ప్ర‌భుత్వం అభిమానాన్ని నిలుపుకోలేక‌పోతోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ ప‌థకానికి సంబంధించి గెజిట్‌ను ఈ ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌డం తీవ్ర వివాదమైంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ప్ర‌భుత్వం త‌మ‌ను మోస‌గించింద‌ని ఉద్యోగులు జీపీఎస్ గెజిట్‌ను కాల్చి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీంతో దాన్ని ఉప‌సంహ‌రించిన‌ట్టు ప్ర‌క‌టించి, తాత్కాలికంగా ఉద్యోగుల్ని చ‌ల్ల‌బ‌రిచారు. ఉద్యోగులు కోరుతున్న‌ట్టు ఓల్డ్ పెన్ష‌న్ ప‌థ‌కంపై మాత్రం ఏమీ మాట్లాడ్డం లేదు. అలాగే ఉద్యోగుల‌కు బోధ‌నేత‌ర ప‌నుల్ని లేకుండా ఉత్త‌ర్వులు ఇచ్చామ‌నే మాటే త‌ప్ప‌, ఆచ‌ర‌ణ‌లో మాత్రం లేద‌నే చెప్పాలి. ఇదీ వంద రోజుల పాల‌న‌లో ఉద్యోగుల‌కు సంబంధించిన అప్‌డేట్‌.

ఇక సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల గురించి ఎంత త‌క్కువ‌గా మాట్లాడుకుంటే అంత మంచిది. ఏడాదికి రైతు భ‌రోసా రూ.20 వేలు, ఇంట్లో ఎంత మంది పిల్ల‌లున్నా అంద‌రికీ త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం అమ‌లు (ఒక్కొక్క‌రికి రూ.15 వేలు), మ‌హిళ‌ల‌కు ఏడాదికి మూడు సిలిండ‌ర్లు, ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం, 18 ఏళ్లు నిండిన ప్ర‌తి మ‌హిళ‌కూ నెల‌కు రూ.1500 …ఇలా ఏ ప‌థ‌క‌మూ అమ‌లుకు నోచుకోలేదు. ల‌బ్ధిదారులు చంద్ర‌బాబు స‌ర్కార్‌పై తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. త‌మ‌ను చంద్ర‌బాబు న‌మ్మించి ప‌చ్చి మోసం చేశాడ‌ని ల‌బ్ధిదారులు మండిప‌డుతున్నారు.

కేవ‌లం అధికారంలోకి రావ‌డానికి, ఓట్లు వేయించుకోడానికి మాత్ర‌మే చంద్ర‌బాబు అలివికాని హామీలిచ్చి, ఇప్పుడు చేతులెత్తేశార‌నే మాట ల‌బ్ధిదారుల నుంచి వ‌స్తోంది. సంక్షేమ ప‌థ‌కాల లబ్ధిదారుల నెత్తిన ఇదే రీతిలో టోపి పెడితే మాత్రం… భారీ మూల్యాన్ని చెల్లించుకోక త‌ప్ప‌దు.

లోకేశ్ రెడ్‌బుక్ కూట‌మికి చెడ్డ‌పేరు తెస్తోంది. అధికారంలోకి వ‌చ్చీ రావ‌డంతోనే తాడేప‌ల్లిలో వైసీపీ కార్యాల‌యం కూల్చివేత‌తో పాల‌న ప్రారంభ‌మైంది. గ‌తంలో వైసీపీ పాల‌న కూడా ప్ర‌జావేదిక కూల్చివేత‌తో ప్రారంభ‌మై, 2024 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింద‌ని, కూట‌మి కూడా అదే పంథాలో న‌డుస్తోంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాల‌యాల‌పైకి బుల్డోజ‌ర్లు వెళ్లాయి.

మ‌రీ ముఖ్యంగా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై ఇష్టానుసారం దాడులు, హ‌త్య‌లు, ఆస్తుల విధ్వంసాలు, దౌర్జ‌న్యంగా లాక్కోవ‌డాలు రాష్ట్ర వ్యాప్తంగా య‌థేచ్ఛ‌గా సాగాయి. పోలీసులు ప్రేక్ష‌క పాత్ర పోషించ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ, కూట‌మి పాల‌న దొందు దొందే అనే అభిప్రాయం త‌ట‌స్థుల్లో ఏర్ప‌డ‌డం …అధికారంలో ఉన్న వారికి ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంద‌ని అర్థం చేసుకోవాలి. ఒక‌వైపు కూట‌మికి చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని తెలిసినా, లోకేశ్ మాత్రం రెడ్‌బుక్ ఇంకా తెర‌వనే లేద‌ని ప‌దేప‌దే చెప్ప‌డం గ‌మ‌నార్హం. లోకేశ్ రెడ్‌బుక్ స్ఫూర్తితో రాష్ట్రంలో కొంద‌రు టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు తాము కూడా రెడ్‌బుక్ రాసుకున్నామ‌ని, ఒక్కొక్క‌రి అంతు చూస్తామ‌ని హెచ్చ‌రించ‌డం ఏ తీరాల‌కు దారి తీస్తుందో కూట‌మి నేత‌లు ఆలోచించుకోవాలి.

ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద‌లు చంద్ర‌బాబు స‌ర్కార్‌కు చెడ్డ‌పేరు తీసుకొచ్చాయి. రోజుల త‌ర‌బ‌డి వ‌ర‌ద‌లో గ‌డ‌పాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని బాధితులు మీడియా ఎదుట క‌న్నీటిప‌ర్యంతం కావ‌డం గ‌మ‌నార్హం. టీడీపీకి బాగా ప‌ట్టున్న విజ‌య‌వాడ‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో ప్ర‌భుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది.

చంద్ర‌బాబు త‌న పాల‌న‌లో వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు, అలాగే సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు అంశం ప్రస్తావ‌న‌కు రాకుండా చూసుకునే క్ర‌మంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం భారీగా అప్పులు చేసింద‌ని, ఖ‌జానా ఖాళీగా వుంద‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్ర‌బాబు మాట్లాడుతూ సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను చూస్తుంటే భ‌య‌మేస్తోంద‌ని, ప్ర‌భుత్వం వ‌ద్ద డ‌బ్బుల్లేవ‌ని చెప్ప‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. అలాగే వైసీపీ నాయ‌కుల‌పై ర‌క‌ర‌కాల కేసుల‌ను న‌మోదు చేస్తూ, ఆ విష‌యాలే వార్త‌లుగా ఉండేలా చూడ‌డం వెనుక బాబు వ్యూహం వుంద‌ని అంటున్నారు.

త‌న‌కున్న మీడియా బ‌లంతో సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌క‌పోయినా, ప్ర‌జ‌ల్ని మ‌భ్య పెట్టొచ్చ‌ని, మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను రాక్ష‌సుడిగా చూపి, రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకు ఇప్ప‌టి నుంచే బాబు ఎత్తుగ‌డ వేస్తున్నారు. ఎటూ త‌న‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బీజేపీ మ‌ద్ద‌తు ఉన్నాయ‌ని, ఎన్నిక‌ల్లో గెలవ‌డం క‌ష్టం కాద‌ని బాబు ధీమాగా ఉన్నారు. వంద రోజుల బాబు స‌ర్కార్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదీ. మార్కులెన్నో ఎవ‌రికి వారు వేసుకోవాల్సిందే.

48 Replies to “బాబు వంద రోజుల పాల‌న‌కు మార్కులెన్ని?”

  1. ఈ జీఏ గాడి సర్టిఫికేట్ ఎవరు అడిగారో? వీడిది, సాక్షి సర్టిఫికెట్స్ చెల్లవు, అంతా ఫోర్జరీ నే.

  2. రోడ్ మీదకు వస్తే scst కేసు నిరసన తెలిపితే scst కేసు ప్రతిపక్ష నాయుడుకే దిక్కులేదు ఇక సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా చేసిన ప్రభుత్వ పెద్దలను వదిలేస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే ఎట్టి పరిస్థితిలోను వైసీపీ ని రానివ్వకూడదనే ఓటర్లు ఎక్కడెక్కడ నుంచో వ్యయ ప్రయాసల కోర్చి ఓట్లు వేసి వెళ్లారు వాళ్ళు నయాపైసా ఆశించకుండా వచ్చి పనికిమాలిన ప్రభుత్వాన్ని ఉంచితే కస్టపడి పనిచేసుకొని డిగ్నిఫైఎడ్ గ బతుకు దామనుకొన్న వాడిని బతకనివ్వరని ఓట్లు వేశారు ఇప్పుడు ఈ దోపిడీ దారులు ను వదిలేస్తే ఓట్లు వేసిన వారిని అవమాన పరచినట్టే వైసీపీ ఇక రూలింగ్ కి రాదు కారణం దానికి నుఎట్రాల్ వోటింగ్ లేదు వీళ్ళను తోలు తియ్యవలసిందే అధికారం ఉంటే ఏమైనా చేయ్యొచ్చాను కొనే వారికీ కచ్చితం గ గుణపాఠం చెప్పాలి

  3. బాబు పధకాలు ఇస్తాడు అని లేక ఉద్దరించేస్తాడు అని జనాలు ఓట్లు వెయ్యలేదు..

    మన ప్రభుత్వం రాకుండా ఉంటే చాలు అని మాత్రమే వొట్లు వేసారు..బాబు అంత బారీ గెలుపు తర్వాత నాలుక కార్చుకుని ఉంటాడు.

    అనవసరం గా హామీలు ఇచ్చాము…ఇవ్వక పోయిన బరీ గా గెలిచే వాళ్ళం అని.

    ఇక 100 రోజుల పలానా అంటావా..

    1. ప్రజల అశాంతి తగ్గింది శాంతి గా ఉన్నారు

    2. ఇసుక అందుబాటులో వచ్చింది 36 రకాల వ్యాపారం లు oopu అందుకుంది

    3. అన్నా కేటీన్స్ సూపర్ డూపర్ హిట్

    4. మంచి మందు వస్తుంది

    5. ప్రబుత్వ దుబారా తగ్గింది

    6. విజయవాడ లో వరదలు బానే హ్యాండిల్ చేసారు

    7. అమరావతి జంగిల్ క్లియరెన్స్ చేసి అభివృద్ధి దిశగా అడుగులు వస్తున్నారు

    8. ఒక్కసారి రింగ్ రోడ్ పాడింది అంటే రియల్ ఎస్టేట్ పీక్స్ కి వెళుతుంది

    9. ఎన్నారైలు పెట్టుబడులు పెట్టటానికి సిద్ధంగా ఉన్నారు

    10.ముక్యం గా ప్రతిపక్షం ఇంకా అధికారం లో కి రాదు అనే బరోసా అయితే ఇచ్చారు

    వెరసి అన్నీ మంచి సేకునములే కనపడుతున్నయ్

  4. vyavastalanu manage cheyadaaniki marks- 100/100

    paripaalanaku prajala marks – 01/100

    manifesto following marks- 01/100

    overaall marks: 02/100

    final result: FAIL / UTTER FLAP @ 100days

    ilaage paripaliste vache jamililo kottukoni bangaala khatame gathi.

  5. ఎవ్వడో ఈ కాకా గాడు… కూటమి అన్నింట మోసమే… పెన్షన్లు రాను రాను తగ్గిపోతున్నాయని మాటొచ్చింది, పచ్చ బాకా ఎలాను ఊదదు, పిరికి గొడ్డు సాక్షి కూడ వివరాలు ఇవ్వలేకపోతుంది, ఇక అన్నా కేంటేఏన్ల ఎవ్వడిని మేపడానికి, అవసరమైన ఋన సాయం అందిస్తేనే సోమరులని తయారు చేస్తున్నారు అంటు పధకాలకి తప్పు ప్రభావం వచ్చేల చాటింపు,

    ఉపధ్యాయుల విషయం త్రిశంకు స్వర్గమే..

    మెగా డిఎస్పి నా చూద్దాం…ఉచిత ఇసుక పెద్ద మాఫియాగా మారిపోయింది..

    సూపర్ సిక్స్… పిచ్చ జోకు…

    ఇక వరదల విషయం లో ఎంత ఫెయిల్యుర్ అయిపొయిందొ ఒపన్ సీక్రెట్.

    రాజధాని ఆ ప్రంతం పనికి రాదని కడకు ప్రపంచ బాంక్ చెప్పాల్సి వచ్చిందంటె వీళ్ళు ఆంధ్రులని ఎంత తప్పుదారిలో నడిపించారొ తెలుస్తుంది..

  6. సిఎంగా చంద్ర బాబు ఫెయిల్.. కానీ డిప్యూటీ సిఎంగా పవన్ కళ్యాణ్ గారు 100/100 మార్కులు సంపాదించారు.. 2029 లో 175/175 జనసేనకి… ఇప్పుడు 21 వచ్చినట్టుగానే

  7. Babu pavan both are miserable failures. Red-Book will be a BLACK MARK for babu-lokesh political and personal life.

    Pavan is not a good actor in cinemas, but best actor in politics. He can talk whatever comes to his mind.. and twist his tongue 100 times in one hour. If he is a sincere politician.. why can’t he talk about 30000 missing women as he alleged before elections. Who was responsible for it. No sound. It means.. all his speeches and statements are blatant lies.. Still if anyone is calling him as a leader.. we cant help it.

    1. Ranganadh Garu, may God bless you. It is deeply shocking and disgraceful to witness someone born into a family of such high spiritual and moral standing descending into this kind of behavior. How can you, who come from a lineage that commands respect, engage in this toxic, shameful conduct? Have you completely lost any sense of dignity or self-awareness? Your vulgar language and your support for hatred are not just disappointing; they are a stain on the very values you should represent. Is there no part of you that feels the weight of shame for behaving this way?

      Your obsession with hatred towards Kamma and Kappu communities is disturbing. You’ve allowed a few bad experiences, with perhaps one or two individuals, to consume your entire mind, poisoning your thoughts and turning you into someone unrecognizable. How can you justify reducing your character to this level of bitterness? Do you even realize the depths you’ve sunk to? Can you really look at yourself and not feel the disgust for how low you’ve fallen? You are betraying the legacy of your family and your own humanity by allowing this hatred to rule you.

      It’s time to wake up and recognize that you’re only hurting yourself. Both science and religion agree: harboring this much hate and negativity is like drinking poison, hoping someone else will suffer. It’s building up toxic stress inside you, damaging your health and spirit. Why would you choose to destroy yourself this way? Why allow bitterness to run your life, leading you down a path of illness, misery, and hatred? Is this what you want your legacy to be—defined by hate and anger?

      I understand you’re frustrated, but frustration is no excuse to live in constant hatred. You should be above this. You can rise above the petty anger and become a better human being. But if you continue down this path, you’re choosing to remain in the gutter, consumed by anger, while the world moves on without you. God bless you, but if you don’t change, your suffering will only deepen. Let go of this destructive hatred before it destroys everything good in you.

  8. ప్రభుత్వం మారి 100 రోజులు అయినా A1,A2, బెయిలు రద్దు ఎందుకు కాలేదు…

    ఇంకా వీళ్లు బయటే ఉంటే రాష్ట్రన్నికి రాష్ట్ర ప్రజలకూ చాలా ప్రమాదం ఈ సై కో లను ఇంతవరకు ఎందుకూ జై ల్ కూ పంపలేదు.ఎగ్ పఫ్ లు గురించి కూడా మర్చిపోయవు .. వాటి గురించి కూడా రాస్తే బాగుండేది .

  9. Ranganadh Garu, may God bless you. It is deeply shocking and disgraceful to witness someone born into a family of such high spiritual and moral standing descending into this kind of behavior. How can you, who come from a lineage that commands respect, engage in this toxic, shameful conduct? Have you completely lost any sense of dignity or self-awareness? Your vulgar language and your support for hatred are not just disappointing; they are a stain on the very values you should represent. Is there no part of you that feels the weight of shame for behaving this way?

    Your obsession with hatred towards Kamma and Kappu communities is disturbing. You’ve allowed a few bad experiences, with perhaps one or two individuals, to consume your entire mind, poisoning your thoughts and turning you into someone unrecognizable. How can you justify reducing your character to this level of bitterness? Do you even realize the depths you’ve sunk to? Can you really look at yourself and not feel the disgust for how low you’ve fallen? You are betraying the legacy of your family and your own humanity by allowing this hatred to rule you.

    It’s time to wake up and recognize that you’re only hurting yourself. Both science and religion agree: harboring this much hate and negativity is like drinking poison, hoping someone else will suffer. It’s building up toxic stress inside you, damaging your health and spirit. Why would you choose to destroy yourself this way? Why allow bitterness to run your life, leading you down a path of illness, misery, and hatred? Is this what you want your legacy to be—defined by hate and anger?

    I understand you’re frustrated, but frustration is no excuse to live in constant hatred. You should be above this. You can rise above the petty anger and become a better human being. But if you continue down this path, you’re choosing to remain in the gutter, consumed by anger, while the world moves on without you. God bless you, but if you don’t change, your suffering will only deepen. Let go of this destructive hatred before it destroys everything good in you.

  10. When in opposition, TDP supporters trolled about using public money to put stickers on doors with Jagan photo but now within 100 days after comingbto power and even without achieving anything, Kootami government had asked government officials to go door-to-door and apply stickers with CBN photos. When there is no money to fulfill six guarantees, where did the money for stickers come from? Also, how are public funds and public machinery being used for publicizing Kootami parties? Now, whybare all self declared intellectual and TDP supporters silent?

Comments are closed.