జైళ్లో జానీ మాస్టర్

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ జైళ్లోకి వెళ్లాడు. గోవాలో అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఉప్పరపల్లి కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. కోర్టు అతడికి 2 వారాల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.…

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ జైళ్లోకి వెళ్లాడు. గోవాలో అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఉప్పరపల్లి కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. కోర్టు అతడికి 2 వారాల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో జానీ మాస్టర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.

జానీ మాస్టర్ పై పెట్టిన కేసు కేవలం లైంగిక వేధింపులకు సంబంధించినది మాత్రమే కాదు. అత్యాచారం జరిగినప్పుడు తను మైనర్ నని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.

సాధారణ కేసులతో పోలిస్తే, పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన నిందితులకు బెయిల్ దొరకడం కొంచెం కష్టమే. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అతడు కనీసం 3 నెలల పాటు జైళ్లోనే ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ చట్టం కింద అరెస్ట్ అయిన నిందితులు బెయిల్ కోసం జిల్లా సెషన్స్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికైతే అతడు అక్టోబర్ 3 వరకు జైళ్లో ఉండాల్సిందే. ఆ తర్వాత పోలీసులు ప్రవేశపెట్టే సాక్ష్యాలు, కేసులో తీవ్రత ఆధారంగా జానీకి బెయిల్ వస్తుందా రాదా అనేది కోర్టు తేలుస్తుంది. కోర్టుకు జానీ మాస్టర్ భార్య సుమలత కూడా వచ్చారు. ఈ వివాదంపై న్యాయపోరాటం చేస్తామని ఆమె తెలిపారు.

రేపు లేదా సోమవారం ఈ కేసుకు సంబంధించి పోలీసులు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. జానీ, పోలీస్ కస్టడీలోకి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

3 Replies to “జైళ్లో జానీ మాస్టర్”

Comments are closed.