జానీ మాస్టర్ వెనక పెద్ద కుట్ర

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు నిర్మాత సి.కల్యాణ్. లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ కు తన పూర్తి మద్దతు తెలిపారు. Advertisement…

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు నిర్మాత సి.కల్యాణ్. లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ కు తన పూర్తి మద్దతు తెలిపారు.

“జానీ మాస్టర్ పై కుట్ర జరుగుతోందనేది నిజం. నేను 4 రోజులుగా ఎంక్వయిరీ చేస్తున్నాను. ఈ కుట్ర ఎవరు చేస్తున్నారనేది గ్యారెంటీగా బయటకొస్తుంది. త్వరలోనే నేను కూడా ప్రెస్ ముందుకొస్తా. ఈ కుట్ర వెనక ఎవరున్నారు.. ఏం జరిగిందనేది నేను చెబుతా.”

16వ ఏట రేప్ జరిగితే, ఇన్నేళ్లు బాధితురాలు ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు సి.కల్యాణ్. జానీ మాస్టర్ ద్వారా ఇన్నేళ్లు లబ్ది పొంది, ఇప్పుడు అతడి ఇమేజ్ ను కావాలనే దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

“16వ ఏట రేప్ చేశాడని ఆరోపిస్తాందామె, 21 ఏళ్లు వచ్చేంతవరకు ఏం చేసింది. జానీ మాస్టర్ కు పేరొచ్చింది, అతడ్ని టార్గెట్ చేయాలని ఇప్పుడామె ఆరోపణలతో ముందుకొచ్చింది. ఓ అమ్మాయి వచ్చి ఫలానా వ్యక్తి నన్ను గోకాడు, రేప్ చేశాడు అని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడొచ్చి కేసు పెడితే అది వర్తిస్తుందా?”

గతంలో అన్యాయం జరిగిందని, ఇప్పుడొచ్చి కేసు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూసే వాళ్లను ఇండస్ట్రీ ఎంకరేజ్ చేయకూడదన్నారు సి.కల్యాణ్. ఈ పద్ధతి ఇలానే కొనసాగితే… రేపు ఉదయం హీరోలు, దర్శకులపై ఇలాంటి ఆరోపణలొస్తాయని.. ఫలానా డైరక్టర్ లేదా హీరో రేప్ చేశాడని ఈ అమ్మాయే చెప్పొచ్చని, లేదా ఈ కేసు చూసి ఇంకో అమ్మాయి చెప్పొచ్చని అంటున్నారు.

ఇంత జరిగిన తర్వాత బాధితురాలితో కలిసి పనిచేసేందుకు ఇండస్ట్రీలో ఎవ్వరూ ముందుకురారని అంటున్న సి.కల్యాణ్.. దాసరి నారాయణరావు లేని లోటు మరోసారి కనిపిస్తోందని, ఆయన ఉంటే, ఈ వివాదం ఇంత దూరం వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.

12 Replies to “జానీ మాస్టర్ వెనక పెద్ద కుట్ర”

  1. నిజమె దొరా దాసరి వుండి వుంటె అన్ని లొలొపనె సర్దెసెవాడు

    జయంతి ని కొట్టినా సర్దెసాడు

    సాక్షి శివానంద్ ను కొట్టినా సర్దెసాడు

    నన్ను లెజెండరి గా గుర్తించండి అని గొలపెట్టినా కొట్టినా సర్దెసాడు

  2. ఒరేయ్ పుండకోర్ మైనర్ బాలిక మీద అత్యాచారం 100 ఏళ్ల తరవాత చెప్పినా కూడా ఘోరమైన నేరమేరా … నీవేంత నీచుడివో తెలుస్తూ ఉంది

  3. ఈ మాజీ కండక్టర్ గాడు ఎమైనా పొలీసా ? వీడు వేరే ఎంక్వైరీ చేయడం ఎందుకో ?

    ఆ అమ్మాయి కావ్లనే ఇరికించింది అనేది తెలుస్తోంది..

    మరి జానీ గాడు బెంగళూరు పారిపోయి, అటు నుంచి విదేశాలకి పోయే ప్రయత్నం ఎందుకు .. ఇద్దరం ఒక లో ఉన్నాం.. ఇప్పుడు చెడింది అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాచ్చుగా

Comments are closed.