శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తో సినిమా చేయాలని తను చాన్నాళ్లుగా అనుకుంటున్నానని.. దేవర సినిమాకు కాస్త గట్టిగా అనుకున్నానని.. ఆ వెంటనే జాన్వి తమ ప్రాజెక్టులోకి వచ్చిందంటున్నాడు ఎన్టీఆర్.
“దేవరకు సంబంధించి నేను కలగన్నది జాన్వి కపూర్ ను మాత్రమే. జాన్వి చేయాలి.. చేయాలి అని గట్టిగా అనుకున్నాను. అదే జరిగింది. నిజానికి హీరోయిన్ క్యారెక్టర్ రాసేటప్పుడు జాన్వి పేరు తట్టలేదు. ఎప్పుడైతే క్యారెక్టర్ రాయడం పూర్తయిందో, ఇద్దరి నోటి నుంచి ఒకేసారి జాన్వి కపూర్ పేరు వచ్చింది.”
దేవరలో పాత్రకు జాన్వి నూటికి 200శాతం న్యాయం చేసిందని అంటున్నాడు ఎన్టీఆర్. మరీ ముఖ్యంగా ఓ సందర్భంలో 2 పేజీల డైలాగ్ ను సింగిల్ టేక్ లో చెప్పడం చూసి తను, కొరటాల శివ షాక్ అయ్యామని తెలిపాడు. అలా తన పాత్ర కోసం జాన్వి చాలా కష్టపడిందని గుర్తుచేశాడు.
ఇక సినిమాలో అత్యంత కష్టమైన సన్నివేశంపై కూడా స్పందించాడు ఎన్టీఆర్. సినిమాలో ఆయుధపూజ సెటప్, దాని దగ్గర ఓ సీన్ ఉందంట. మూవీకి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ ఎపిసోడ్ స్టార్ట్ చేశారట. తిరిగి సినిమాకు గుమ్మడికాయ కొట్టినప్పుడు, చిట్టచివర్లో ఆ సీన్ ఓకే అయిందని వెల్లడించాడు.
Good hero NTR
kalakanadaniki ademina devatha entra boku
అయినా మేం థియేటర్లో చూడం