తెలంగాణను చూసి నేర్చుకుంటున్న ఏపీ !

సమాజానికి మంచి ఎక్కడ జరిగినా దాన్ని స్వాగతించాలి. ఆహ్వానించాలి. వీలయితే పాటించాలి. అనుసరించాలి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తరచుగా “తెలంగాణ ఆచరిస్తోంది …దేశం అనుసరిస్తోంది”అనే వాడు. తెలంగాణలో గొప్ప పనులు చేస్తున్నామని, గొప్ప పథకాలు…

సమాజానికి మంచి ఎక్కడ జరిగినా దాన్ని స్వాగతించాలి. ఆహ్వానించాలి. వీలయితే పాటించాలి. అనుసరించాలి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తరచుగా “తెలంగాణ ఆచరిస్తోంది …దేశం అనుసరిస్తోంది”అనే వాడు. తెలంగాణలో గొప్ప పనులు చేస్తున్నామని, గొప్ప పథకాలు అమలు చేస్తున్నామని చెప్పడమన్నమాట. సరే …దేశం ఏం అనుసరించిందో తెలియదు.

కానీ ఇప్పుడు తెలంగాణలో చేస్తున్న ఒక మంచి పనిని అమలు చేయాలని పొరుగున ఉన్న ఏపీ అనుకుంటోంది. ఏమిటది అంటారా? సంచలనం సృష్టిస్తున్న, ప్రకంపనలు కలిగిగిస్తున్న, రాజకీయ నాయకుల, అక్రమ నిర్మాణదారులు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న “హైడ్రా”. దాని దూకుడు మామూలుగా లేదు. రేవంత్ రెడ్డి దాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఎంతమంది అడ్డుకున్న హైడ్రా ఆపేది లేదని మొన్న ప్రజా పాలన దినోత్సవం రోజు కుండ బద్దలు కొట్టాడు. దానికి చట్టబద్ధత కల్పిస్తానన్నాడు. దానికంటూ సొంత యంత్రంగాన్ని ఏర్పాటు చేస్తానని, భారీ యంత్రాలు కొనుగోలు చేస్తామని, సిబ్బందిని నియమిస్తామని చెబుతున్నాడు. విశేష అధికారాలు కల్పిస్తానంటున్నాడు.

సో …హైడ్రా బాహుబలిలా తయారవుతుందన్నమాట. ఇది తెలంగాణ సమాజానికి మేలు చేస్తోంది కాబట్టి ప్రజలు స్వాగతిస్తున్నారు. హైడ్రా వల్ల జరుగుతున్న మంచిని ఏపీ ప్రభుత్వం గమనిస్తోంది. చెరువులను, కుంటలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేయడం అన్ని రాష్ట్రాల్లో జరిగింది. జరుగుతోంది. తెలంగాణలో దానికి బ్రేకులు వేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించాడు.

ఏపీలోనూ అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయని, కాబట్టి ఇక్కడ కూడా హైడ్రాలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పాడు. దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. అంటే తెలంగాణను చూసి ఏపీ స్ఫూర్తి పొందిందన్న మాట. ఆ రాష్ట్రంలో కూడా ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే మంచిదే. కానీ పట్టుదలగా అమలుచేయాలి. ఈ పని చేస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది.

4 Replies to “తెలంగాణను చూసి నేర్చుకుంటున్న ఏపీ !”

  1. గుంటూరులో రైల్వే పట్టాలకి ఆనుకొని 15 అంతస్తుల బిల్డింగ్ లు కట్టిన మన సంబరాల కాంబాబు తమ్ముడి తో స్టార్ట్ చేద్దాం.

  2. వైసీపీ మద్దతుదారులకు,

    మనం ఎవరైతే ఉన్నామో, ఏ పార్టీని ఎంచుకోవాలో మనకు స్వేచ్ఛ ఉంది. కానీ, రాజు గారు, లోకనాథరావు గారు, రంగనాథ్ గారు మరియు ఇతర వైసీపీ మద్దతుదారులకు ముఖ్యంగా చెప్పదలచుకున్నది, తిరుమల తిరుపతి లడ్డులో గ్లీ లో కల్తీ చేయడం ఒక రాజకీయ సమస్య కాదని, ఇది కేవలం హిందువుల విశ్వాసాలను మరియు సంప్రదాయాలను అవమానించడమే కాక, స్వామివారి ఆరాధన పట్ల ఘోర అవమానమని చెప్పాలనుకుంటున్నాను.

    తిరుపతి లడ్డూ సాదా స్వీట్స్ కాదు, అది నైవేద్యం, శ్రీవారి పవిత్ర ప్రసాదం. ఇందులో కల్తీ చేయడమంటే భగవంతునికి స్వచ్ఛమైన నైవేద్యం సమర్పించడం కాకుండా అపవిత్రం చేయడమే. భగవద్గీత (9:26) లో భగవంతుడు ఇలా అంటారు: “పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్త్యా ప్రార్పితం ఆమిషం” అని. ఈ రీతిలో నైవేద్యం సమర్పించబడినప్పుడు, అది స్వచ్ఛంగా మరియు భక్తితో ఉండాలి. ఈ సంప్రదాయాన్ని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

    మీ పార్టీ సభ్యులకు ఈ విషయం చాలా సీరియస్‌గా చెప్పండి. మనుస్మృతి (11:18) ప్రకారం, ఆహారంలో మోసం చేయడం పాపం. పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది.

    హిందూ సంప్రదాయాలను గౌరవించడం ఎంతో ముఖ్యం, ముఖ్యంగా ఇలా పవిత్రమైన ప్రసాదాలలో కల్తీ చేయడం అసహ్యకరమైన చర్య. అన్ని మతాలనూ గౌరవించాలి, కానీ మన పవిత్ర సంప్రదాయాలను ఎవరు అవమానించినా అలా వదిలి పెట్టకూడదు. ఈ చర్యను మీరు నిరసించకపోతే, భవిష్యత్తులో ఇలాంటివి మరింత పెరుగుతాయి. మహాభారతం (శాంతి పర్వం 109:11) లో చెప్పబడినట్లు, “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి.

    వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, కానీ ఆయన శక్తి అపారమైనది, ఎప్పటికప్పుడు మన చర్యలను పరిశీలిస్తారు.

Comments are closed.