హైదరాబాద్ సిటీలో ఆక్రమణదారులకు వణుకు పుట్టిస్తున్న హైడ్రాను బాహుబలిలా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. దానికి సమస్త అధికారాలను కట్టబెడుతున్నాడు. అది ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి మున్సిపల్ చట్టానికి సవరణలు చేసే ఆర్డినెన్స్ జారీ చేస్తారు.
అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేస్తారు. దాంతో అది చట్టమవుతుంది. చట్టం లేకముందే వణుకు పుట్టిస్తున్న హైడ్రా ఇక చట్టమైతే ఇంకెంత ప్రకంపనలు సృష్టిస్తుందో ! ఈ చట్టం అమల్లోకి వస్తే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు (జీహెచ్ ఎంసీ సహా ), మున్సిపాలిటీల కమిషనర్లు నామాత్రమైపోతారు.
చివరకు భవనాలకు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిరభ్యంతర పత్రం ఇచ్చే అధికారం కూడా హైడ్రాకే కట్టబెట్టారు. వాస్తవానికి హైడ్రా ఇంత శక్తిమంతంగా ఉంటేనే ఆక్రమణదారుల్లో, అవినీతిపరుల్లో భయం ఉంటుంది. పంచాయతీల మీద కూడా హైడ్రాకు అధికారాలు కట్టబెట్టారు.
హైదరాబాదులో, ఇతర మున్సిపాలిటీల్లో చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు చేశారంటే కమిషనర్ల అవినీతి, ఉదాసీనత, లొంగుబాటే కారణం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి కమిషనర్లు అడుగులకు మడుగులొత్తడం వల్లనే వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులు పదుల ఎకరాల విస్తీర్ణంలోకి కుంచించుకు పోయాయి.
హైడ్రా చట్టమైతే దాని అధినేత రంగనాథ్ (ఆయన తరువాత ఎవరొచ్చినా) సూపర్ బాస్ అవుతాడు. ఆయన ఆదేశాలు, అనుమతి లేనిదే ఏ పని జరగదు. ఏది ఏమైనా తెలంగాణ పునర్నిర్మాణమే తన లక్ష్యమని గొప్పలు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ చేయలేని పునర్నిర్మాణం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పుకోవచ్చు.
Super 👌
హైడ్రా బాహుబలి అని ప్రజలు నమ్మాలంటే జగన్ రెడ్డి పాలస్ లోటస్ పాండ్ ని , వై వీ సుబ్బా రెడ్డి ఫార్మ్ హౌస్ , కేవీపీ ఫార్మ్ హౌస్ , పెద్ది రెడ్డి ఫార్మ్ హౌస్ , రకుల్ రావ్ జన్వాడ ఫార్మ్ హౌస్ నేలమట్టం చేసి నిరూపించుకోవాలి
Owaisi colleges, Ramoji film city, Roads ki addamga vunna churchlu,dargaalu, Lanco hills ivi kudaa, kondalu,guttalu,cheruvulu, okatenti anni aakraminchukuni brathukutunnaru vedhavalu
Bhuvi ki DNA kuda chepyinchali
kotha devudandi, kotha HUNDI andi
ఇలాంటిదే ఏపీ లో కూడా రావాలి…
దొ*ర ఫార్మ్ హౌస్ నీ నేల మట్టం చేసినప్పుడే హైడ్రా కి దమ్ము వుంది అని నమ్ముతారు