దేవర వస్తే మత్తు వదిలేస్తుంది

మత్తువదలరా 2 సినిమా మరో ఘనత సాధించబోతోంది. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు 9 లక్షల డాలర్లకు పైగా…

మత్తువదలరా 2 సినిమా మరో ఘనత సాధించబోతోంది. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు 9 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి. మరికొన్ని రోజులు ఇదే ట్రెండ్ నడిస్తే, సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరినట్టవుతుంది.

అయితే ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుతుందా చేరదా అనే ఆసక్తి అందర్లో నెలకొంది. మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాలంటే ఈ సినిమాకు ఉన్నది మరో 6 రోజులు మాత్రమే. ఈ 6 రోజుల్లోనే దాదాపు లక్ష డాలర్లు రాబట్టాల్సి ఉంటుంది.

ఎందుకంటే.. వచ్చే వారం దేవర సినిమా వస్తోంది. ఆ సినిమాపై ఓవర్సీస్ లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ జోరు కనిపిస్తోంది. ఇప్పటికే దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 1.6 మిలియన్ డాలర్లు ఆర్జించింది.

దేవర వచ్చిందంటే, మత్తు వదలరా 2 సినిమా థియేట్రికల్ రన్ పూర్తయినట్టే. ఓవర్సీస్ లో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఏపీ,నైజాంలో 18 కోట్ల గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా, ఇప్పటికే 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. విడుదలైన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సూపర్ హిట్ అనిపించుకుంది.

3 Replies to “దేవర వస్తే మత్తు వదిలేస్తుంది”

Comments are closed.