తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తీరు రోజురోజుకూ వివాదాస్పదం అవుతోంది. ఎవర్నీ లెక్క చేయడం లేదు. ప్రజల్లో వ్యతిరేకం అయ్యేలా తన ప్రవర్తన వుందనే భయం కూడా ఆయనలో కనిపించడం లేదు. ఓడిపోయిన బియ్యపు మధుసూదన్‌రెడ్డే ఎంతో మంచోడనే భావన ఇప్పుడా నియోజకవర్గ ప్రజల్లో ఏర్పడింది. ఇటీవల ఇసుక అక్రమ రవాణాపై కథనం రాశారని తన పార్టీ అనుకూల మీడియా ప్రతినిధికే బొజ్జల సుధీర్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా బొజ్జల సుధీర్ దౌర్జన్యానికి సంబంధించి మరో ఘటన వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌పూర్ జిల్లాకు చెందిన సుశీల్ చౌదరి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్క్రాప్ వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈ విషయం బొజ్జల సుధీర్‌కు తెలిసింది. బాగా సంపాదిస్తున్నాడని ఎవరో ఎమ్మెల్యేకు సమాచారం చేరవేశారు. దీంతో తనకు సంపాదనలో భాగం ఇవ్వాలని తనను వేధించడం మొదలు పెట్టాడని బాధితుడైన సుశీల్ చౌదరి మీడియా ఎదుట వాపోయాడు. ఆయన చెప్పిన ప్రకారం మరిన్ని వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్‌కు తనను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ పిలిపించినట్టు చౌదరి చెప్పాడు. తన అనుమతి లేకుండా నియోజకవర్గంలో వ్యాపారాలు చేయొద్దని బొజ్జల అన్నట్టు అతను తెలిపాడు. ఒకవేళ వ్యాపారం చేయాలంటే ప్రతినెలా రూ.50 లక్షల నుంచి కోటి రూపాయిలు ఇవ్వాలని బెదిరించినట్టు అతను వాపోయాడు. అయితే అంత పెద్ద మొత్తంలో ఇచ్చుకోలేనని బొజ్జలకు విన్నవించుకున్నా వినిపించుకోలేదన్నాడు.
దీంతో రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని పారిశ్రామికవేత్తలకు ఎమ్మెల్యే ఫోన్ చేసి, తనకు స్క్రాప్ అమ్మొద్దని ఆదేశాలు ఇచ్చాడని అతను చెప్పుకొచ్చాడు. దీంతో ఇంట్లోనే ఖాళీ కూచున్నట్టు అతను తెలిపాడు. ఇటీవల ఎమ్మెల్యే అనుచరుడు తనకు ఫోన్ చేసి, మళ్లీ డబ్బు కోసం బెదిరించాడన్నాడు. ఇంటికొచ్చి తనను చితక్కొట్టినట్టు అతను వాపోయాడు. తనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, నారా లోకేశ్ న్యాయం చేయాలని సుశీల్ చౌదరి వేడుకున్నాడు. బొజ్జల సుధీర్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
He also needs to recover his election expenditure.
vc estanu 9380537747
vc available 9380537747