విడాకుల తర్వాత తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై తొలిసారి స్పందించాడు తమిళ హీరో జయం రవి. విడాకులు తీసుకున్న తర్వాత, జయం రవి మాజీ భార్య ఆర్తి అతడిపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆర్థికంగా ఎలాంటి ఆలంబన లేకుండా వదిలేశాడని అన్నారామె.
దీనిపై జయం రవి సూటిగా స్పందించాడు. విడాకులిచ్చిన తర్వాత తన ఇంటి నుంచి ఖాళీ చేతులతో బయటకొచ్చానని జయం రవి ప్రకటించాడు. ప్రస్తుతం తన దగ్గర ఏమీ లేదన్నాడు. మొత్తం తన మాజీ భార్య, పిల్లల కోసం వదిలేసినట్టు వెల్లడించాడు.
గాయని, సైకాలజిస్ట్ కెనీషాతో జయం రవి డేటింగ్ లో ఉన్నాడంటూ రూమర్స్ వస్తున్నాయి. వీటిపై కూడా రియాక్ట్ అయ్యాడు. కెనీషా చాలా కష్టపడి పైకొచ్చిందని, ఎన్నో ప్రదర్శనలిచ్చిందని, సైకాలజిస్ట్ గా సేవలందించాలనుకుంటోందని, తనతో కలిసి హాస్పిటల్ స్థాపిస్తానని.. అంతకుమించి తామిద్దరి మధ్య ఏం లేదని స్పష్టం చేశాడు.
ఇక పిల్లల కస్టడీపై స్పందిస్తూ.. ఇద్దరు కొడుకుల్ని తనే పెంచుతానని.. ఈ మేరకు కోర్టులో 20 ఏళ్లయినా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు జయం రవి. పెద్ద కొడుకు హీరోగా, తను నిర్మాతగా మారి ఓ సినిమా నిర్మించాలనేది తన జీవితాశయంగా చెప్పుకొచ్చాడు. పిల్లలే తన జీవితమని, వాళ్ల కోసమే బతుకుతున్నానని వెల్లడించాడు.
తనకు కనీసం మాట చెప్పకుండా విడాకుల ప్రకటన చేశారంటూ గతంలో ఆర్తి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆర్తి తల్లిదండ్రులతో చర్చించిన తర్వాతే విడాకుల ప్రకటన చేశానని, ఆమెతో తల్లిదండ్రులు ఈ విషయం చెప్పకుండా ఉంటారా అని ప్రశ్నించాడు.
చాలా ఏళ్లుగా జయం రవి సోషల్ మీడియా ఎకౌంట్లను ఆర్తినే హ్యాండిల్ చేస్తున్నారు. ఆమె నుంచి తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ను వెనక్కు తెచ్చుకున్నాడు జయం రవి. ఇకపై కొత్త జయం రవిని చూస్తారంటూ పోస్ట్ పెడుతూ, మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు.
vc estanu 9380537747
Still the healer put both hands in his pockets and didn’t leave without looking back.
Call boy works 9989793850
pandi la unnavu neekemi mayarogam ra pellam pillalanu vadilesavu
Cinema industry lo roju ku okaru eddaru dorukutaaru eppudu kaavalante appudu offers Peru tho kadupu lu chestaru
ఖాళీ సీట్లతో నడుస్తున్న థియేటర్లు