పుష్ప-2కు అలా జరగదు!

దేవర సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగలేదు. నిర్వహణ లోపం, వేదిక ఎంపిక వల్ల భారీగా జరగాల్సిన ఫంక్షన్ రద్దయింది. కీలక సమయంలో సినిమాకు ప్రచారం జరగలేదు. Advertisement ఇంకా చెప్పాలంటే తెలుగులో భారీ స్థాయిలో…

దేవర సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగలేదు. నిర్వహణ లోపం, వేదిక ఎంపిక వల్ల భారీగా జరగాల్సిన ఫంక్షన్ రద్దయింది. కీలక సమయంలో సినిమాకు ప్రచారం జరగలేదు.

ఇంకా చెప్పాలంటే తెలుగులో భారీ స్థాయిలో ఫంక్షన్ ఏదీ లేకుండానే దేవర సినిమా థియేటర్లలోకి వస్తోంది. విడుదలకు ముందు అభిమానుల్ని కలవాలనుకున్న తారక్ ఆశలు, తమ హీరోను చూడాలనుకున్న ఫ్యాన్స్ ఆశలు గల్లంతయ్యాయి.

దేవర తర్వాత ఆ స్థాయిలో వస్తున్న పెద్ద సినిమా పుష్ప-2 మాత్రమే. మరి ఈ సినిమాకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు. దీనిపై నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. దేవర అనుభవంతో పుష్ప-2 ప్రచారానికి మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామంటున్నారు.

“ఊహించిన దానికంటే దాదాపు 2-3 రెట్లు జనాలు వచ్చేశారు. చాలా సేపు పోలీసులు కూడా ట్రై చేశారు కానీ కంట్రోల్ అవ్వలేదు. అలా జరగడం చాలా దురదృష్టకరం. పాపం చాలామంది శ్రీకాకుళం, అనంతపురం లాంటి ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. రేపు లేదా ఎల్లుండి ఇంకో ఫంక్షన్ పెట్టడానికి కూడా లేదు. ఎందుకంటే, ఓవర్సీస్ ప్రచారం కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లిపోయారు. ఈ అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని పుష్ప-2 కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. పుష్ప-2 ఈవెంట్స్ అన్నీ ఔట్ డోర్ లో ప్లాన్ చేస్తాం. జనం ఎంతమంది వచ్చినా సరిపోయేలా చూసుకుంటాం.”

ఇలా నిర్మాత రవిశంకర్ బన్నీ ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు. పుష్ప-2పై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 6న థియేటర్లలోకి వస్తోంది.

6 Replies to “పుష్ప-2కు అలా జరగదు!”

    1. కనీసం ఇంట్లో నుంచి బయటికి వస్తావా ఏదైనా పని ఉంటే లేదంటే అది కూడా….. ONline లొ నే బుక్ చేస్తావా?? పిచ్చిలేసిపోతావ్ జాగ్రత్త బ్రో

      😂😂😂😂😂😂

Comments are closed.