మంచి ప్ర‌భుత్వ‌మ‌ని డ‌బ్బా కొట్టుకుంటున్నారు!

మంచి ప్ర‌భుత్వమ‌ని కూట‌మి నేత‌లు డ‌బ్బా కొట్టు కుంటున్నార‌ని వైసీపీ ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుడు భూమా కిషోర్‌రెడ్డి విమ‌ర్శించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మంచి ప్ర‌భుత్వ‌మ‌ని కూట‌మి నేత‌లు చెప్పుకుంటే ప్ర‌యోజ‌నం వుండ‌ద‌న్నారు.…

మంచి ప్ర‌భుత్వమ‌ని కూట‌మి నేత‌లు డ‌బ్బా కొట్టు కుంటున్నార‌ని వైసీపీ ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుడు భూమా కిషోర్‌రెడ్డి విమ‌ర్శించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మంచి ప్ర‌భుత్వ‌మ‌ని కూట‌మి నేత‌లు చెప్పుకుంటే ప్ర‌యోజ‌నం వుండ‌ద‌న్నారు. ప్ర‌జ‌లు ఆ విష‌యాన్ని చెప్పాల‌ని ఆయ‌న అన్నారు.

సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి ఏ ఒక్క హామీని కూట‌మి స‌ర్కార్ నెర‌వేర్చ‌లేద‌ని ఆయ‌న అన్నారు. త‌ల్లికి వంద‌నం, రైతు భ‌రోసా త‌దిత‌ర ప‌థ‌కాల అమ‌లుకు ఇంత వ‌ర‌కూ దిక్కులేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో దోపిడీలు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ఎక్క‌డ చూసినా అరాచ‌కాలు సాగుతున్నాయ‌న్నారు.

ఇసుక పాల‌సీపై ప్ర‌జా వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంద‌ని భూమా కిషోర్‌రెడ్డి విమ‌ర్శించారు. ఆళ్ల‌గ‌డ్డ‌కు 20 ట‌న్నుల ఇసుక రావాలంటే దాదాపు రూ.26 వేలు ప‌డుతోంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇదేనా ఉచిత ఇసుక ప‌థ‌క‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. హామీల అమ‌లుకు త‌న‌ది పూచీ అని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నార‌న్నారు.

తిరుమ‌ల ప్ర‌సాదంపై దారుణ‌మైన నింద వేస్తార‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌న్నారు. ల‌డ్డూ అప‌విత్రం అయ్యింద‌ని, కాలేద‌ని టీడీపీ నేత‌లే చెబుతున్నార‌న్నారు. వంద రోజుల ఫెయిల్యూర్ పాల‌న గుర్తుకు రావ‌ద్దంటే, తిరుమ‌ల ప్ర‌సాదంపై అభాండాలు వేయాల‌ని ముందే నిర్ణ‌యించుకున్నార‌ని భూమ‌న ఆరోపించారు.

26 Replies to “మంచి ప్ర‌భుత్వ‌మ‌ని డ‌బ్బా కొట్టుకుంటున్నారు!”

  1. వైసీపీ లో ఇంత మంచి కమెడియన్స్ ఉన్నారా.. ఈ టాలెంట్ అంతా గత ఐదేళ్లు మూసి ఉంచేశారెందుకు..?

    జగన్ రెడ్డి పిఠాపురం లో చేసిన కామెడీ కి ఆస్కార్ కూడా తక్కువే..

    ఇంత కామెడీ టాలెంట్ ఉండి కూడా పాలస్ లో దాక్కుంటారెందుకో .. అర్థం కావడం లేదు..

    ఇప్పుడైనా జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ లో స్కిట్స్ చేసుకుంటే.. సంపాదన కూడా ఉంటుంది..

    1. Chinni గారు, తిరుమల ప్రసాదం అయిన తిరుపతి లడ్డూ లో కల్తీ చేసిన పార్టీలో మీరు మద్దతు ఇస్తున్నది ఎంతో అత్యంత సిగ్గుచేటు అంశం. ఇది చిన్న విషయంలో కాదు, కోటీ కోట్లాది భక్తులు పూజించే పవిత్ర ప్రసాదంపై దాడి. భగవద్గీతలో (అధ్యాయం 16, శ్లోకం 24) చెప్పినట్లు:

      “తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ”

      (“శాస్త్రాలు ఏది సమంజసమో, ఏది అసమంజసమో చెబుతాయి. వాటినే మార్గదర్శకంగా తీసుకోవాలి.”)

      తిరుపతి లడ్డూ, శ్రీ వేంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదం, కల్తీ చేయడం చాలా ఘోరమైన పాపం. మన ఇళ్లలో లేదా దేవాలయాలలో కూడా గోవు నెయ్యే తప్ప భేషమ పాల నెయ్యిని పూజల కోసం ఉపయోగించం. మరి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేయడం ఎంత పెద్ద నేరమో ఊహించండి! ఇది పవిత్రతను పూర్తిగా తుంచడం.

      మీకు అన్ని ఆధారాలు లేవని అనుకున్నా, మీ మనసులో నిజం తెలుసు. ఈ కల్తీ జరిగింది కాదా? పవిత్రమైన ప్రసాదం అపవిత్రం చేయబడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండగలరా? మీ పార్టీని అంధంగా కాపాడటం మానుకుని, జగన్మోహన్ రెడ్డి ఎలా ఈతరం సంపాదించాడు అనే ప్రశ్న అడగాలి.

      “సత్యమేవ జయతే”సత్యమే గెలుస్తుంది. తిరుపతి లడ్డూ పవిత్రతను రాజకీయ ప్రయోజనాల కోసం అపవిత్రం చేసిన వారిని సమర్థించడం మీ ధార్మిక విలువలకు వ్యతిరేకం. ఇది కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదు, ఇది ధర్మంపై ఒక దాడి.

      రాజా గారు, జీవితం చాలా చిన్నది. ఏది సమంజసమో, ఏది అసమంజసమో మీ హృదయం స్పష్టంగా చెబుతుంది. మీ పార్టీ ఈ నేరంలో పాలుపంచుకోలేదనుకుంటే, ఈంత భయమేమిటి? ప్రజలు ఈ కల్తీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మీరు కూడా వ్యక్తం చేయాలి. సత్యం, ధర్మం పట్ల మీరు నిలబడే సమయం ఇది.

      ఈ ఘోరమైన నేరాన్ని ఖండించండి, లేకపోతే ఈ నేరంపై మీ మౌనం చరిత్రలో చెరగని మచ్చగా మిగులుతుంది.

  2. కుల విద్వేషాన్ని ప్రోత్సహించడం వైసీపీ మద్దతుదారులు ఉపయోగించే తాత్కాలిక వ్యూహం మాత్రమే కాదు, ఇది సమాజంలో తీవ్రమైన విభజనను సృష్టించే ప్రమాదకరమైన చర్య. గత ఎన్నికల్లో ఇది జగన్ మోహన్ రెడ్డికి చాలా నష్టం చేసిందని ప్రజలు స్పష్టంగా చూపించారు. ప్రజలు ఇలాంటి నీచమైన రాజకీయాలకు మోసపోవడానికి సిద్ధంగా లేరు. కూటమికి కేవలం కమ్మలు లేదా కాపులు మాత్రమే కాకుండా, చాలా ఇతర కులాలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో రెడ్డులు కూడా మద్దతు ఇవ్వడం ఈ సత్యాన్ని మరింత స్పష్టం చేసింది.

    ప్రస్తుతం మనం కలసి పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం — తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ సమస్య. ఇది కేవలం కొన్ని కులాలకు సంబంధించిన విషయం కాదు; ప్రతి భారతీయుడి విశ్వాసం, ఆచారాలు, మనోభావాలను దెబ్బతీసే అంశం. 95% రెడ్డులు సహా, అన్ని కులాలవారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కులం గురించి కాదు, నిజాయితీ, ధర్మం గురించి. ఈ వ్యవహారంలో బాధ్యులెవ్వరైనా సరే, మనం ధైర్యంగా నిలబడి వారి తప్పును ఖండించాలి.

    పవిత్రమైన తిరుపతి లడ్డును కల్తీ చేయడం భక్తుల మనోభావాలకు దెబ్బతీసే చర్య. కులాలకు అతీతంగా ఇలాంటి దారుణ చర్యలను ఖండించాల్సిన సమయం ఇది. కుల విద్వేషం ప్రోత్సహించడం ద్వారా మనం కేవలం విభజనలను సృష్టిస్తాం, కాని సమాజాన్ని ఏకీకృతం చేయలేం. మంచి మానవులుగా ఉండి, కులాలకు అతీతంగా నైతిక విలువలు, సత్యం, న్యాయం కోసం నిలబడాలి.

    కుల విద్వేషం మన సమాజాన్ని నిర్మించదు, అది కేవలం మనల్ని బలహీనంగా చేస్తుంది. కులం ఏదైనా కావచ్చు, కానీ తప్పు ఎక్కడ జరిగినా, అది ఖండించబడాలి.

    1. ఇలాంటి మాటలను, విభజన రాజకీయం చేసిన అన్నని వూళ్ళో అందరి పెంట కలిపి చెప్పుకి రాసి లాగి పెట్టి కొట్టారు. ఇంకా paytm గాళ్ళు మారకపోతే అన్నకి ఇంకో ఎలక్షన్ ఉండదు.. ఇదే మూసలో ఉంటె. మొన్న 151 లో 5 తీశారు, ఈసారి 11 లో 1 తీసేత్తారు.

        1. నీకు బాగా అలవాటు అనుకుంట నువ్వే వేసుకో అలాగే వైసీపీ వాళ్ళకి కూడా వేయి

    1. paid artist wrote: “No money for super six but there is money for door to door sticker publicity.”

      no money for paying small contractors who did work in prev govt but has money for sakshi and vizag palace?

Comments are closed.