మరోసారి విడుదల తేదీల తకరారు

రిలీజ్ డేట్స్ విషయంలో సినిమాల మధ్య పోటీ కొత్తదేం కాదు. ఏటా సంక్రాంతికి మొదలవుతుంది. ప్రతి పండక్కి రిపీట్ అవుతుంది. అయితే గడిచిన రెండేళ్లుగా ఈ పోటీ మరింత ఎక్కువైంది. పెద్ద పండగలతో పాటు,…

రిలీజ్ డేట్స్ విషయంలో సినిమాల మధ్య పోటీ కొత్తదేం కాదు. ఏటా సంక్రాంతికి మొదలవుతుంది. ప్రతి పండక్కి రిపీట్ అవుతుంది. అయితే గడిచిన రెండేళ్లుగా ఈ పోటీ మరింత ఎక్కువైంది. పెద్ద పండగలతో పాటు, లాంగ్ వీకెండ్స్ కు కూడా పోటీ పడడం మొదలైంది.

ఇప్పటికే సంక్రాంతి పోటీ రాజుకుంది. విశ్వంభర విడుదల తేదీ ప్రకటించింది. అనీల్ రావిపూడి-వెంకటేష్ సినిమాను కూడా సంక్రాంతికే తీసుకొస్తాం అంటున్నారు. తాజాగా సందీప్ కిషన్ సినిమా (మజాకా)ను కూడా సంక్రాంతికే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

సంక్రాంతి కంటే ముందున్న క్రిస్మస్ కు ఎంత పోటీ నడిచిందో అందరం చూశాం. వస్తుందనుకున్న తండేల్ వెనక్కు వెళ్లిపోయింది. రాబిన్ హుడ్ కూడా తప్పుకుంది. పుష్ప-2 రాకతో ఇదంతా జరిగింది. మధ్యలో గేమ్ ఛేంజర్ కూడా ఎంటరైంది.

ఇప్పుడు సమ్మర్ లో కూడా ఇలాంటి సర్దుబాట్లే భారీగా జరగబోతున్నాయి. రాజా సాబ్ ను ఏప్రిల్ 10న తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. దీంతో దానికి ముందు-వెనక 2 వారాలు మరో సినిమా వచ్చే పరిస్థితి లేదు.

తాజాగా హరిహరవీరమల్లు సినిమాను కూడా మార్చి 28 రిలీజ్ అని వేశారు. దీంతో ఆ తేదీకి ఆల్రెడీ షెడ్యూల్ అయి ఉన్న విజయ్ దేవరకొండ సినిమాను తప్పించాల్సిన అవసరం ఉంది. అటు క్రిస్మస్ నుంచి వాయిదా పడిన తండేల్ కూడా సమ్మర్ కే వచ్చేలా ఉంది. మధ్యలో బాలకృష్ణ సినిమా, పవన్ ఓజీ మూవీస్ ఉండనే ఉన్నాయి.

ఇవన్నీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తమ విడుదల తేదీల్ని ప్రకటిస్తే అందరికీ మంచిది. లేదంటే మరోసారి బాక్సాఫీస్ క్లాష్, థియేటర్ల కొరత, గిల్ట్ మీటింగులు అంటూ హడావుడి మొదలవుతుంది.

7 Replies to “మరోసారి విడుదల తేదీల తకరారు”

Comments are closed.