ఆంధ్రప్రదేశ్‌లో 20 కార్పొరేషన్ల చైర్మన్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి ఒకటి చొప్పున కేటాయించారు. కార్పొరేషన్ల భర్తీని పరిశీలిస్తే, ప్రధానంగా టీటీడీ పాలక మండలి లేకపోవడం గమనార్హం. భర్తీ వివరాలను పరిశీలిస్తే వివరాలిలా ఉన్నాయి.
వక్ఫ్‌బోర్డు అబ్దుల్ అజీజ్, శాప్ రవినాయుడు, ఏపీ హౌసింగ్ బోర్డు బత్తుల తాతయ్య బాబు, ఏపీ ట్రైకార్ బోరగం శ్రీనివాసులు, ఏపీ మారిటైమ్ బోర్డు దామచర్ల సత్య, సీదాప్ దీపక్‌రెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ లంకా దినకర్ (బీజేపీ), ఏపీ మార్క్‌ఫెడ్ కె.బంగార్రాజు, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మన్నె సుబ్బారెడ్డి, ఏపీఐఐసీ మంతెన రామరాజు, ఏపీ పద్మశాలి కార్పొరేషన్ నందం అబద్ధయ్య, ఏపీ టూరిజం కార్పొరేషన్ నూకసాని బాలాజీ, ఏపీఎస్ ఆర్టీసీ కొనకళ్ల నారాయణ, ఏపీ ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, ఏపీ అర్బన్ ఫైనాన్ష్ పీలా గోవింద సత్యనారాయణ, లెదర్ ఇండస్ట్రీస్ పిల్లి మాణిక్యాలరావు, ఏపీ వినియోగదారుల పరిరక్షణ సమితి పీతల సుజాత, ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్ ప్రైజస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన), ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ తోట మెహర్ సితారామ సుధీర్ (జనసేన), ఏపీ టీపీసీ వజ్జా బాబూరావు, ఏపీ టిడ్కో వి.అజయ్‌కుమార్ (జనసేన) పేర్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. వీరిలో లంకా దినకర్ గతంలో టీడీపీలో యాక్టీవ్‌గా పని చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. పురందేశ్వరికి నమ్మకస్తుడిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక జనసేనలో మొదటి నుంచి తన వెంట నడుస్తున్న నాయకులకు పవన్‌కల్యాణ్ పదవులు ఇప్పించారు. ఉండి సీటును రఘురామకృష్ణంరాజుకు త్యాగం చేసిన మంతెన రామరాజుకు ఏపీఐఐసీ లాంటి కీలక పదవి ఇవ్వడం విశేషం.
vc estanu 9380537747
It’s OK.R R R Where?