ఇక లోకల్ ప్రచారం లేనట్టేనా దేవరా?

తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్ష ప్రచారం లేకుండానే దేవర సినిమా రిలీజ్ అయ్యేలా ఉంది.

ముంబయి వెళ్లారు దేవర ట్రయిలర్ లాంచ్ చేశారు. బాలీవుడ్ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలిచ్చారు, కొన్ని టీవీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. చెన్నై వెళ్లారు, అక్కడి మీడియాతో సమావేశమయ్యారు. మరి ఇక్కడ దేవర ప్రచారం ఎప్పుడు?

తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్ష ప్రచారం లేకుండానే దేవర సినిమా రిలీజ్ అయ్యేలా ఉంది. అనుకున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దయింది. మరో ఈవెంట్ ప్లాన్ చేద్దామంటే ఎన్టీఆర్, ఓవర్సీస్ ప్రచారం కోసం వెళ్లిపోయాడు.

దేవర సినిమాను అక్కడే చూస్తాడనే ప్రచారం కూడా నడుస్తోంది. అదే కనుక జరిగితే తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమాకు ఎన్టీఆర్ ఎలాంటి ప్రచార కార్యక్రమం నిర్వహించనట్టే లెక్క. 2 ట్రయిలర్లు రిలీజ్ చేశారు, 2 ఇంటర్వ్యూలు విడుదల చేశారు. దీంతోనే సరిపెట్టుకోవాలేమో.

నిజంగా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే కొరటాల శివ, జాన్వి కపూర్, అనిరుధ్, సైఫ్ అలీఖాన్.. ఇలా చాలామంది ఉన్నారు. కానీ ఇప్పటివరకు వీళ్లు ఎవ్వరూ ముందుకురాలేదు. విడుదలకు ఇంకా కొద్ది రోజులు టైమ్ మాత్రమే ఉంది. ఇంకేం ప్లాన్ చేశారో?

జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్… ఓవైపు తెలుగులో ప్రచారం చేయకపోయినా దేవర సినిమాకు దాని క్రేజ్ దానికుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆ జోరు కనిపిస్తోంది. హైదరాబాద్ లో మిడ్ నైట్ షో టికెట్ రేట్లు ఆల్రెడీ వెయ్యి రూపాయలు దాటేశాయి. రిలీజ్ టైమ్ కు ఆ రేటు కచ్చితంగా 1500 అవుతుంది.

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాకు ప్రత్యేక మినహాయింపులిచ్చాయి. టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాయి. ఏపీలో తొలిసారి మిడ్-నైట్ షోలకు కూడా అనుమతినిచ్చారు. సో.. ప్రచారంతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

అటు ఓవర్సీస్ లో దేవర సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటికే ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది.

8 Replies to “ఇక లోకల్ ప్రచారం లేనట్టేనా దేవరా?”

  1. మనకి లడ్డూ ప్రచారం ఉండ గా దేవర గురించి ఎందుకు
    ముందు వెళ్లి కోనేరులో దూకమని చెప్పు మన వల్లని తరువాత..
    మేము హిందువులమే మేమెందుకు అలా చేస్తాం
    అని చెప్పమను కొంచెం అయిన నిలబాటతాం

Comments are closed.