మళ్లీ మీడియా ముందుకు హీరోయిన్

హీరోయిన్లంతా ప్రచారం కోసం వెంపర్లాడతారు. ఎందుకంటే వాళ్లకు అది అవసరం. నిత్యం సోషల్ మీడియాలో లేదా వార్తల్లో నలిగితేనే వాళ్లకు క్రేజ్. మేకర్లు వాళ్లను గుర్తుపెట్టుకుంటారు. అయితే ఇలాంటి లెక్కలకు అతీతంగా ఉండే హీరోయిన్లు…

హీరోయిన్లంతా ప్రచారం కోసం వెంపర్లాడతారు. ఎందుకంటే వాళ్లకు అది అవసరం. నిత్యం సోషల్ మీడియాలో లేదా వార్తల్లో నలిగితేనే వాళ్లకు క్రేజ్. మేకర్లు వాళ్లను గుర్తుపెట్టుకుంటారు. అయితే ఇలాంటి లెక్కలకు అతీతంగా ఉండే హీరోయిన్లు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్లలో ఒకరు సాయిపల్లవి.

తన సినిమా రిలీజ్ టైమ్ లో మాత్రమే మీడియాకు కనిపిస్తుంది సాయిపల్లవి. మిగతా టైమ్ లో ఆమె ఏం చేస్తోంది, ఆమె వ్యక్తిగత జీవితం ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. మిగతా హీరోయిన్లలా ఆమె ఫొటోషూట్స్ కూడా పెద్దగా చేయదు.

చాన్నాళ్లుగా ప్రపంచానికి దూరంగా ఉంటున్న సాయిపల్లవి, ఇప్పుడు మరోసారి మీడియా ముందుకొచ్చింది. ఆమె నటించిన అమరన్ సినిమా విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది సాయిపల్లవి.

కోలీవుడ్ లో ప్రస్తుతం సాయిపల్లవి హవా కనిపిస్తోంది. ఆమెపై లెక్కలేనన్ని కథనాలు కనిపిస్తున్నాయి. ఆమె అప్పుడెప్పుడో తన పెళ్లికి సంబంధించిన ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

అమరన్ సినిమా తన కెరీర్ బెస్ట్ రోల్స్ లో ఒకటి అవుతుందని భావిస్తోంది సాయిపల్లవి. రెండేళ్ల కిందట తెలుగులో విరాటపర్వం సినిమా చేసిన సాయిపల్లవి, ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ గ్యాప్ లో అమరన్ ప్రమోషన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని కూడా పలకరించబోతోంది.

5 Replies to “మళ్లీ మీడియా ముందుకు హీరోయిన్”

Comments are closed.