గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్!

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెతికి తీస్తున్నామని చెబుతూ, గత ప్రభుత్వానికి దగ్గరగా పని చేసిన అధికారులను కొందరికి ఎటువంటి ప‌దవులు ఇవ్వ‌కుండా, అవినీతికి సంబంధించిన కారణాలతో…

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెతికి తీస్తున్నామని చెబుతూ, గత ప్రభుత్వానికి దగ్గరగా పని చేసిన అధికారులను కొందరికి ఎటువంటి ప‌దవులు ఇవ్వ‌కుండా, అవినీతికి సంబంధించిన కారణాలతో అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా, ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

నిన్న హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసిన అధికారులు, ఇవాళ విజయవాడ కోర్టులో హాజరు పరచనున్నారు. గత ప్రభుత్వంలో గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై అభియోగాలు ఉండటంతో అరెస్ట్ చేశారు.

ఇప్పటికే అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయినా ఈ అధికారి ప్రభుత్వ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశారు. వెంకటరెడ్డితో పాటు, మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించిన మూడు సంస్థలపై కూడా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 7 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.

3 Replies to “గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్!”

  1. హ! హ!! వీడు పెద్ద అనకొండా అని టాక్ !!

    డెప్యూటేషన్మీద జగన్ తీసుకొచ్చిన మరొ అణిముత్యం ఈ వెంకటరెడ్డి! వీడు కుటమి గెలిచింది అనగాలె కనపడలెదు . చాలా మంది విదెశాలకి పారిపొయాడు అనుకున్నారు.

    వెంకట రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన ఏసీబీ ఆయనకు బెయిల్‌ రాకుండా అడ్డుపడింది.

    మాజీ సీఎం జగన్ సపోర్టుతో గనులశాఖను సొంత సామ్రాజ్యంగా మలుచుకుని వెంకటరెడ్డి దోపిడీకి పాల్పడ్డారన అరొపణ ఉంది. కొన్ని రోజులుగా ఏసీబీ అధికారులు ఆయన కోసం వెతుకుతున్న నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాద్ లొ దొరికాడు అంట!

Comments are closed.