Devara Review: మూవీ రివ్యూ: దేవర

ఇంత భారీ బడ్జెట్, తారాగణం పెట్టుకుని కేవలం పాస్ మార్కులు మాత్రమే పడే కథా కథనాలతో ముందుకొస్తే ఎలా?

చిత్రం: దేవర
రేటింగ్: 2.5/5
తారాగణం: ఎన్.టి.ఆర్, సైఫ్ ఆలి ఖాన్, జాన్వీ కపూర్, శ్రుతి మరాఠె, ప్రకాష్ రాజ్, తాళ్లూరి రామేశ్వరి, శ్రీకాంత్, టాం చక్కో, మురళి శర్మ, అభిమన్యు సింగ్ తదితరులు
కెమెరా: రత్నవేలు
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సంగీతం: అనిరుధ్
నిర్మాతలు: సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, కళ్యాణ్ రాం
దర్శకత్వం: కొరటాల శివ
విడుదల: సెప్టెంబర్ 27 2024

“దేవర” సినిమా చుట్టూ ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. దానికి కారణం ఈ సంవత్సరం తెర మీదకి వచ్చిన అతిపెద్ద తెలుగు సినిమాల్లో కల్కి తర్వాత ఇదే. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ ఈ చిత్రంతో ముందుకు రావడం, శ్రీదేవి కూతురు జాహ్నవీ కపూర్ తెలుగులో తెరంగేట్రం చేయడం ఈ చిత్రానికి ప్రధానమైన ఆకర్షణలు. “ఆచార్య” లాంటి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత కొరటాల శివ ఈ చిత్రంతో ముందుకు రావడం కూడా ఆసక్తి కలిగించే విషయమే. ఈసారి ఈ చిత్రంతో హిట్ కొట్టేందుకు వీలుగా ఉందా? వివరాల్లోకి వెళ్దాం.

కథ 1996లో మొదలయ్యి సింగప్ప (ప్రకాష్ రాజ్) ఒక పోలీసాఫీసర్ (అజయ్) కి ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో 1970ల్లోకి వెళ్తుంది.

నాలుగూళ్లను కలిపే ఎర్రసముద్రం. ఆ నాలుగూళ్లదీ శతాబ్దాల చరిత్ర. బ్రిటీష్ వాళ్లు ఆ ఎర్రసముద్రం మీదుగా నిధులు తీసుకుపోతుంటే ఈ గ్రామాల్లోని వీరులు సముద్రంలోకి వెళ్లి ఆ ఓడల్ని దోచుకుని తిరిగి నిధుల్ని వెనక్కి చేర్చేవారు. బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోయినా, ఆ వంశీకుల ప్రతిభని గుర్తించిన కొందరు క్రిమినల్స్ వాళ్లని ఓడల్ని లూటీ చేయడానికి వాడుకోవడం మొదలుపెట్టారు.

అలాంటి ఓడల్ని లూటీ చేసే ముఠా నాయకుడు దేవర (ఎన్.టి.ఆర్). కానీ ఒకానొక కదిలించే సంఘటన వల్ల అతను ఇక ఎప్పటికీ ఓడల్ని లూటీ చేయకూడదంటాడు. కానీ అది ముఠాలోని ఇతరులకి నచ్చదు. వారికి భైరా (సైఫ్ అలీ ఖాన్) నాయకత్వం వహిస్తాడు. అలా భైరాకి, దేవరకి శత్రుత్వం మొదలువుతుంది. ఒక దశలో దేవరని చంపించే ప్రయత్నం చేస్తాడు భైరా.

ఈ దేవరకి ఎదిగిన కొడుకు వర (ఎన్.టి.ఆర్). తంగం (జాహ్నవి) అతనిని వీరుడనుకుని ఇష్టపడుతుంది. ఇంతకీ అతను నిజంగానే తండ్రిలాంటి వీరుడా? అవునని కాసేపు కాదని కాసేపు అనిపిస్తుంటుంది తెరమీద పాత్రలకి, చూసే ప్రేక్షకులకి కూడా!  దేవర, భైరాల గొడవ ఏ పరిస్థితులకి దారి తీస్తుంది, అందులో వర పాత్ర ఏమౌతుంది అనేది తక్కిన కథ.

ఈ కథని కుదిరినన్ని తక్కువ పాత్రలతో ఆకట్టుకునే విధంగా చెప్పొచ్చు. కానీ దర్శకుడు ఎంచుకున్న మార్గం పూర్తిగా పాత్రలతో నింపేయడం. ఈ కథకి అన్నేసి పాత్రలెందుకో అర్ధం కాదు. అసలు నాలుగూళ్లు అని పెట్టుకోవడమెందుకు? పెట్టుకున్న దగ్గర్నుంచీ ప్రతి ఊరికీ ఒక నాయకుడిని పెట్టుకునే పేరుతో దేశంలో ఉన్న నటుల్ని పట్టుకొచ్చి పెట్టడం దేనికి? పోనీ అలా పెట్టుకున్న నటుల ప్రతిభని వాడుకునే విధంగా స్క్రిప్ట్ ఉందా అంటే లేదు. ఇక ఉపయోగమేంటి?

అందరూ సింగిల్ డైలాగ్ ఆర్టిస్టుల్లాగ, అతిథి పాత్రల్లాగ, జూనియర్ ఆర్టిస్టులాగ, ప్యాడింగ్ ఆర్టిస్టుల్లాగ ఉన్నారు తప్ప కథలో ఎమోషన్ ని క్యారీ చేస్తూ నడిచిన పాత్రలు మాత్రం లేవు. పాత్రలన్నీ ఒకేతాటి మీద నడుస్తున్నప్పుడు అన్నేసి పాత్రలక్కర్లేదని అనిపిస్తుంటుంది.

ఆఖరికి జాన్వీ కపూర్ పాత్ర కూడా తేలిపోయింది. అతిలోకసుందరి కూతురు తెలుగులో మొదటి సినిమా అనగానే మహిళా ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి. అలాంటప్పుడు ఆమెని రెండవ సగంలో సగభాగానికి సరిపెడితే ఎలా? పోనీ ఆ కాస్తైనా ఆసక్తిగా రాయకపోతే ఎలా!

ఇక సన్నివేశకల్పన విషయానికొస్తే.. ఏవో సీన్లు అలా తెర మీద సమాచారంలా వెళ్తూ ఉంటాయి తప్ప మనసుకి హత్తుకోవు. తెర మీద కథ నడుస్తూ ఉంటుంది..అనుభూతి మాత్రం కలగదు. సినిమా అనేది అనుభూతి ఇవ్వాల్సిన మాధ్యమం. సమాచారం చెప్పే వార్తాచానల్ కాదు కదా!

సినిమా మొత్తంలో రోమాంచితమైన సన్నివేశాలు కానీ, డైలాగ్స్ కానీ లేవు. ప్రధమార్ధమంతా బిల్డప్పులతోటీ, ఓడ దోపిడీ సీన్లతొటీ అలా నింపాదిగా నడుస్తుంది.

ఇంటర్వల్ ముందు వరకు సరైన హుక్ పాయింట్ ఉండదు.

ద్వితీయార్ధంలో కథనం షేడ్ కాస్త మారుతుంది. రెండో ఎన్.టి.ఆర్ పాత్ర తీరుతెన్నులు కాస్త భిన్నంగా ఉండదంతో కాస్తంత రిలీఫ్ అనిపిస్తుంది. కానీ అది ఎంతోసేపు నిలవదు.

గెటప్ సీను కనిపించడంతో కాస్త కామెడీ పండుతుందేమో అనే ఆశ కలగడం సహజం. కానీ అలాంటిదేమీ జరగలేదు. పైగా హీరోయిన్ జాన్వీ ఇంట్రడక్షన్ సెకండాఫులోనే. ఆమె పాత్రకి డెప్త్ లేదు. హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది.

ఎన్.టి.ఆర్ నటనని మాత్రం వంక పెట్టలేం. దేవరగా, వరగా భిన్నమైన వాయిస్ మాడ్యులేషన్ బాడీ లాంగ్వేజ్ కనబరిచాడు. దేవర పాత్ర ఎలా ఉన్నా, వర పాత్రని ఇంకాస్త వినోదంగా మలచి ఉండాల్సింది.

సైఫ్ ఆలి ఖాన్ పాత్ర బానే ఉంది. శ్రీకాంత్ ది అతిథి పాత్ర టైపులో రెండు డైలాగులున్నాయి. మురళి శర్మ, అభిమన్యుసింగ్ కూడా అంతే. చాలానాళ్ల తర్వాత తాళ్లూరి రామేశ్వరి కూడా కనిపించింది.

సాంకేతికంగా చూస్తే అనిరుధ్ నేపథ్యసంగీతం హైలైట్ గా నిలిచింది. టైటిల్ సాంగ్ ని నేపథ్యంలో సందర్భోచితంగా వాడాడు. “చుట్టమల్లే పాట..” వినడానికి, చూడడానికి బాగుంది. ఆయుధపూజ పాట మాత్రం గందగోళంగా అరవ పాట వింటున్నట్టు ఉంది. కెమెరా, గ్రాఫిక్స్ బాగున్నాయి.

ఈ చిత్రంలో ఒరిజినాలిటీ తక్కువ, ఇతర చిత్రాల నుంచి స్ఫూర్తిపొందిన ఎలిమెంట్స్ ఎక్కువ. ద్వితీయార్ధంలో రింగులో ఫైటింగ్ సీన్ చూస్తే “హనుమాన్” లో సీన్లు గుర్తుకొస్తాయి. క్లైమాక్స్ సీనైతే డైరెక్టుగా బాహుబలియే. జాన్వీ కపూర్ గెటప్ అదీ చూస్తే రంగస్థలంలో సమంతకి స్ఫూర్తి అనిపిస్తుంది.

ఇన్స్పిరేషన్స్ ఉన్నా పర్వాలేదు. కంటెంటులో గ్రిప్ లేకపోతేనే సమస్య. ఇంత భారీ బడ్జెట్, తారాగణం పెట్టుకుని కేవలం పాస్ మార్కులు మాత్రమే పడే కథా కథనాలతో ముందుకొస్తే ఎలా? ప్రతి సన్నివేశాన్ని, పాత్రని శ్రద్ధగా చెక్కుతూ స్క్రీన్ ప్లే వండర్ చూపిస్తూ రాసుకుని ఉండాల్సింది.

కంటికి సన్నివేశాలు కదులుతుంటే చాలు.. మనసుకి పెద్ద ఎమోషన్ అందకపొయినా పర్వాలేదు అనుకునే ప్రేక్షకులకి ఈ సినిమాపై కంప్లైంట్ ఉండకపోవచ్చు. సినిమా అంతా చూసాక ఏం గుర్తుంది అని అడిగితే “నరుక్కోవడం” అని ఎక్కువమంది చెప్పొచ్చు. కనుక ఆ రక్తధార నచ్చే వాళ్లని కూడా ఈ చిత్రం ఇబ్బంది పెట్టకపోవచ్చు.

బాటం లైన్: భావోద్వేగంలేని రక్తధార!

83 Replies to “Devara Review: మూవీ రివ్యూ: దేవర”

  1. కామెడీ అని ఏదో ఒక వాక్యం రాసారు, కొరటాల శివ సినిమాలలో కామెడీ ఉండదు, ఉన్నా పండదు, ఎమోషన్స్ మాత్రం బాగా చూపిస్తాడు.

  2. మంచిదే. ఇది కూడా ott అయితే కొంచెం ఈ పాన్ ఇండియా పిచ్చి తగ్గుద్ది. అలాగే సినిమా కి సినిమా కి 3-4 సంవత్సరాలు తీసుకొని ఎదో గోల చెయ్యటం కూడా పోయిద్ది. అసలు పెద్ద హీరో అందరు సంవత్త్సరానికి ఒక రెండు మూడు సినిమాలు తీస్తే తప్ప ఇండస్ట్రీ బాగు పడదు.

  3. కొరటాల సత్తా తగ్గిపోతు వస్తోంది అని సినిమాల మీద మంచి అవగాహన ఉన్న ఎవడికి ఆయున అర్థం అవుతుంది. మిర్చి, శ్రీమంతుడు మాత్రమే బాగుంటాయి . భరత్ అనే నేను అబోవ్ ఆవేరేజ్, జనతా గ్యారేజ్ ఆవేరేజ్ (కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు) తరవాత వచ్చిన ఆచార్య ఇంతకంటే ఉంటుంది అని ఎవరు అనుకోలేదు. దాని ఫలితం అలానే వచ్చింది ప్లాప్ గా. మెగా ఫ్యామిలీ గువ్వ లో వేలు పెట్టారు అని కొరటాల ను సమర్ధించారు , డైరెక్టర్ చెప్పినట్లు చేసే ఎన్టీర్ తో సినిమా ఫలితం తో కొరటాల ఎంత సత్తా అందరికి అర్థం అవుతుంది

  4. అసలు రెండు పార్ట్ లు చేసి సినిమాలు పాడు చేసుకుంటున్నారు..కేవలం డబ్బులు కోసమే చేసుకుంటూ …ఒకే పార్ట్ లో చేస్తే చాలా బెటర్ గా ఉండేది

      1. Rajamouli ki e cinema parts cheyyalo telusu..iddaru star hero lu petti kuda RRR oka part lo ne teesadu..పులి ని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉంది..అసలు హీరో చనిపోవడం ఏంటో.?…

  5. “దేవరగా, వరగా భిన్నమైన వాయిస్ మాడ్యులేషన్ బాడీ లాంగ్వేజ్ కనబరిచాడు.”

    తాతగా కొండ దేవర, కొడుకుగా ‘ర’, మనవడిగా ‘అ’ అని కూడా పాత్రలు ప్రవేశ పెట్టి ఉంటే ఈ నట జీవితానికి సరిపడా series తయారయ్యుండేది. శ్రీదేవికి మరో కూతురు కూడా ఉంది. శ్రీదేవి చెల్లెలు, మహేశ్వరి కూడా ఉన్నారు. వారికీ కూతుళ్లు ఉండే ఉంటారు.

  6. “బ్రిటీష్ వాళ్లు ఆ ఎర్రసముద్రం మీదుగా నిధులు తీసుకుపోతుంటే ఈ గ్రామాల్లోని వీరులు సముద్రంలోకి వెళ్లి ఆ ఓడల్ని దోచుకుని తిరిగి నిధుల్ని వెనక్కి చేర్చేవారు”

    Britain దాకా వెళ్లే ఓడలు సముద్రంలో ఎంత లోపలగా వెళతాయి. ఈ ఊరెధవలు మరపడవలు వేసుకొని అంత దూరం పోయి సొమ్ములు తెచ్చేస్తారా? తెచ్చుకున్న వారు ఆ బంగారంతో బొచ్చెలు చేసుకొని అడుక్కుతింటారా?

  7. Okkappudu cine peddalu antha kalisi cinema ticket rates penchamani mana cm Pedda NTR Daggaraki velithe appudu cm kanisam lekka cheyale tickets rates penchalsina avasaram ledu

    Cinema lo content bagunte janaalu talkies Loki vastharu Ani cheppi panpincharu.

    Kani ippudu vallu cheppinatlu government chesthundi anduke eegaalu kottukuntunnai ee theatre lu

    Okkappudu cinema bagunna bagopoina janaalotho theatre s full gaa nindevi

    Ippudu cine peddalu ku thaggatte ott lu oopu oopesthunnai

  8. గ్రేట్ ఆంధ్ర అనే వెబ్సైట్ డబ్బులు తీసుకుని రాస్తాడు…ఇది జగమెరిగిన సత్యం…నెగెటివ్ కామెంట్స్ కూడా వాడే రాపిస్తాడు డబ్బులు ఇవకపోతే …అందుకే ఈ వెబ్సైట్ చూడాల్సిన అవసరం ఐతే లేదు…సినిమా చూడమని నేను చెప్పడం లేదు…కొంత మంది జెన్యూన్ ఒపీనియన్ ఇచ్చే వాళ్ళు ఇంకా ఉన్నారు అని నా అభిప్రాయం…

    1. మీకు నచ్చక పోతే మరీ ఇక్కడకు వచ్చి దీనిని చదివి, పైగా కామెంట్ పెట్టడం అవసరమంటారా బ్రో

    2. మీకు నచ్చక పోతే మరీ ఇక్కడకు వచ్చి దీనిని చదివి, పైగా కామెంట్ పెట్టడం అవసరమంటారా బ్రో

  9. Overall performance by each individual is very good. The only thing is unnatural climax scene should be averted. Koratala should be taken rest and work for his flaws in scripts, Slow Narrations.

  10. కొరటాల నుంచి కథలో క్రొత్తదనం, అభిమానులను అలరించేంత కథనం, మరీ ముఖ్యంగా కథా-గమనంలో ఫ్లాట్ గా లేని సెకండ్-హాఫ్ రాసి చాలా కాలం అయ్యింది, మిర్చి తరువాత తన కథల్లో క్రొత్తదనం లేదు. కేవలం నటీనటుల నటనతోనే నడిచే కథలతో ఇంకెంత కాలం ఇలా కొనసాగుతాడో!

  11. movie aithe ok. but na point entante…NTR Valla oorlalloni vallani bayapette badulu aa contract ichina vallani champesthe Oori vallu aa pani cheyyaru, Desam loki aayudhalu kuda ravu kada????? alage contract evaraina ivvalanna bayapadatharu kada??? Just asking friends… Please forgive me if i am wrong.

  12. కింద చరణ్ ఫ్యాన్స్ భలే కిల్ చేస్తున్నారు. Next అతని మూవీ ఫ్లాప్ కి వీళ్ళే అవకాశం ఇస్తున్నారు.

  13. తెలుగు దేశం అభిమానులు ఎక్కువగా నెగెటివ్ spread చేస్తున్నారు మెగా వారితో కలిసి ఇక్కడ చూస్తుంటే. అయిన ఒక్కడే బాగానే పైకి వస్తున్నాడు. After 10 days 700 crore పక్కాగా వస్తాయి. అందరూ eno వాడుకోవడమే.😂😂

  14. May be the reviewer needs to update himself otherwise u r not happy with any movie except Rajamoulis and allu arjuns

    Movie should engage u and entertain u since its not real and its artificial world of entertainment

    This movie has all those aspects

    We can enjoy things with positive minds… Too much of negativity will not let enjoy anything

    Surprisingly the movie has so many goosebump scenes… Its only the mind and eyes through which u watch a movie

    Definely watchable

  15. ఆ కొండలేందో, ఆ జాతరేంటో, ఆ అనిరుధ్ గాడి మ్యూజిక్ ఏందో, బాబోయ్ ఈ మధ్య ఇలాంటి రాడ్ మూవీ చూడలేదు, ఖలేజా సినిమా లో బ్రహ్మానందం ను తిట్టినట్టు తిడుతున్నారు కోరాటలని ఎన్టీఆర్ ఫ్యాన్స్

Comments are closed.