బాబు బాటలోనే చినబాబు

ఎన్టీఆర్ ని గద్దె దించి ఉమ్మడి ఏపీకి సీఎం అయిన తరువాత ఆ కొత్తల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు అంటూ ఏపీవ్యాప్తంగా తిరిగేవారు. బాబు వస్తున్నారు అంటేనే అంతా అలెర్ట్ గా ఉండేవారు. ఆలా…

ఎన్టీఆర్ ని గద్దె దించి ఉమ్మడి ఏపీకి సీఎం అయిన తరువాత ఆ కొత్తల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు అంటూ ఏపీవ్యాప్తంగా తిరిగేవారు. బాబు వస్తున్నారు అంటేనే అంతా అలెర్ట్ గా ఉండేవారు. ఆలా ఆయన సడెన్ సర్ప్రైజ్ లు ఇచ్చేవారు. దాంతో ఉద్యోగ వర్గాలలో కలవరం రేగింది. తరువాత కాలంలో వారంతా మొర పెట్టుకున్నారో ఏమో కానీ ఆకస్మిక తనిఖీల బెడద లేకుండా పోయింది.

ఇపుడు ఆయన తనయుడు మంత్రి లోకేష్ కూడా అచ్చం తండ్రి బాటలో నడుస్తున్నారు. ఆయన విశాఖ వచ్చినపుడల్లా రెండు మూడు రోజులు ఉంటున్నారు. ఆయన ఉత్తరాంధ్రాలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు.

పాఠశాలలో వసతి సదుపాయాల గురించి అలా ఆరా తీస్తున్నారు. తాజా పర్యటనలో ఆయన శ్రీకాకుళం నగరంలోకి రెండు పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆకస్మిక తనిఖీలు ఇక మీదట ఉంటాయని అన్నారు. విధి నిర్వహణలో ఎవరైనా తప్పు చేస్తే కఠినమైన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. దాంతో ఉపాధ్యాయ సంఘాలలో కలవరం రేగుతోంది.

ఆకస్మిక తనిఖీలు చేసే పాఠశాలలో ఉపాధ్యాయులు సమయానికి లేకపోతే చర్యలు ఉంటాయని భయపడుతున్నారు. అయితే మంత్రి గారి రాకను ముందుగానే లీక్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు. దాంతో తనిఖీలు చేయవచ్చు కానీ ఆకస్మిక తనిఖీలు అయితే ఉండే అవకాశం లేదని అంటున్నారు.

బాబుకు అప్పట్లో గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో పేరు రావడానికి ఈ ఆకస్మిక తనిఖీలు ఉపయోగపడ్డాయని కుమారుడు కూడా అదే బాటలో వెళ్తున్నారు అని అంటున్నారు.

12 Replies to “బాబు బాటలోనే చినబాబు”

      1. no baby..tokens doesn’t work due heavy demand…may be we can introduce lottery system..dont forget that china babu’s lovely wife is the daughter of Vasu darling (Dishum…Dishum)

  1. ఇందాక నా తెలంగాణ దోస్త్ కాల్ చేసాడు…

    చెప్పురా అనగానే ఏంది తిరుమల లడ్డు సంగతి అని అడిగాడు…

    ఏముంది మావాడి మీద బురద చల్లడానికి చేసే గాండు రాజకీయాలు అన్నాను…

    బురద అనే విషయం పక్కన పెట్టు అసలు ఆ రేటుకు నెయ్యి రావడం ఏంది అది లడ్డులో కలపడం ఏంది ??? అని అంటూ ఈ లెక్కన ముప్పై నలభై ఏళ్ల నుండి మనం కల్తీ నెయ్యితోనే లడ్డూలు తింటున్నాం అని తేల్చేశాడు వాడు…

    చంద్రబాబు చేసిన పెంట పనికి తిరుమల లడ్డు అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చింది,ఆ లడ్డుకు ఇక మీదట గతంలోలా ప్రత్యేకమైన స్థానం ఉండదు, కోల్పోయింది అనే భావన కలిగింది నాకు…

    ప్రతీది రాజకీయాలతో ముడిపెడితే వేల సంవత్సరాల నమ్మకాలు,వాటి విలువలు మంట కలిసి పోతాయి అనే దానికి చంద్రబాబు నీచ రాజకీయాలు ఒక ఉదాహరణ…

    లడ్డు విషయంలో లేనిపోని రాద్దాంతం చేసిన వారిని శిక్షించు స్వామి 🙏

    నువ్వున్నావని నిరూపించు స్వామి 🙏

  2. అడ్డంగా బుక్కైన మాజీ సీఐడీ AP CID EX Chief Sunil Kumar

    గనులశాఖ మాజీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి అరెస్ట్

    .

    where is this news?

Comments are closed.