కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలను ప్రకటిస్తుంటే కమలం పార్టీ అగ్గి మీద గుగ్గిలం అయిపోతూ ఉంటుంది. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ పప్పు బెల్లాలను పంచుతోందని, ఉచితాలకు మోడీ వ్యతిరేకం అని, ఉచితాల వల్ల ప్రజలు సోమరిపోతుల్లా మారిపోతారని.. ఇలా కమలం పార్టీ వాదులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే పైకి ఇలా మాట్లాడుతున్నా.. కమలం పార్టీ కూటమి రాజకీయాల్లో ఉచితాల మీదే బండి లాగిస్తూ ఉంది.
ఏపీలో బీజేపీ భాగస్వామ్యంలో ఉన్న కూటమే అధికారంలో ఉంది. అక్కడ సూపర్ సిక్స్ అంటూ బోలెడన్ని ఉచిత హామీలను ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అది వేరే సంగతి!
ఏపీలో బోలెడన్ని ఉచిత హామీలున్నాయి. అవన్నీ కాంగ్రెస్ మెనిఫెస్టో నుంచి కాపీ కొట్టినవే. తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి హామీలుగా ఇచ్చింది. ఆ హామీలకు బీజేపీ పూచీ లేదంటూ ఎన్నికల ముందు కాస్త హడావుడి చేశారు. ఇప్పుడు వాటి విషయంలో బీజేపీ కిక్కురుమనడం లేదు!
కట్ చేస్తే.. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ఉచితాలకు తెరలేపింది. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో అక్కడ ఈ కూటమికి గట్టి ఝలక్ తగిలింది. 48 లోక్ సభకు సీట్లకు గానూ 31 సీట్లలో వీరి వైరి వర్గం వారు విజయాలు సాధించారు. త్వరలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలూ జరగాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఉచితాలకు తెరలేపింది!
ఉన్న ఫలంగా మహారాష్ట్రలోని బీపీఎల్ కుటుంబాల్లోని మహిళలకు నెలకు తలా 1500 రూపాయలు వేసే పథకాన్ని మొదలుపెట్టారు! ఇది పేద మహిళలకు ఎంతో మేలు చేస్తుందంటున్నారు సీఎం షిండే. తాము ప్రజలకు ఉచితంగా డబ్బులు ఇస్తే ప్రత్యర్థులు చూడలేకపోతున్నారంటూ ఆయన వాపోతున్నారు. అంతే కాదట, ఇది శాంపిల్ మాత్రమేనట! వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమనే గెలిపిస్తే ఈ 1500 మొత్తాన్ని మూడు వేల రూపాయలు చేస్తారట! ఇదొక్కటే కాదు, ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇవ్వడం, చదువుకోవాలనే అమ్మాయిలకు ఫీజుల చెల్లింపుతో సహా.. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత హామీలను ఉన్నఫలంగా అమలు చేస్తామంటున్నారు షిండే.
అతి త్వరలో ఎన్నికల నేపథ్యంలో.. ఇలా షిండే ఉచితాలకు తెరలేపారు. ఈ ఉచితాలు ఎన్నికల్లో లబ్ధి చేకూర్చకపోవా అన్నట్టుగా బీజేపీ కూడా ఆశలు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల్లో భారీ డ్యామేజ్ జరిగిన రాష్ట్రంలో ఇలా ఉచితాల ద్వారా లబ్ధి పొందాలనే తాపయత్రం కనిపిస్తోంది కాషాయ కూటమిలో! మరి ఉచితాల విషయంలో కూడా బీజేపీది ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పాలసీ లాగుంది!
జగనన్న ఇచ్చిన దాంట్లో ఇది ఇరవై శాతం అయినా అవుతుందా?
కాంగ్రెస్, ఇతర పార్టీ లతో పోలుస్తారు ఏమిటి? మహారాష్ట్ర లో ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ అన్నారా? తెలంగాణా, కర్ణాటక లలో ఆల్రెడీ అమలు చేస్తున్నారు కదా?
ఈమాత్రం కూడా చేయకుండ మడి కట్టుకొని మీ తల్లి కాంగ్రెస్ కి అధికారం అప్ప చెప్పేయ్యాలా?
నీచుడు జగన్ రెడ్డి మధ్య నిషేధం , జాబ్ కేలండర్ , ప్రత్యేక హోదా , పోలవరం , మూడు రాజధానులు అని ఒక్కటి నెరవేర్చలేదు వేరే వాళ్ళ మీద ఎందుకు ఏడుపు…..
పందికి పన్నీరు నచ్చుతుంది, అత్తరు ఇస్తే చీ కొడుతుంది
ఎదవలకు ఓటేసే ఎదవల ఓట్లు కావాలంటే, ఎదవగా దిగజారాల్సిందే !
నువ్వే ఒక ఎదవకు మాలీసు చేసేవాడివి, నీ నోటంట ఈ ఎదవ సూక్తిముక్తావళి దేనికి ?
in all free schemes BJP free schemes are different🤣🤣
Call boy jobs available 9989793850