ప్ర‌ధానిని చేస్తామ‌న్నారు.. అలాంటి ఉద్దేశం లేదు!

త‌న‌ను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ముందుకు రావాల‌ని, తాము మ‌ద్ద‌తు ఇస్తామంటూ ప్రతిప‌క్షాల నుంచి త‌న‌కు ప్ర‌పోజ‌ల్స్ వ‌చ్చాయ‌ని చెప్పారు కేంద్ర‌మంత్రి, క‌మ‌లం పార్టీ నేత నితిన్ గ‌డ్క‌రీ. 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు,…

త‌న‌ను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ముందుకు రావాల‌ని, తాము మ‌ద్ద‌తు ఇస్తామంటూ ప్రతిప‌క్షాల నుంచి త‌న‌కు ప్ర‌పోజ‌ల్స్ వ‌చ్చాయ‌ని చెప్పారు కేంద్ర‌మంత్రి, క‌మ‌లం పార్టీ నేత నితిన్ గ‌డ్క‌రీ. 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల త‌ర్వాత కూడా అలాంటి ప్ర‌తిపాద‌న‌లు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చాయ‌ని, వాటిని త‌ను తిర‌స్క‌రించిన‌ట్టుగా ఆయ‌న ప్ర‌క‌టించారు.

మోడీ కి బ‌దులు త‌న‌ను ప్ర‌ధాని అభ్య‌ర్థిత్వం ప్ర‌క‌టించుకోవాల‌ని విప‌క్షాలు త‌న‌ను సంప్ర‌దించిన‌ట్టుగా ఆయ‌న చెప్పారు. త‌ద్వారా బీజేపీలో చీలిక తీసుకు వ‌చ్చి, విప‌క్షాల మ‌ద్ద‌తుతో గ‌డ్కరీ ప్ర‌ధాని కావాల‌నేది ఇక్క‌డ వ్యూహం కావొచ్చు. అయితే త‌న‌కు ఉన్న బాధ్య‌త‌ల‌తో త‌ను సంతృప్తిగా ఉన్న‌ట్టుగా గ‌డ్క‌రీ ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం మోడీ కేబినెట్లో ఉప‌రిత‌ల ర‌వాణా, హైవేస్ మినిస్ట‌ర్ గా ఉన్నారు గ‌డ్క‌రీ. త‌ను ఆర్ఎస్ఎస్ స‌భ్యుడిని అని, బీజేపీ కార్య‌క‌ర్త‌ను అని .. ఒక‌వేళ త‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఉన్నా లేక‌పోయినా ఒక‌టేనంటూ గ‌డ్క‌రీ చెప్పుకొచ్చారు. త‌ను నిబ‌ద్ధ‌త గ‌ల కార్య‌క‌ర్త‌గా ప‌ని చేస్తానంటూ ఆయ‌న ప్ర‌క‌టించుకున్నారు. త‌న‌కు ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని అధిష్టించాల‌నే ల‌క్ష్యం కానీ, ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి కానీ లేవ‌ని, ఉన్న బాధ్య‌త‌ల‌తో త‌ను సంతృప్తిగా ఉన్న‌ట్టుగా ఈ సీనియ‌ర్ బీజేపీ నేత ప్ర‌క‌టించారు.

త‌ద్వారా త‌న‌కు ప్ర‌ధాని క‌ల‌లు ఏమీ లేవ‌ని ఈయ‌న అంద‌రికీ స్ప‌ష్టం చేసిన‌ట్టుగా ఉన్నారు. గ‌డ్క‌రీ ప్ర‌ధాన‌మంత్రి పీఠం గురించి బాహాటంగా కాక‌పోయినా, అంత‌ర్గ‌తంగా చ‌ర్చ‌లు అయితే జ‌రుగుతూ వ‌చ్చాయి. మోడీకి బీజేపీలో గ‌డ్క‌రీ నుంచినే పోటీ అన్న‌ట్టుగా ఆఫ్ ద రికార్డు ప్ర‌చారాలు చాలానే జ‌రిగాయి. మోడీ కూడా గ‌డ్క‌రీని పోటీగా ఫీల‌వుతున్నాడ‌నే ప్ర‌చార‌మూ జ‌రిగింది.

ఇటీవ‌ల గ‌డ్క‌రీని మ‌హారాష్ట్ర నుంచి ఎంపీగా ఓడించే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌నే టాక్ కూడా న‌డిచింది. అయితే అక్క‌డ నుంచి గ‌డ్క‌రీ ఓడిపోలేదు కానీ, బీజేపీ ప‌లు ఎంపీ సీట్ల‌ను కోల్పోయింది. గడ్క‌రీని ఓడించాల‌ని ఢిల్లీ బీజేపీ నుంచినే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని, అయితే ఆర్ఎస్ఎస్ ఆయ‌న‌ను గెలిపించుకుంద‌నే టాక్ ఒక‌టి ఆఫ్ ద రికార్డుగా న‌డుస్తూ వ‌స్తోంది. ఇలాంటి నేప‌థ్యంలో అన్ని ఊహాగానాల‌కూ గ‌డ్క‌రీ తెర‌దించే ప్ర‌య‌త్నం చేశారు. త‌నకు ప్ర‌ధాని కావాల‌నే త‌ప‌న ఏదీ లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ప్ర‌స్తుతం గ‌డ్క‌రీ వ‌య‌సు 67 సంవ‌త్స‌రాలు. మోడీ వ‌య‌సు 74 సంవ‌త్స‌రాలు. 75 సంవ‌త్స‌రాలు నిండిన వారు కేంద్ర‌మంత్రి ప‌ద‌వుల‌కు కూడా అన‌ర్హులు అన్న‌ట్టుగా.. అది రాజ‌కీయాల‌కు రిటైర్మెంట్ ఏజ్ అన్న‌ట్టుగా బీజేపీ గ‌త ప‌దేళ్ల‌లో ప‌లువురు సీనియ‌ర్ల‌ను సాగ‌నంపింది. మ‌రి మోడీకి అదే నియ‌మం వ‌ర్తిస్తుందో లేదో బ‌య‌టి వారికి క్లారిటీ లేదు. వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌ర్ 17తో మోడీకి 75 యేళ్ల నిండుతాయి. మ‌రి అప్పుడు గ‌డ్క‌రీ వంటి వారికి అవ‌కాశం వ‌స్తుందో లేక మోడీ హ‌యాంలో మొద‌లైన 75 యేళ్ల వ‌య‌సు నిబంధ‌న ఆయ‌న‌కు వ‌ర్తించ‌దో!

9 Replies to “ప్ర‌ధానిని చేస్తామ‌న్నారు.. అలాంటి ఉద్దేశం లేదు!”

  1. In 2024 election campaign Amit and Nadda reiterated that Modi will complete his 5yrs term mean 75yrs rule won’t be applicable to him. Let us watch the political drama that unfolds when Modi turns 75.

  2. మోడీ గారి జాతీయ రాజకీయం మొదలు పెట్టిన తర్వాత మాత్రమే ఈయన నాగపూర్ లోకసభ పోటీ మొదలు పెట్టాడు, అంతవరకూ వేరే అభ్యర్థి పోటీ చేసేవాడు.

  3. గడ్కరీ ని తమ వైపు లాక్కోగలం అనే ఆలోచన కాంగ్రెస్ కూటమి కి ఎందుకు వచ్చిందో? గడ్కరీ కొన్ని టప్పుడు పాలసీ లు తీసుకువస్తున్నాడు. 15 ఏళ్లకే ఆటోబిల్స్ స్క్రాప్ చెయ్యడం, CNG వాహనాలు, ఇథనాల్ పాలసీ లాంటివి.

  4. 2014 కి ముందు నాగపూర్ లో బీజేపీ పెద్ద గెలవలేదు, మోడీ గారి వల్ల నే మహారాష్ట్ర లో నాలుగో స్థానం లో ఉన్న బీజేపీ మొదటి స్థానానికి వెళ్ళింది. సొంత రాష్ట్రంలో పార్టీ బలం పెంచలేని వాళ్ళకి ప్రధాని పదవి ఆరాటం.

  5. ఇంతకీ గడ్కరీని నాగపూర్ లో ఓడిస్తానికి ఎవరు ప్రయత్నించారో వాళ్ళ పేర్లు నీ చెవిలో ఎవరైనా చెప్పితే, కొద్దిగా మా చెవిలో కూడా ఊదు.

    (2018 లో ప్రపంచనాయకుడు మోడీతో విభేధించి బయటకు పోయిన తర్వాత పచ్చమీడియా RSS వాళ్ళు మోడీని దించేసి గడ్కరీని ఎక్కిస్తున్నారని ప్రచారం చేసారు. ఇప్పుడు బులుగు మీడియా ప్రచారం మొదలెట్టీంది అన్నమాట.)

    ఏ పార్టీ అయినా గెలిపించేవాళ్ళకు పట్టం కడుతుంది తప్ప, ఎవడికి పడితే వాళ్ళకు కట్టుతుందా ?

    I.N.D.I తడికలఫ్రంట్ ఆ ఆశ చూపి లాగేద్దామని ప్రయత్నించారు, నేను ఒప్పుకోలేదు అని అంటే, నువ్వు ఏకంగా గడ్కరీని ఓడిస్తానికే ఎవడో గొట్టంగాళ్ళు ప్రయత్నించారని అపానవాయువు వదిలావు వెధవా !

Comments are closed.