4న ‘మిస్టర్ సెలెబ్రిటీ’

ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త నీరు ప్రవహిస్తోంది. కొత్త తరం హీరోలు, దర్శకులు భిన్న కథలు, కాన్సెప్టులతో హిట్లు కొడుతున్నారు. ఇక సోషల్ మీడియా యుగంలో సెలెబ్రిటీల మీద రకరకాల గాసిప్‌లు స‌ర్వసాధారణమయ్యాయి. ఇలాంటి ఓ…

ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త నీరు ప్రవహిస్తోంది. కొత్త తరం హీరోలు, దర్శకులు భిన్న కథలు, కాన్సెప్టులతో హిట్లు కొడుతున్నారు. ఇక సోషల్ మీడియా యుగంలో సెలెబ్రిటీల మీద రకరకాల గాసిప్‌లు స‌ర్వసాధారణమయ్యాయి. ఇలాంటి ఓ ట్రెండీ, సెన్సిబుల్ టాపిక్ మీద మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా రాబోతోంది.

ఈ చిత్రంతో పరుచూరి వారసుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా.. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, పాటలు, పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను పరుచూరి బ్రదర్స్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 4న ఈ చిత్రం రాబోతోందని, దర్శక నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని తెరకెక్కించారని పరుచూరి బ్రదర్స్ అన్నారు.

తమ మనవడు హీరోగా పరిచయం కాబోతున్నాడని, ప్రేక్షక దేవుళ్లంతా కూడా ఆదరించి మంచి విజయాన్ని కట్టబెట్టాలని కోరారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని పరుచూరి బ్రదర్స్ అన్నారు.

3 Replies to “4న ‘మిస్టర్ సెలెబ్రిటీ’”

Comments are closed.