హ్యాపీనెస్ అనేది క్షణికమైనది, అది కాసేపే ఉండవచ్చు! ఆ వెంటనే మరో ఆలోచన ఉన్న ఆనందాన్ని ఆవిరి చేయవచ్చు, హ్యాపీగా అనిపించిన సమయం కూడా గడిచిపోవచ్చు! మరి మనిషి హ్యాపీగా ఉండాలని అనుకుంటాడు, అలాంటి హ్యాపీనెస్ ఎప్పుడో అరుదుగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. అలాంటి అరుదైన క్షణం కూడా క్షణికమైనది అనేది నిజం. కాబట్టే.. మనిషి ఆనందాన్ని వెదుక్కోవడం కన్నా తృప్తిని వెదుక్కోవడం మంచిదనేది ఒక ఫిలాసఫీ!
హ్యాపీనెస్ క్షణికమైనదైతే, తృప్తి అనేది దీర్ఘమైన ఆనందాన్ని ఇవ్వగలదు! మరి అలాంటి స్థితిని అనుభవించగలవారెవ్వరు అంటే.. శాటిస్ఫ్యాక్షన్ అనేది అందరికీ ఉండే లక్షణం ఏమీ కాదు. తృప్తిగా జీవించగలగడం అందరికీ సాధ్యం కాదు. జీవితంలో ఎంతో అనుభవించి ఉన్న వారు అయినా, ఎంతో సంపాదించిన వారు కూడా తృప్తిగా ఉంటారనుకోవడానికి ఏమీ లేదు! మరి ఇంతకీ ఎలాంటి లక్షణాలు ఉన్న వారు అలాంటి స్థితిలో ఉంటారంటే..!
కృతజ్ఞతాభావం!
జీవితంలో అప్పటి వరకూ సాధించిన దాని మీద కానీ, సంపాదించిన దాని మీద కానీ, పొందిన అనుభవాల విషయంలో అయినా.. కృతజ్ఞతాభావం ఉందంటే, అలాంటి వారు సంతోషంగా జీవిస్తున్నట్టే! వీరి ఆనందం కేవలం క్షణికమైనది కాదు. ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నా.. ఉన్నందాంతో తృప్తి పడటం, ఇంకా జీవితంలో ఎదిగే అవకాశం ఉన్నా.. అప్పటి వరకూ ఎదిగిన తీరు పట్ల కనీసం తనను తాను అభినందించుకోవడం గ్రాటిట్యూడ్ ఉండే వారి లక్షణాలు.
ఎంపతీ!
ఇతరుల జీవితాలను గమనిస్తూ వారిని అర్థం చేసుకునే తత్వం, వారి తరఫున ఫీల్ కాగలగడం గొప్ప లక్షణం. ఎవడి ఖర్మ వాడిదన్నట్టుగా ఆలోచించడం తాత్వికత అనుకోకుండా, అవతలి వారి బాధను మీరు అర్థం చేసుకోగలగడం, వారి కోసం చింతన చేయగల తత్వం ఉండటం నిస్సందేహంగా మరో గొప్ప లక్షణం.
సరిహద్దులను సెట్ చేసుకోవడం!
గోల్స్ సెట్ చేసుకోవడంలో అయినా, కోపాన్ని, ప్రేమను చూపడంలో అయినా.. తమ సరిహద్దులేమిటో ఎరిగి నడుచుకునే వారు నిస్సందేహంగా సంతోషంగా ఉంటారు. తాము ఎదగాలనుకుంటున్న స్థాయి విషయంలో కూడా ఇలాంటి వారు సరిహద్దులను కలిగి ఉంటారు. కోపాన్ని, ప్రేమను చూపే మోతాదుల విషయంలో కూడా అర్థం చేసుకుని స్పందిస్తారు.
పోతేపోనీ..!
ఏ విషయంలో తీవ్రమైన పట్టు పట్టరు. అతిగా దాని గురించే స్పందించరు. సాధించాలనే పట్టు ఉన్నా.. అలా జరగని పక్షంలో తమకు తాము సమాధానం ఇచ్చుకోగలగాలి. జరగలేదని.. తీవ్రంగా మధనపడిపోవడం వల్ల అశాంతి రేగుతుంది తప్ప అనుకున్నదైతే జరగకపోవచ్చు. శ్రద్ధాసక్తులు ప్రయత్నం మీద ఉండాలి కానీ, జరగలేదని బాధపడటం మీద కాదు. ప్లాన్ బీతో ఉండటమో, అతిగా స్పందించకపోవడమో వీరి లక్షణం.
క్షమించే తత్వం!
అందరూ తనలాగే ఉండాలి అని కానీ, అంతా తనలాగే ఉంటారనుకునే తత్వం ఇలాంటి వారికి ఉండదు. మనుషులను తేలికగా క్షమించే తత్వాన్ని కలిగి ఉంటారు. పగలు, కసిలు మనసులో పెట్టుకుని అవకాశం కోసం ఎదురుచూసే నైజం ఉండదు. అవతలివారు తమ విషయంలో నెగిటివ్ గా స్పందించిన దాఖలాలు ఉన్నప్పటికీ, అలాంటి విషయాలను మనసులో పెట్టుకోకుండా తమ పాజిటివిటీనే చాటే తత్వం వీరి సొంతం అయి ఉంటుంది.
Call boy jobs available 9989798350
vc estanu 9380537747