మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!

భారతీయ సినిమాకు విశిష్ట సేవలందించిన వారికి ఇచ్చే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది. ఈ మేరకు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి అక్టోబర్ 8న పురస్కారాన్ని అందుకోబోతున్నారని కేంద్ర మంత్రి…

భారతీయ సినిమాకు విశిష్ట సేవలందించిన వారికి ఇచ్చే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది. ఈ మేరకు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి అక్టోబర్ 8న పురస్కారాన్ని అందుకోబోతున్నారని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన ట్వీట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

“మిథున్ దా యొక్క ప్రాముఖ్యమైన సినీ ప్రయాణం తరం తరాల వారికి ప్రేరణగా నిలుస్తుంది. దాదా సాహెబ్ ఫాల్కే ఎంపిక కమిటీ, భారతీయ సినిమాకి చేసిన ప్రత్యేకమైన కృషి కోసం మిథున్ చక్రవర్తికి ఈ పురస్కారాన్ని ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది” అంటూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు.

మిథున్ చక్రవర్తి 1976లో తన సినీ ప్రస్థానాన్ని ఆరంభించారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే కొన్ని మూవీలకు నిర్మాతగా వ్యవహరించారు. “డిస్కో డాన్సర్,” “జగీర్,” “కస్మా పాయిదా చేసే వారికీ,” “హమ్సే హై జమానా,” “పతి పత్ని అవర్ తవైఫ్” వంటి సినిమాలు మిథున్‌కు మంచి పేరు తెచ్చాయి.

ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన మిథున్ చ‌క్ర‌వ‌ర్తి బెంగాల్‌లో జ‌రిగిన‌ అసెంబ్లీ, ఎంపీ ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ద‌తుగా పెద్ద ఎత్తున్న ప్ర‌చారం చేశారు. ఇదే ఏడాది జనవరిలో మిథున్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. తాజాగా ఆయ‌న‌కు దాదా సాహెబ్ ఫాల్కే ద‌క్కింది.

9 Replies to “మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!”

    1. వాడు ఆ రజనీ ఒకటే తాను.. రాజకీయం పేరు చెప్తే గుండె నొప్పి వచ్చి ఆసుపత్రి లో చేరతారు…

  1. అసలు ఇలాంటివి ట్విటర్ వేదికగా ప్రకటించడం ఏమిటి? ఏదో నేను వెనకపడిపోలేదు.. సాంకేతికంగా ఈ పిచ్చి యుగం లో యువత తొ పాటు దూసుకుపోతున్నాను.. అనె స్వయం ప్రకటిత వెర్రి కాకపోతే…

Comments are closed.