ఎక్స్ క్లూజివ్: బన్నీ- త్రివిక్రమ్ ఫాంటసీ!

మైథలాజికల్ టచ్ సోషియో ఫాంటసీ సినిమా అని. త్రివిక్రమ్ ఓ అద్భుతమైన మైథలాజికల్ టచ్ వుండే లైన్ ను బన్నీ కి చెప్పినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా ఫిక్స్ అయిపోయినట్లే. పుష్ప 2 తరువాత చేయబోయే సినిమా అదే. అట్లీ.. ఇంకా ఇంకా చాలా పేర్లు వినిపించినా, సినిమా మాత్రం త్రివిక్రమ్ తోనే. ఈ విషయాన్ని ఎక్స్ క్లూజివ్ గా కొన్ని రోజుల క్రితం గ్రేట్ అంధ్ర వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంతకీ త్రివిక్రమ్ ఈసారి ఎలాంటి సినిమా చేయబోతున్నారు.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి మూడు హిట్ లు కొట్టిన తరువాత చేసే సినిమా. భారీ అంచనాలు వుంటాయి. అలాగే ఇప్పుడు సినిమా మారిపోయింది. పాన్ ఇండియా సినిమా, ఎవరికి వారు ఓ వరల్డ్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ వంతు వచ్చింది.

త్రివిక్రమ్ ఇప్పుడు తన సినిమాను తెలుగు రాష్ట్రాల బోర్డర్ దాటించాలి. అలాంటి రేంజ్‌ కథ వండాలి. ఇప్పటి వరకు త్రివిక్రమ్ వండిన కథలు అన్నీ మన ఇంట్లోనే మన పాత్రల చుట్టూ గుడు గుడు గుంచం అన్నట్లు తిరిగాయి. తిప్పి తిప్పి అవే కథలు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు వాటితో పని జ‌రగదు. అ క్లారిటీ త్రివిక్రమ్, బన్నీ కి వుండే వుంటుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి బన్నీ సన్నిహితుడు బన్నీ వాస్ చాలా చెప్పారు. వందల కోట్ల ప్రాజెక్ట్ అని, దీనికి డబ్బులు కావాలంటే చాలా పెద్ద సంస్థల ఫండింగ్ కావాలని, ప్రీ ప్రొడక్షన్ కే నెలలు పడుతుందని.. ఇలా చాలా చెప్పారు.

అలాంటి ప్రాజెక్ట్ కు కథేంటీ అని అరా తీస్తే తెలిసింది ఏమిటంటే… మైథలాజికల్ టచ్ సోషియో ఫాంటసీ సినిమా అని. త్రివిక్రమ్ ఓ అద్భుతమైన మైథలాజికల్ టచ్ వుండే లైన్ ను బన్నీ కి చెప్పినట్లు తెలుస్తోంది. అది కూడా చానాళ్ల క్రిందటే. దానికి బన్నీ ఓకె చెప్పడం, అప్పటి నుంచి అదే లైన్ ను కథగా మార్చే పనిలో బిజీగా వుండడం జ‌రుగుతోంది. ఇప్పుడు అదే సినిమాగా మారబోతోంది. ఈ సినిమాకు నాలుగు నుంచి అయిదు వందల కోట్లు ఖర్చు వుంటుంది.

సినిమాను హారిక హాసిని- గీతా కలిసి సంయుక్తంగా నిర్మిస్తాయి.

3 Replies to “ఎక్స్ క్లూజివ్: బన్నీ- త్రివిక్రమ్ ఫాంటసీ!”

  1. Bunny anavasaranga risk chestunnadu ee donga guruji tho chesi…Pushpa tho vacchi na craze ni nilapali ante Atlee thone workout avtundi…endukante Jawan tho already Hindi lo proved…Tamil lo Atlee choosukuntadu,malyalam, Telugu,kannada AA craze elano vuntundi..ee guruji tho teeste bokke

Comments are closed.