ఎక్స్ క్లూజివ్- బన్నీ.. త్రివిక్రమ్ ఫిక్స్!

పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తారు. ఇది చిరకాలంగా వినిపిస్తున్న ప్రశ్న. రకరకాల గ్యాసిప్స్. లేటెస్ట్ గా అయితే బలంగా వినిపించిన పేరు అట్లీ. చాలా మంది అట్లీ.. అల్లు…

పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తారు. ఇది చిరకాలంగా వినిపిస్తున్న ప్రశ్న. రకరకాల గ్యాసిప్స్. లేటెస్ట్ గా అయితే బలంగా వినిపించిన పేరు అట్లీ. చాలా మంది అట్లీ.. అల్లు అర్జున్ పేరు కలిపి ముహుర్తాలు పెట్టేసారు. నిర్మాతలను డిసైడ్ చేసేసారు. అదిగో క్లాప్, ఇదిగో సినిమా అన్నారు. అంతా బాగానే వుంది. కానీ ఇప్పట్లో అట్లీ- అల్లు అర్జున్ కాంబినేషన్ వుండదు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురములో.., తరువాత మళ్లీ మరోసారి త్రివిక్రమ్- బన్నీ కాంబినేషన్ రిపీట్ కాబోతోందని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని భారీ సబ్జెక్ట్ తయారు చేసారని, దానికి ప్రీ ప్రొడక్షన్ నే ఏడాది పడుతుందని హీరో బన్నీ సన్నిహితుడు బన్నీవాస్ గతంలో చాలా అంటే చాలా ఇంటర్వూల్లో చెప్పారు. అదో అద్భుతమైన సినిమా అవుతుందని క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ను ఏప్రియల్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు విశ్వసనీయవర్గాల బోగట్టా. డిసెంబర్ వరకు పుష్ప 2 పనులు వుండనే వుంటాయి. రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకుని త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తారు బన్నీ.

ఏదో అద్భుతం జ‌రిగితే తప్ప, బన్నీ తరువాత సినిమా త్రివిక్రమ్ తోనే అని ఫుల్ క్లారిటీగా తెలుస్తోంది.

5 Replies to “ఎక్స్ క్లూజివ్- బన్నీ.. త్రివిక్రమ్ ఫిక్స్!”

Comments are closed.