మారుతి అందించలేని చిన్న సినిమా

ఈ రోజుల్లో, బస్ స్టాప్, లవర్స్, రొమాన్స్ లాంటి అడల్ట్ టచ్ కామెడీ సినిమాలు సక్సెస్ ఫుల్ గా అందించారు దర్శకుడు మారుతి. ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజు…

ఈ రోజుల్లో, బస్ స్టాప్, లవర్స్, రొమాన్స్ లాంటి అడల్ట్ టచ్ కామెడీ సినిమాలు సక్సెస్ ఫుల్ గా అందించారు దర్శకుడు మారుతి. ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజు పండగే వరకు మీడియం బబ్జెట్ లో మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు అందించారు. కానీ తన బ్యానర్ ఇచ్చి, తన కాన్సెప్ట్ ఇచ్చి మాత్రం సరైన మంచి సక్సెస్ ఫుల్ సినిమా ఒక్కటి కూడా అందించలేకపోయారు.

కొత్త నిర్మాతలకు తన బ్యానర్ ఇచ్చిన ప్రతి సినిమా డిజాస్టరే. ప్రతి నిర్మాత కుదేలే. మారుతి బ్యానర్ ఇవ్వకుండా, తనే నిర్మాణ భాగస్వామిగా వున్న బేబి దీనికి మినహాయింపు.

లేటెస్ట్ గా భలే వున్నాడే అనే చిన్న సినిమాకు కాన్సెప్ట్ అందించి, బ్యానర్ జోడించారు. అది కూడా బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసింది. మత్తువదలరా2, భలే వున్నాడే ఈ రెండు సినిమాలు మారుతున్న జ‌నరేషన్ అభిరుచులకు రెండు లైవ్ ఎగ్జాంపుల్స్. భలేవున్నాడే సంప్రదాయ అడల్ట్ టచ్ కామెడీ, ప్లస్ లవ్, పాటలు వగైరా. మత్తువదలరా జ‌స్ట్ పెద్దగా కథ లేకుండానే, వైరల్ ఫన్ ను అందించిన సినిమా.

మారుతి సమర్పించే సినిమాల్లో మరో సమస్య ఏమిటంటే నిలయ విద్వాంసులు అంతా వచ్చి కూర్చుంటారు. ఏదో వాళ్లను పోషించడం కోసమే అన్నట్లు వుంటుంది నిర్మాత ఖర్చు. కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది. కాలానుగుణంగా కామెడీ మారాలి. అందించేవారు మారాలి. ఈ పాయింట్ ను మారుతి గమనించాలి. అంతకన్నా ముందుగా కథలు కాన్సెప్ట్ లు ఇవ్వడం వరకు ఓకె.

బ్యానర్ ఇచ్చేయడం తగ్గించాలి. రాజా సాబ్ లో అయినా ఈ మారుతి అస్థాన నిలయ విద్వాంసులు వుండకుండా వుండారని అశిద్దాం.

3 Replies to “మారుతి అందించలేని చిన్న సినిమా”

Comments are closed.