ఈ పోస్టు కూడా పవన్ కోసమేనా?

కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు నటుడు ప్రకాష్ రాజ్. ప్రారంభంలో పవన్ పేరును ప్రస్తావిస్తూ, అతడ్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ వేసిన ఈయన, ప్రస్తుతం పవన్ పేరు…

కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు నటుడు ప్రకాష్ రాజ్. ప్రారంభంలో పవన్ పేరును ప్రస్తావిస్తూ, అతడ్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ వేసిన ఈయన, ప్రస్తుతం పవన్ పేరు ప్రస్తావించకుండా అతడిపై సెటైర్లు వేస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన అదే పని చేశారు.

అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడు, లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిన కొటేషన్స్ ను గుర్తుచేశారు ప్రకాష్ రాజ్. “నువ్వు మైనారిటీల్లో ఒకడివి అయినప్పటికీ నిజం ముమ్మాటికీ నిజమే” అనేది అందులో ఒక పోస్ట్.

ఇక రెండో కొటేషన్ కింద, “మనకు గుళ్లు, గురుద్వారాలు, మసీదులు, చర్చిలు ఉన్నాయి. కానీ వీటిని ఎప్పుడూ రాజకీయాల్లోకి లాగలేదు. ఇదే భారత్, పాకిస్థాన్ మధ్య తేడా.” అంటూ లాల్ బహదూర్ శాస్త్రి కొటేషన్ గుర్తుచేశారు.

ఈ రెండు కొటేషన్స్ తో ఆయన పవన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించినట్టయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నడుస్తున్న వివాదాన్ని పవన్ మరింత ఎగదోస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రకాష్ రాజ్ కు నచ్చడం లేదు. ఇప్పటికే దేశంలో తగినన్ని మత ఘర్షణలున్నాయని, కొత్తవి పుట్టించొద్దని ఆయన పవన్ కు సూచించారు.

లడ్డూ వివాదం తెరపైకొచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ అపర భక్తుడిలా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రాయశ్చిత్త దీక్ష అంటూ ఆయన దీక్ష చేపట్టారు. గుడి మెట్లు కడిగారు, డ్రెస్సింగ్ మార్చేసి సాధువులా మారారు. కొన్ని రోజులుగా లడ్డూ ఇష్యూ తప్ప ఇంకేం మాట్లాడ్డం లేదు. ఆయన గెటప్, డైలాగ్స్ పై పరోక్షంగా పంచ్ వేశారు ప్రకాష్ రాజ్. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అంటూ సెటైర్ వేశారు. జరిగిందేదో జరిగింది ఇక చాలు, ప్రజల కోసం చేయవలసిన పనులు చూడమని సూచించారు.

ఇప్పుడిలా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి కొటేషన్స్ తో పరోక్షంగా సెటైర్లు వేశారు. ప్రకాష్ రాజ్ వేసిన ప్రతి పోస్టుపై పవన్ అభిమానులు ద్వేషం చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ నటుడిపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ నడుస్తోంది. ఈ ఇష్యూకు సంబంధించి, కనీసం భగవంతుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

8 Replies to “ఈ పోస్టు కూడా పవన్ కోసమేనా?”

  1. గతం లో RGV గారు అని తనే ఒక అపరమేధావి భావించి ఇంకొకళ్ళ మీద ముఖ్యం గా పవన్ గారి మీద బురద జల్లి ఎంగిలి కూడు తినే ఒక కుహన మేధావిని తరచూ చూసేవాళ్ళం GA వెబ్సైటు లో అప్పుడు ఆయన గారు పెద్ద హీరో మన GA కి, ఇప్పుడు కొత్తగా సూడో సెక్యూలర్ మేధావి ప్రకాష్ రాజ్ గారు వచ్చారు, BJP తో ఎవరు జత కట్టిన హిందూ అనే మాట విన్నా ఎందుకో ఈయనకి పడదు, అదే పరాయి వాళ్ళు హిందువులని అదేపనిగా తులనాడుతున్న భలే పసందుగా ఉంటుంది, ఇప్పుడు పవన్ గారిని విమర్శిస్తున్నారు కదా ఇంకేం ఈయనో పెద్ద హీరో GA కి

  2. ఈ సూక్తులు పాలస్తీనా, లేబనాన్ ఉగ్రవాదులకి సంఘీభావం తెలుపుతున్న ముస్లిం లకి, మణిపూర్ లో అశాంతి కి కారణం అవుతున్న క్రిస్టియన్స్ కి, ఖలీస్థాన్ వాళ్ళకి చెప్పడం మంచిది!

  3. ఈ ప్రకాష్ మరీ ఉడతలు పట్టే వాడిలాగా ఉన్నాడు. వీడు కూడా వీడి పని చేసుకోవచ్చు కదా. పక్క వాళ్ళ పనుల్లో వేలు ఎందుకు పెట్టడం?

Comments are closed.