యూత్ ఫుల్ లవ్ స్టోరీలకు మ్యూజిక్ కీలకం. పాటలు అద్భుతంగా రావాలి. నిర్మాత దిల్ రాజు అందుకే తన సోదరుడి కుమారుడు ఆశిష్ తొలి సినిమాకు దేవీశ్రీప్రసాద్ ను మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నారు.
సినిమా విడుదల వరకు దేవీ ని ఓ రేంజ్ లో మోసుకుంటూ వచ్చారు. కానీ సినిమా విడుదలయిన తరువాత మ్యూజిక్ నే వీక్ అని డిసైడ్ అయ్యారు. మరేం అనలేక రెండో సినిమాకు మళ్లీ దిల్ రాజుకు అనేక హిట్ ఆల్బమ్ లు ఇచ్చిన మిక్కీ జె మేయర్ తీసుకున్నారు.
ఇక్కడ దిల్ రాజు సినిమాకు మిక్కీని తీసుకోవడం మాత్రమే పాయింట్ కాదు. సుకుమార్ రైటింగ్స్ సినిమా ఇది. పైగా ఈ సినిమాకు ఎవరెవరిని తీసుకోవాలో అన్నీ సుకుమార్ నే డిసైడ్ చేసారు. తన టీమ్ జనాలనే దిల్ రాజు సినిమాకు సెట్ చేసారు.
చిన్న సినిమా అయితే దేవీని తీసుకోలేదు అని సరిపెట్టుకోవచ్చు. కానీ దిల్ రాజు సోదరుడి కొడుకు. బడ్జెట్ సమస్య లేదు. అయినా దేవీని పక్కన పెట్టారు అంటే…? రాను రాను టాలీవుడ్ దేవీని మరిచిపోయేలా కనిపిస్తోంది.